♦ ముందుకు వచ్చిన ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాల సంఘం
♦ సహకరించేందుకు సిద్ధమంటూ
♦ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం లేఖ
♦ బంద్ యథాతథంగా కొనసాగిస్తామన్న ప్రైవేటు విద్యా సంస్థల టీజేఏసీ
సాక్షి, హైదరాబాద్: విజిలెన్స్ తనిఖీల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్న డిమాండ్‌తో విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చిన ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ నుంచి ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాల సంఘం బయటకు వచ్చింది. టెట్, ఎంసెట్ పరీక్షల నిర్వహణకు సహకరించేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు సోమవారం సంఘం నేతలు గౌతంరావు తదితరులు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కలసి రాతపూర్వకంగా ఈ విషయాన్ని తెలియజేశారు. అలాగే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం నేతలు కూడా తాము పరీక్షలకు సహకరిస్తామంటూ లేఖ అందజేశారు.
మరోవైపు తమ బంద్‌ను యథాతథంగా కొనసాగిస్తామని ఫార్మసీ కాలేజీలు, డిగ్రీ కళాశాలలు, డీఎడ్, బీఎడ్ కాలేజీ యాజమాన్య సంఘాల నేతలు రమణారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రాందాస్, ఎస్‌ఎన్ రెడ్డి, రాంచందర్, సతీశ్, సిద్ధేశ్వర్, విజయ భాస్కర్ తదితరులు వెల్లడించారు. ఈ అంశంపై సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తనిఖీలపై కోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామని, ఆ మేరకే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని, అంతవరకు తమ ఆందోళ నను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
టెట్, ఎంసెట్‌కు సహకరిస్తాం
Published Tue, May 3 2016 3:51 AM | Last Updated on Sun, Sep 3 2017 11:16 PM
Advertisement
Advertisement