
విద్యార్థులు ధర్నా... పోలీసులు లాఠీ చార్జీ
హైదరాబాద్: ఆహారం, మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవని ఆరోపిస్తూ నిజాంపేటలోని ఓ ప్రైవేట్ కళాశాల హాస్టల్ ఎదుట విద్యార్థులు శనివారం ఆందోళనకు దిగారు. తెల్లవారుజామున కాలేజీ హాస్టల్కు నిప్పు పెట్టారు. దీంతో హాస్టల్లోని ఫర్నీచర్ పూర్తిగా కాలిపోయింది. దాంతో కళాశాల హాస్టల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన హాస్టల్కు చేరుకున్నారు. పోలీసుల రాకతో విద్యార్థులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో పోలీసులపైకి విద్యార్థులు రాళ్లు రువ్వారు. పోలీసులు విద్యార్థులపై లాఠీ చార్జీ చేశారు. ఈ ఘటనలో విద్యార్థులు గాయపడినట్లు సమాచారం.