
సాక్షి, గుంటూరు: కాకాని రోడ్డులో దారుణం చోటుచేసుకుంది. బీటెక్ విద్యార్థిని హత్యకు గురైంది. విద్యార్థినిని దుండగుడు కత్తితో పొడిచి చంపాడు. పొట్ట, గొంతులో 6 చోట్ల కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విద్యార్థిని మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై అర్బన్ ఎస్పీ హఫీజ్ దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన యువతి సెల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లాక్ ఓపెన్ చేస్తే హత్య కేసులో కీలక సమాచారం లభిస్తుందని పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment