తమిళనాడులో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య | Engineering student kills self in Tamil Nadu | Sakshi
Sakshi News home page

తమిళనాడులో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

Published Sat, Dec 5 2015 3:33 PM | Last Updated on Sun, Sep 2 2018 3:39 PM

Engineering student kills self in Tamil Nadu

కొయంబత్తూర్: ఇంజినీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థిని(18) బలవన్మరణం చెందింది. ఈ ఘటన తమిళనాడులోని కొయంబత్తూరులో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... సెలమ్ జిల్లా మెట్టూరుకు చెందిన సింతియా కొయంబత్తూర్లోని ఇంజినీరింగ్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ప్రైవేట్ కాలేజీ హాస్టల్లో ఉంటూ కాలేజీకి వెళ్తూండేది. ఈ క్రమంలో ఈ రోజు హాస్టల్ భవనం రెండో అంతస్తుపైకి ఎక్కి అక్కడి నుంచి దూకేసిందని సింతియా రూమ్మేట్స్ చెబుతున్నారు. 
 
దీంతో విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందింది. బాధితురాలి రూమ్మేట్స్ నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సింతియా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు వారు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement