విజయనగరం అర్బన్ :పదో తరగతి పబ్లిక్ పరీక్ష రాసే విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ ప్రైవేటు విద్యా సంస్థలు దందా చేస్తున్నాయి. విద్యాశాఖలోని కొంతమంది అధికారుల అండతో పలు ప్రైవేటు విద్యాసంస్థలు పరీక్ష ఫీజుతోపాటు అదనంగా సొమ్ము వసూలు చేస్తున్నాయి. విద్యాశాఖ పరీక్షల విభాగం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం... పదో తరగతి రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.125 చెల్లించాలి. మూడు సబ్జెక్టుల వరకు రూ.110, మూడు సబ్జెక్టులకు మించి రాస్తున్నట్లయితే రూ.1 25 ఫీజుగా చెల్లించాలి. ప్రైవేట్‌గా చదివే విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.650 పరీక్ష ఫీజు చెల్లించాలి. ఈ ఫీజును పాఠశాలలకు విద్యార్థులు చెల్లిస్తే ప్రధానోపాధ్యాయులు వాటిని ట్రెజెరీ కార్యాలయంలో జమ చేస్తారు.
అనంతరం నామినల్ రోళ్లను ఉప విద్యాశాఖాధికారి ద్వారా డీఈఓ కార్యాలయంలో పరీక్షల వి భాగానికి అందించి, విద్యాశాఖ ఆమోదం పొందుతా రు. జిల్లాలో మొత్తం 500 పాఠశాలకు చెందిన విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. వీటి లో గుర్తింపు లేనివి, అనుమతి లేని అదనపు సెక్షన్‌లు ఉన్నవి సుమారు 30 వరకు ప్రైవేటు పాఠశాలలు ఉన్నా యి. ఈ పాఠశాలల వారు ఏదో ఒక గుర్తింపు ఉన్న పాఠశాల ద్వారా విద్యార్థులను పరీక్షలకు పంపుతున్నారు. ఇలాంటి లొసుగులను ఆసరాగా తీసుకొని కొన్ని పాఠశాలల్లో రూ. 300 వసూలు చేస్తుండగా మరికొన్నింటిలో రూ. 600 నుంచి రూ.800, రూ1000 వరకూ రాబడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం విద్యాశా ఖ అధికారులకు తెలిసినా... నజరానాలు ముట్టడంతో మిన్నకుండిపోతున్నారు.
ఈ విషయంలో ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు, సంబంధిత అధికారుల మధ్య వారధిగా విద్యాశాఖ పరీక్షల విభాగంలోని కొం దరు సిబ్బంది, డీఈఓ కార్యాలయంలో కొందరు సిబ్బం ది కీలకపాత్ర వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పిల్ల ల భవిష్యత్తికి ముడిపడిన సమస్య కావడంతో ప్రైవేటు విద్యాసంస్థల వసూళ్ల దందాను తల్లిదండ్రులు బయటకు చెప్పలేకపోతున్నారు. గత ఏడాది 30 వేల మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలకు హాజరయ్యారు. వీరి లో 13 వేల మందికి పైగా ప్రైవేటు పాఠశాలల విద్యార్థులే ఉన్నారు. గుర్తింపులేని పాఠశాలలను ఉపేక్షించబోమని విద్యాసంవత్సరం ఆరంభంలో హెచ్చరికలు జారీ చేసే విద్యాశాఖ అధికారులు ఆ తరువాత మామూళ్ల మత్తులలో చల్లబడడంతో జిల్లాలో ఇప్పటికీ 30 వరకు గుర్తింపులేని పాఠశాలలు కొనసాగుతున్నాయి.
ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం
టెన్త్ పరీక్ష ఫీజులను నిబంధనలకు విరుద్ధంగా అదనం గా వసూళ్లు చేసే ప్రైవేటు విద్యాసంస్థలపై ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని డీఈఓ జి.కృష్ణారావు తెలిపారు. నిర్ణీత ఫీజు మాత్రమే చెల్లించాలని చెప్పారు.
టెన్త్ విద్యార్థులపై ప్రైవేటు ఫీ‘జులుం’
Published Sun, Nov 30 2014 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM
Advertisement
Advertisement