
'మాకు, సీఎంకు గొడవలు పెడుతున్నారు'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలకు ఆహ్వానించే వరకూ బంద్పై వెనక్కి తగ్గేది లేదని ప్రైవేట్ విద్యాసంస్థల జేఏసీ స్పష్టం చేసింది. శుక్రవారం హైదరాబాద్లో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టెట్, ఎంసెట్ పరీక్షలకు సెంటర్లు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.
అయితే తాము పోలీసుల తనిఖీలను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని పేర్కొంది. కొంతమంది తమకు, సీఎంకు మధ్య గొడవలు పెడుతున్నారంటూ ప్రైవేట్ విద్యా సంస్థల జేఏసీ ఆరోపించింది.