Engineering student suicide
-
ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
పల్నాడు: ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం పట్టణ శివారులోని ఇంజినీరింగ్ కళాశాలలో చోటుచేసుకుంది. వివరాలు.. ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థిని పట్టణంలోని ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్లో ఉంటూ ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం ఈసీఈ చదువుతోంది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో బాత్రూమ్లోకి వెళ్లి హెయిర్‌లోషన్ తాగింది. కొంత సేపటికి వాంతులు కావడంతో గమనించిన తోటి విద్యార్థులు హాస్టల్ వార్డెన్‌కు సమాచారం ఇచ్చారు. ప్రథమ చికిత్స అనంతరం పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందింది. ఓత్తిడిని తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. -
ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
గండేపల్లి (తూర్పుగోదావరి) : ఇంజినీరింగ్ విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై బి.తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామానికి చెందిన కిలుకూరి అలేఖ్య (19) మండలంలోని సూరంపాలెంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్ఈ సెకండ్ ఇయర్ చదువుతూ, అదే కళాశాలకు చెందిన హాస్టల్లో ఉంటోంది. కొంతకాలం నుంచి తలనొప్పితో బాధపడుతూ విజయవాడలోని ఓ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటోంది. ఆదివారం ఉదయం 6.40 గంటల సమయంలో తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న ఆమె తాను ఉంటున్న హాస్టల్లోని నాల్గో అంతస్తు పైనుంచి కిందకు దూకేసింది. ఆమె తలకు బలమైన గాయమై రక్తస్రావం జరిగింది. పక్కగదిలో ఉన్న హాస్టల్ విద్యార్థినులు ఈ విషయం గమనించి వార్డెన్‌కు సమాచారం అందించారు. సంఘటనా స్థలంలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆమెను కళాశాల సిబ్బంది వెంటనే చికిత్స నిమ్తితం కాకినాడ ట్రస్ట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్టు ధ్రువీకరించారు. మృతురాలి తండ్రి ప్రసాద్ రెడ్డి, బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేయనున్నట్టు ఎస్సై తెలిపారు. ప్రగడవరంలో విషాదఛాయలు చింతలపూడి: విద్యార్థిని ఆత్మహత్యతో స్వగ్రామం ప్రగడవరంలో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన చిలుకూరి ప్రసాద్‌రెడ్డి, నాగమణి దంపతుల కుమార్తె అలేఖ్య. విషయం తెలిసిన వెంటనే కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యులు, బంధువులు హుటాహుటిన కాకినాడ తరలివెళ్లారు. చదువులో చలాకీగా ఉండే అలేఖ్య మృతితో గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. -
ఎందుకిలా చేశావమ్మా?
కురబలకోట (చిత్తూరు జిల్లా): కురబలకోట మండలం అంగళ్లులో ఇంజనీరింగ్ విద్యార్థిని పి.భవ్య (19) సోమవారం ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఉంటున్న ప్రైవేట్ హాస్టల్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. ముదివేడు ఎస్ఐ సుకుమార్ కథనం మేరకు.. కడపకు చెందిన పి.భవ్య మదనపల్లె దగ్గర అంగళ్లులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. రెండు నెలల క్రితం కళాశాల దగ్గరున్న ఓ ప్రైవేట్ హాస్టల్లో చేరింది. అక్కడి నుంచి కళాశాలకు వెళ్లేది. సోమవారం కూడా హాస్టల్ నుంచి కళాశాలకు పరీక్ష రాయడానికి వెళ్లింది. కొంత సేపటికే తిరిగి హాస్టల్‌కు చేరుకుంది. పరీక్ష కూడా రాయలేదని చెబుతున్నారు. హాస్టల్ గది నుంచి ఆమె బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి హాస్టల్ నిర్వాహకులు చూశారు. పిలిచినా స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలో చూశారు. సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కన్పించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వీఆర్వో అంజికుమార్ సమక్షంలో గది తలుపు పగులగొట్టి లోనికి వెళ్లారు. ఘటన స్థలంలో ఆమె రాసిన సూసైడ్ నోట్ ఉంది. తన చావుకు ఎవరూ కారణం కాదని పేర్కొంది. తల్లి కృష్ణవేణి మధ్యాహ్నం అంగళ్లుకు చేరుకున్నారు. విగతజీవిగా మారిన కుమార్తెను చూసి.. ఎందుకిలా చేశావమ్మా..? అంటూ బోరున విలపించారు. ఈమె తండ్రి సంజీవరాయుడు విజయవాడలో సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్నారు. ఆమె రాసిన సుసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సారీ మమ్మీ.. సారీ డాడీ.. ‘‘నాకు వేరే మార్గం కనిపించలేదు.. నేను తప్పు చేస్తున్నా అని తెలుసు.. బట్ నన్ను మీరైనా అర్థం చేసుకోండి.. నేను ఇలా చేసుకున్నందుకు ఎవరూ రీజన్ కాదు.. బబ్లూ.. మంచిగా చదువుకొని అమ్మవాళ్లను బాగా చూసుకో.. అమ్మమాట విను. నేను చేసిన దానికి నాకు ఇదే పనిష్మెంట్..’’ ‘‘నన్ను అందరూ బాగా చూసుకున్నారు.. నామీద పెట్టుకున్న హోప్స్‌ని నిలబెట్టుకోలేక పోతున్నందుకు బాధపడకండి’’ (ఇంగ్లిష్‌లో భవ్య రాసిన సుసైడ్ నోట్ సారాంశం) -
ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్: చదువుతున్న సమయంలో ఒత్తిడి తాళలేక విద్యార్థులు చిరుప్రాయంలోనే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు కూడా ఇలాంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులకు శోకాన్ని మిగిలిస్తున్నారు. తాజాగా నగరంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కొంపల్లిలోని సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ లో 19 ఏళ్ల రంజిత్ రెడ్డి ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. కొంపల్లిలోని హాస్టల్ గదిలో అతను గురువారం ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. పేట్ బషీర్బాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రంజిత్ రెడ్డి ఆత్మహత్యకు దారితీసిన కారణాలు తెలియాల్సి ఉంది. -
ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం నిజాంపేటలో చోటుచేసుకుంది. గోకరాజు రంగరాజు ఇంజినీరింగ్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న శ్రావణి అనే విద్యార్థిని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నిజాంపేటలోని త్రివేణి హాస్టల్లో ఉంటున్న ఆమె ఇవాళ సాయంత్రం ఈ ఘటనకు పాల్పడింది. శ్రావణి స్వస్థలం ఖమ్మం జిల్లా. కాగా ఇంటి మీద బెంగతోనే తమ కుమార్తె ఈ ఘటనకు పాల్పడిందని ఆమె కుటుంబసభ్యులు చెబుతున్నారు. మరోవైపు శ్రావణి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే అని సమాచారం. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు తన చావుకు ఎవరూ కారణం కాదని, ఇంటిపై బెంగతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు శ్రావణి సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు చెబుతున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తమిళనాడులో ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
కొయంబత్తూర్: ఇంజినీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థిని(18) బలవన్మరణం చెందింది. ఈ ఘటన తమిళనాడులోని కొయంబత్తూరులో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... సెలమ్ జిల్లా మెట్టూరుకు చెందిన సింతియా కొయంబత్తూర్లోని ఇంజినీరింగ్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ప్రైవేట్ కాలేజీ హాస్టల్లో ఉంటూ కాలేజీకి వెళ్తూండేది. ఈ క్రమంలో ఈ రోజు హాస్టల్ భవనం రెండో అంతస్తుపైకి ఎక్కి అక్కడి నుంచి దూకేసిందని సింతియా రూమ్మేట్స్ చెబుతున్నారు. దీంతో విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందింది. బాధితురాలి రూమ్మేట్స్ నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సింతియా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు వారు వివరించారు.