
ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్: చదువుతున్న సమయంలో ఒత్తిడి తాళలేక విద్యార్థులు చిరుప్రాయంలోనే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు కూడా ఇలాంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులకు శోకాన్ని మిగిలిస్తున్నారు.
తాజాగా నగరంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కొంపల్లిలోని సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ లో 19 ఏళ్ల రంజిత్ రెడ్డి ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. కొంపల్లిలోని హాస్టల్ గదిలో అతను గురువారం ఫ్యాన్‍కు ఉరేసుకున్నాడు. పేట్ బషీర్‌బాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రంజిత్ రెడ్డి ఆత్మహత్యకు దారితీసిన కారణాలు తెలియాల్సి ఉంది.