ప్రైవేట్ కాలేజీల ఫీజులుం | Private college's collecting extra fees | Sakshi
Sakshi News home page

ప్రైవేట్ కాలేజీల ఫీజులుం

Published Wed, Oct 23 2013 4:18 AM | Last Updated on Sun, Sep 2 2018 3:39 PM

Private college's collecting extra fees

విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్:ప్రైవేట్ కళాశాలల అక్రమాలకు అంతేలేకుండా పోతోం ది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అనవసర భయాన్ని అలుసు గా చేసుకుని కొన్ని కళాశాలల యాజమాన్యాలు ఇష్టానుసారం దోచుకుంటున్నాయి. పరీక్ష రుసుమును సైతం తమకు నచ్చిన విధంగా పలు అన్ ఎయిడెడ్ కళాశాలల యాజమాన్యాలు వసూలు చేస్తున్నా యి. పభుత్వం ప్రకటించిన ఫీజుకు మూడు రెట్లు అదనంగా ముక్కుపిండి మరీ గుంజుతున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అవస్థలకు గురికావలసి వస్తోంది. ఇంటర్మీడియెట్ విద్యార్థులు పరీక్ష ఫీజుగా రూ.300 మాత్రమే చెల్లించవలసి ఉండగా యాజమాన్యాలు బలవంతంగా రూ.వెయ్యి వరకూ వసూలు చేస్తున్నాయి.
 
 సైన్స్ విద్యార్థులైతే పరీక్ష ఫీజు, ప్రాక్టికల్ రుసుముతో కలిపి రూ.400 చెల్లించాల్సి ఉండగా వారి వద్ద నుంచి రూ.1200 వసూలు చేస్తున్నారు. ఈ విధంగా జిల్లాలోని అన్‌ఎయిడెడ్ కళాశాలల్లోని విద్యార్థుల సంఖ్యను బట్టి లెక్కలు వేస్తే దాదాపు కోట్లలోనే వసూళ్ల దందా సాగుతోందని చెప్పాలి.
 జిల్లాలో 2013-14 విద్యా సంవత్సరంలో 22 ప్రభుత్వ, 5 ఎయిడెడ్, 78 అన్‌ఎయిడెడ్ కళాశాల్లో మొత్తం 48,105  మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 23,847 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు కాగా, 23,625 వేల మంది ద్వితీయ సంవత్సర విద్యార్థులు.
 
 పభుత్వ, ఎయిడెడ్ కాలేజీల్లో నిర్ణీత పరీక్ష ఫీజునే వసూలు చేస్తుండగా అన్‌ఎయిడెడ్ కళాశాలలు మాత్రం అందు కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. రెండు సంవత్సరాలకు కలుపుకొని అన్‌ఎయిడెడ్ కళాశాలల్లో 25 వేల మంది విద్యార్థులున్నారు. వీరి వద్ద నుంచి మూడు రెట్లు అదనంగా పరీక్ష ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇంటర్  రెండో సంవత్సరం సైన్స్ విద్యార్థుల(ఎంపీసీ, బైపీసీ) నుంచి ప్రాక్టికల్స్ ఫీజులను కూడా ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే రెట్టింపు వసూలు చేస్తున్నారు. ప్రాక్టికల్స్ ఫీజుగా ఒక్కొక్కరి నుంచి రూ.100 వసూలు చేయాల్సి ఉండగా నిర్బంధంగా రూ.200 వసూలు చేస్తున్నారు.
 
 ప్రాక్టికల్స్ బూచి చూపి..
 ప్రయోగ పరీక్షల బూచి చూపి సైన్స్ విద్యార్థుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. మేం చెప్పే విధంగా ఫీజు చెల్లిస్తే ప్రాక్టికల్స్‌లో మంచి మార్కులు వచ్చేలా ‘మేనేజ్’ చేస్తామని, లేకపోతే మీ ఇష్టమని భయపెడుతున్నారు. సైన్స్ విద్యార్థులు ఎంపీసీ అయితే 60 మార్కులకు, బైపీసీఅయితే 120 మార్కులకు వివిధ సబ్జెక్టుల ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ మార్కులు వారికి కీలకం. ఈ పరీక్షల్లో మంచి మార్కులు వచ్చేలా, రాత పరీక్షలో సాయం చేసేందుకు అదనంగా  ఫీజులు వసూలు చేస్తున్నట్లు కొన్ని కాలేజీల యాజమాన్యాలు తల్లిదండ్రులకు  చెబుతున్నాయని సమాచారం.
 
 అదనపు వసూళ్లకు పాల్పడితే చర్యలు     ఆర్‌ఓ బాబాజీ హెచ్చరిక
 ఇంటర్మీడియెట్ విద్యార్థుల నుంచి బోర్డు నిర్దేశించిన ఫీజునే వసూలు చేయాలి. పరీక్ష ఫీజు పేరుతో కళాశాలల యాజమాన్యాలు అక్రమంగా వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి(ఆర్‌ఐఓ) ఎల్.ఆర్. బాబాజీ హెచ్చరించారు. అదనపు ఫీజులు వసూలు చేసే కళాశాలల గురించి తమకు ఫిర్యాదు చేస్తే వాటిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదనపు ఫీజులు వసూలు చేస్తున్నట్లు తనకు కొందరు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement