విజయనగరం :అర్బన్: పాఠశాల విద్యారంగంలో కీలకపాత్ర వహిస్తున్న జిల్లా ఉమ్మడి పరీక్షల మండలి (డీసీఈబీ) వ్యవస్థకు ప్రభుత్వం మంగళం పాడేసింది. పాఠశాల విద్యలో 6 నుంచి 10వ తరగతి వరకూ పరీక్షా పత్రాలను తయారు చేయడం నుంచి విద్యా వ్యవస్థలో వచ్చే మార్పులు, సంస్కరణలపై ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ఎప్పటికప్పుడు అవగాహన కలిగించడం వరకు కీలకభూమిక పోషిస్తూ విద్యారంగం అభివృద్ధికి తోడ్పడుతున్న ఈ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.
ఈ మేరకు జీఓ నంబరు 118ను పాఠశాల విద్యాకమిషనర్ ఉషారాణి అన్ని జిల్లాల విద్యాశాఖలకు పంపారు. పాఠశాల విద్యారంగంలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న ఈ వ్యవస్థను రద్దు చేయడంపై ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విద్యాహక్కు చట్టం అమలులో భాగంగా 14 ఏళ్లలోపు పిల్లలకు విద్యను ఉచితంగా అందించడంలో, పాఠశాలలో చదువుకోని, అక్షరజ్ఞానం ఉన్న పిల్లలకు ప్రత్యేక పరీక్ష నిర్వహించి 8, 9వ తరగతులకు అర్హత కల్పించే విషయంలో ఈ వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తోంది. దీనివల్ల విద్యాహక్కు చట్టం అమలు (2009-10) అయినప్పటి నుంచి ఇంతవరకు జిల్లాలో ఏడాదికి 800 నుంచి వెయ్యి మంది వరకు విద్యార్థులు 9వ తరగతి విద్యా అర్హత పొందుతూ వచ్చారు. బోర్డును రద్దు చేయడంతో ఈ ప్ర క్రియకు బ్రేక్ పడుతుంది.
దీంతోవిద్యాహక్కు చట్టానికి తూట్లు పొడిచినట్లయింది. జిల్లా స్థాయిలో విద్యాప్రమాణాలను కొలమానికంగా చేసుకొని ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల తరగతులకు త్రై మాస,అర్ధ సంవత్సర పరీక్షా పత్రాలు తయారుచేసి డీసీఈబీ పంపిణీ చేసేది. ఇటీవల అమల్లోకి వచ్చిన సమగ్ర నిరంతర మూల్యాంక న(సీసీఈ) విధానం వల్ల క్లస్టర్ పరిధి ప్రధానోపాధ్యాయులకు ఈ కీలక ప్రక్రియను అ ప్పగించారు. దీంతో ఆ పని డీసీఈబీకి లేదని సమర్థిం చుకున్నా... ప్రైవేటు విద్యాసంస్థలకు పరీక్షా పత్రాల పంపిణీ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ప్రత్యేకించి పరీక్షాపత్రాల తయారీలో ప్రభుత్వ వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రైవేటు విద్యాసంస్థ లు ఇష్టానుసారంగా పరీక్షలు నిర్వహించేపరిస్థితి వస్తుంది. దీంతో పాఠశాల విద్య నాణ్యత దిగజారే పరిస్థితి ఏర్పడుతుందని ఉపాధ్యాయ వర్గాలు వాపోతున్నాయి.
ఉత్తమ ఫలితాల కోసం డీసీఈబీ ఉండాలి:
పదో తరగతి వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాల సాధన కో సం డీసీఈబీ కీలకపాత్ర వహిస్తోందని, అలాంటి వ్యవస్థను రద్దు చేయడం సరికాదని ప్రధానోపాధ్యాయ సం ఘం ప్రధాన కార్యదర్శి టి.సన్యాసిరాజు అన్నారు. ఎప్పటికప్పుడు మారుతున్న సిలబస్‌పై జిల్లా స్థాయిలో ఉపాధ్యాయులకు అవగాహన సదస్సులు నిర్వహించడంతోపాటు, ఉత్తమ ఫలితాల సాధన కోసం ఏటా స్టడీ మెటీరియల్ తయారు చేసి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు పంపిణీ చేయడం వంటి కీలకపాత్ర వహించేదన్నారు.
‘డీసీఈబీ’కి మంగళం
Published Wed, Oct 1 2014 2:41 AM | Last Updated on Sun, Sep 2 2018 3:39 PM
Advertisement