
ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని నాగమణి
గుంటూరు రూరల్: నగర శివారుల్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. మండల నల్లపాడు పోలీస్‌స్టేషన్ సీఐ బాలమురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం ఫిరంగిపురం మండలం వేములూరిపాడుకు చెందిన ఆట్ల నాగమణి(20) ఓ కార్పోరేట్ కళాశాలలో హాస్టల్‌లో ఉంటూ బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అనారోగ్యంగా ఉందని ఉదయం జరిగే స్టడీ అవర్ క్లాసులకు వెళ్లకుండా హాస్టల్ రూంలోనే ఉంది. ఈ క్రమంలో తాను ఉండే గది పక్కనే ఉన్న మరో గదిలో స్నేహితుల బ్యాగులు వెతుకుతుండగా హాస్టల్‌లో ఉండే విద్యార్థులు గమనించి ఆమె నిలదీశారు. వార్డెన్‌కు ఫిర్యాదు చేసేందుకు విద్యార్థులు వెళ్లడంతో మనస్తాపానికి గురైన నాగమణి రూం తలుపులు వేసుకుని చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గదిలోకి వెళ్లి ఎంతకీ బయటకు రాకపోవటంతో గమనించిన అధ్యాపకులు కిటికీలనుంచి చూడగా అప్పటికే ఉరివేసుకుని ఫ్యానుకు వేలాడుతుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment