DCEB
-
తిలోదకాలు
డీసీఈబీ ప్రశ్నపత్రాలు పక్కనబెట్టి సొంతంగా పరీక్షలు 90 శాతం సర్కారు స్కూళ్లలో డిజిటల్ ఏర్పాట్లు డీజీ రికార్డులు నిర్వహిస్తున్నది 50 శాతమే.. 20 శాతం ప్రైవేట్ బడుల్లో మాత్రమే డిజిటల్ పాఠాలు అన్నింటిలోనూ రెసిడెన్షియల్ పాఠశాలలు టాప్ ప్రత్యేక బృందాల తనిఖీల్లో వెలుగుచూసిన వాస్తవాలు నల్లగొండ : విద్యార్థుల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన నిరంతర సమగ్ర మూల్యాంకన (సీసీఈ) విధానం జిల్లాలో సక్రమంగా అమలుకావడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విధానం అమలు మెరుగవుతున్నా.. ప్రైవేట్ స్కూళ్లలో మాత్రం మొక్కుబడిగా సాగుతోంది. విద్యార్థుల్లో సృజనాత్మకను పెంచి.. వారిలో ఆచరణాత్మక విజ్ఞానాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు సీసీఈ విధానానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి ఒక్కో పాఠ్యాంశానికి 20 మార్కులు కలుపుతున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో సీసీఈ విధానం అమలు, బోధన సామర్థ్యం వంటి అంశాలను పరిశీలించాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీనియర్ ప్రధానోపాధ్యాయులు, నిపుణులైన ఉపాధ్యాయులతో జిల్లా విద్యాశాఖ మొత్తం 49 బృందాలను ఏర్పాటు చేసింది. గత నెల తొమ్మిది నుంచి 21వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా 488 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, మోడల్ స్కూళ్లు, ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో తనిఖీలు చేపట్టగా.. అనేక వాస్తవాలు వెలుగుచూశాయి. సమగ్ర మూల్యాంకనానికి తూట్లు.... జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సీసీఈ విధానం అమలు మెరుగవుతున్నా.. ప్రైవేట్ బడుల్లో మాత్రం తూట్లు పొడిచారు. బట్టీ చదువులు, గైడ్లు, స్టడీ మెటిరీయల్‌ను విద్యార్థులకు అలవాటు చేస్తూ సీసీఈ విధానాన్ని నిర్వీర్యం చేస్తున్నట్లు పర్యవేక్షణ బృందాల పరిశీలనలో తేలింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారనం పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఒక్కో సబ్జెక్ట్‌కు 80 మార్కులు పోను మిగిలిన 20 మార్కులను విద్యార్థుల అంతర్గత మూల్యాంకనం (సామరŠాథ్యలు, వారు తయారు చేసిన ప్రాజెక్టులు, పుస్తక సమీక్షలు, ఇంటి పని, ఎఫ్ఏ, ఎస్ఏలో సాధించిన ఫలితాలు) ద్వారా కేటాయించాలి. ఈ 20 మార్కుల కేటాయింపులో ప్రైవేట్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని పరిశీలన బృందాలు గుర్తించాయి. డీసీసీఈబీ ప్రశ్నపత్రాలు కాకుండా సొంత క్వశ్చన్ పేపర్లతో పరీక్షలు నిర్వహిస్తున్నాయని గమనించాయి. ఈ మేరకు సీసీఈ విధానం నిర్వహణపై బృందాల సభ్యులు మరోసారి అవగాహన కల్పించారు. తనిఖీల్లో తేలిన వాస్తవాలు.. జిల్లావ్యాప్తంగా 488 పాఠశాలలను విద్యా శాఖ బృందాలు సందర్శించాయి. 210 ప్రైవేట్, 230 ప్రభుత్వ, 10 ఆశ్రమ పాఠశాలలు, 22 కేజీబీవీలు, 16 ఆదర్శ పాఠశాలలను పరిశీలించాయి. ప్రభుత్వ పాఠశాలల్లో సీసీఈ అమలు పర్వాలేదని, ప్రైవేట్ పాఠశాలల్లో పాక్షికంగా మాత్రమే అమలవుతోందని జిల్లా విద్యాశాఖ అధికారులకు నివేదిక సమర్పించాయి. ప్రధానంగా ప్రైవేట్ స్కూళ్లలో టీచర్లకు సీసీఈ విధానంపై అవగాహన లేదని.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో ఈ విధానం అమలు కావడం లేదని.. పట్టణ ప్రాంతాల్లో పేరొందిన స్కూళ్లలో మాత్రమే సక్రమంగా అమలవుతోందని పేర్కొన్నారు. బృందాలు సమర్పించిన నివేదిక ప్రకారం.. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో డీసీఈబీ ప్రశ్నపత్రాలతో పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాలు వంద శాతం ఈ ప్రశ్నపత్రాలతోనే నిర్వహించాయి. అన్ని సబ్జెక్టుల జవాబులు దిద్దినప్పటికీ.. సూచికల ప్రకారం జవాబు పత్రాలను మూల్యాంకనం చేసినవి 60 శాతం పాఠశాలలు మాత్రమే. పరీక్ష ఫలితాలపై తల్లిదండ్రులతో చర్చించడం, క్యుములేటివ్ రికార్డులు అందజేసే విధానాన్ని ప్రభుత్వ పాఠశాలలు 80 శాతం పాటించగా, ప్రైవేట్ స్కూళ్లు 50 శాతం మాత్రమే పాటిస్తున్నాయి. వంద శాతం ప్రభుత్వ పాఠశాలలు సమ్మేటివ్ పరీక్షల వివరాలను సీసీఈ రిజిస్టర్లో నమోదు చేస్తుండగా.. 40 శాతం ప్రైవేటు పాఠశాలల్లో మాత్రమే ఇది అమలవుతోంది. భాషా సబ్జెక్టుల్లో పుస్తక సమీక్షలు నిర్వహించి మార్కులు కేటాయించడం ప్రభుత్వ పాఠశాలల్లో 60 శాతం అమలవుతుండగా.. ప్రైవేటు పాఠశాలల్లో 30 శాతం మాత్రమే అమలవుతోంది. గ్రంథాలయ పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు కొన్ని ప్రైవేట్ స్కూళ్లలో మాత్రమే గమనించారు. విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలు, రికార్డులు, నివేదికలు 70 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగ్గానే ఉన్నాయి. 30 శాతం ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రమే ప్రయోగాలు చేయిస్తున్నారు. గణిత శాస్త్రంలో నూతన సమస్యలు రూపొందించడం ఏ పాఠశాలల్లోనూ సక్రమంగా జరగడం లేదు. దీనికి ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు తెలివైన వారు లేకపోవడం ఒక కారణం కాగా, ప్రైవేట్ పాఠశాలల్లో తెలివైన విద్యార్థులు ఉన్నప్పటికీ, వాటిని రూపొందించడంలో ఉపాధ్యాయులకు అవగాహన లేనట్లు కనిపిస్తోంది. పిల్లలు ఎక్కువ శాతం గైడ్లు చూసి రాస్తున్నారు. ఇది ప్రైవేట్ పాఠశాలల్లో 80 శాతం ఉంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 50 శాతం వరకు సృజనాత్మకంగా ప్రాజెక్టులు రూపొందిస్తున్నారు. వాటి గురించి వివరిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఎక్కువగా ‘ఇంటర్నెట్’ పై ఆధారపడుతూ, కట్ అండ్ పేస్ట్ పద్ధతిలో ప్రాజెక్టులు చేస్తున్నారు. ప్రాజెక్టు రికార్డులను 80 శాతం పాఠశాలల్లో బాగా డెకరేట్ చేస్తున్నారు. మిగిలిన 20 శా తం పాఠశాలల్లో నామమాత్రంగా లేవు. 90 శాతం ప్రభుత్వ పాఠశాలలు డిజిటల్ పాఠాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి. డీజీ పాఠాలను మన టీవీ, డీజీ కంటెంట్‌ను ప్రొజెక్టర్ల ద్వారా చూపిస్తున్నారు. దీనికి రికార్డులు 50 శాతం పాఠశాలలు మాత్రమే నిర్వహిస్తున్నాయి. ‘డీజీ స్కూల్స్’ పేర్లతో ఉన్న ప్రైవేట్ పాఠశాలలో డీజీ తరగతులు లేకపోవడం శోచనీయం. 20 శాతం పాఠశాలల్లో డీజీ పాఠాలు బోధిస్తునప్పటికీ వాటికి సంబంధించిన ఇతర సీడీలు మాత్రమే చూపిస్తున్నారు. సహపాఠ్య కార్యక్రమాలకు బోధనాభ్యసన ప్రక్రియలు 80 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్నా.. రికార్డులు లేవు. 20 శాతం ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రమే సహ పాఠ్య కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. మిగిలిన పాఠశాలల్లో సబ్జెక్టులు మాత్రమే చదివిస్తున్నారు. సహపాఠ్య కార్యక్రమాలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. తల్లిదండ్రుల సమావేశాలు ఏర్పాటు చేయడంలో.. సమ్మేటివ్–1 సమాధాన పత్రాలు తల్లిదండ్రులకు చేరవేయడంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు వెనుకబడ్డాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులతో పోలిస్తే ప్రైవేట్ టీచర్లు సీసీఈ శిక్షణలకు హాజరుకాకపోవడం.. హాజరైనా అమలుపై అంతగా శ్రద్ధ చూపకపోవడం జరుగుతోంది. ప్రైవేట్ యాజమాన్యాలు వారికి స్వేచ్ఛనివ్వకపోవడమే ఇందుకు కారణం. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పోలిస్తే సీసీఈ అమలుతోపాటు మిగిలిన అన్ని విషయాల్లోనూ రెసిడెన్షియల్ పాఠశాలలు టాప్‌లోనే ఉన్నాయి. కనీస సామర్థ్యం విషయంలో ప్రభుత్వ పాఠశాలలు అధిక సంఖ్యలో వెనుకబడ్డాయి. -
‘డీసీఈబీ’కి మంగళం
విజయనగరం :అర్బన్: పాఠశాల విద్యారంగంలో కీలకపాత్ర వహిస్తున్న జిల్లా ఉమ్మడి పరీక్షల మండలి (డీసీఈబీ) వ్యవస్థకు ప్రభుత్వం మంగళం పాడేసింది. పాఠశాల విద్యలో 6 నుంచి 10వ తరగతి వరకూ పరీక్షా పత్రాలను తయారు చేయడం నుంచి విద్యా వ్యవస్థలో వచ్చే మార్పులు, సంస్కరణలపై ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ఎప్పటికప్పుడు అవగాహన కలిగించడం వరకు కీలకభూమిక పోషిస్తూ విద్యారంగం అభివృద్ధికి తోడ్పడుతున్న ఈ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఈ మేరకు జీఓ నంబరు 118ను పాఠశాల విద్యాకమిషనర్ ఉషారాణి అన్ని జిల్లాల విద్యాశాఖలకు పంపారు. పాఠశాల విద్యారంగంలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న ఈ వ్యవస్థను రద్దు చేయడంపై ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విద్యాహక్కు చట్టం అమలులో భాగంగా 14 ఏళ్లలోపు పిల్లలకు విద్యను ఉచితంగా అందించడంలో, పాఠశాలలో చదువుకోని, అక్షరజ్ఞానం ఉన్న పిల్లలకు ప్రత్యేక పరీక్ష నిర్వహించి 8, 9వ తరగతులకు అర్హత కల్పించే విషయంలో ఈ వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తోంది. దీనివల్ల విద్యాహక్కు చట్టం అమలు (2009-10) అయినప్పటి నుంచి ఇంతవరకు జిల్లాలో ఏడాదికి 800 నుంచి వెయ్యి మంది వరకు విద్యార్థులు 9వ తరగతి విద్యా అర్హత పొందుతూ వచ్చారు. బోర్డును రద్దు చేయడంతో ఈ ప్ర క్రియకు బ్రేక్ పడుతుంది. దీంతోవిద్యాహక్కు చట్టానికి తూట్లు పొడిచినట్లయింది. జిల్లా స్థాయిలో విద్యాప్రమాణాలను కొలమానికంగా చేసుకొని ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల తరగతులకు త్రై మాస,అర్ధ సంవత్సర పరీక్షా పత్రాలు తయారుచేసి డీసీఈబీ పంపిణీ చేసేది. ఇటీవల అమల్లోకి వచ్చిన సమగ్ర నిరంతర మూల్యాంక న(సీసీఈ) విధానం వల్ల క్లస్టర్ పరిధి ప్రధానోపాధ్యాయులకు ఈ కీలక ప్రక్రియను అ ప్పగించారు. దీంతో ఆ పని డీసీఈబీకి లేదని సమర్థిం చుకున్నా... ప్రైవేటు విద్యాసంస్థలకు పరీక్షా పత్రాల పంపిణీ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ప్రత్యేకించి పరీక్షాపత్రాల తయారీలో ప్రభుత్వ వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రైవేటు విద్యాసంస్థ లు ఇష్టానుసారంగా పరీక్షలు నిర్వహించేపరిస్థితి వస్తుంది. దీంతో పాఠశాల విద్య నాణ్యత దిగజారే పరిస్థితి ఏర్పడుతుందని ఉపాధ్యాయ వర్గాలు వాపోతున్నాయి. ఉత్తమ ఫలితాల కోసం డీసీఈబీ ఉండాలి: పదో తరగతి వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాల సాధన కో సం డీసీఈబీ కీలకపాత్ర వహిస్తోందని, అలాంటి వ్యవస్థను రద్దు చేయడం సరికాదని ప్రధానోపాధ్యాయ సం ఘం ప్రధాన కార్యదర్శి టి.సన్యాసిరాజు అన్నారు. ఎప్పటికప్పుడు మారుతున్న సిలబస్‌పై జిల్లా స్థాయిలో ఉపాధ్యాయులకు అవగాహన సదస్సులు నిర్వహించడంతోపాటు, ఉత్తమ ఫలితాల సాధన కోసం ఏటా స్టడీ మెటీరియల్ తయారు చేసి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు పంపిణీ చేయడం వంటి కీలకపాత్ర వహించేదన్నారు. -
పరీక్షలకే పరీక్ష
* ప్రశ్నపత్రాలెలా? * టెన్త్‌కు పేపర్లు ఎన్ని? * పరీక్ష విధానం మారిందా? * తల పట్టుకుంటున్న టీచర్లు * అయోమయంగా విద్యాశాఖ తీరు త్రైమాసిక పరీక్షల నిర్వహణ జిల్లా విద్యాశాఖకు ప్రశ్నార్థకంగా మారింది. వచ్చే నెల 16 నుంచి ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు త్రైమాసిక పరీక్షలు (సమ్మెటివ్ అసెస్మెంట్ టెస్ట్) ప్రారంభమవుతాయని విద్యాశాఖ ఇప్పటికే షెడ్యూలు విడుదల చేసింది. కానీ, ఈ ప్రశ్నపత్రాలు ఎవరు తయారు చేస్తారు? అసలు పదో తరగతి విద్యార్థులకు ఎన్ని పేపర్లు ఉంటాయి? కొత్త విధానంలో పేపర్లు తయారు చేస్తారా? పాత పద్ధతిలోనే పరీక్షలుంటాయా? జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు (డీసీఈబీ) ప్రైవేటు పాఠశాలలకు ప్రశ్నపత్రాలు పంపిస్తుందా? సర్కారీ స్కూళ్లు ఎవరికి వారే పేపర్లు తయారు చేసుకోవాలా? ఈ వరుస సందేహాలు ఇటు ఉపాధ్యాయులను.. అటు విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. స్వయంగా రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నుంచి వీటన్నింటిపై స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవటంతో... ఈ సందేహాలు జిల్లా విద్యాశాఖను సైతం పట్టి పీడిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక పరీక్షలన్నీ గతంలో డీసీఈబీ నిర్వహించేది. ముందుగానే పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య వివరాలు తీసుకుని.. పరీక్ష ఫీజుగా కొంత రుసుము వసూలు చేసి ప్రశపత్రాలు పంపిణీ చేసేది. విద్యాహక్కు చట్టం అమల్లోకి రావటంతో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఫీజు వసూలు నిషిద్ధంగా మారింది. దీంతో నిరుడే డీసీఈబీ చేతులెత్తేసింది. ప్రశ్నపత్రాలు తమరే తయారు చేసుకోవాలని సర్కారు పాఠశాలలను పురమాయించడంతో గందరగోళం తలెత్తుతుందని భావించిన ఆర్వీఎం స్టేట్ ప్రాజెక్టు డెరైక్టర్ ఆ ఖర్చును విడుదల చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఒక్కో విద్యార్థికి రూ.4 చొప్పున నిరుడు ప్రశ్నపత్రాలను డీసీఈబీనే తయారు చేసి పంపిణీ చేసింది. ఈ ఏడాది మళ్లీ అదే గందరగోళం పునరావృతమైంది. ఇప్పటికిప్పుడు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అప్రమత్తమైనా ప్రయోజనమేమీ ఉండదనే వాదన వినిపిస్తోంది. నిధులు విడుదల చేసినా ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణకు నెల పడుతుంది. అంటే సెప్టెంబరు 16 లోపు అందవు. 8వ తరగతి వరకు ప్రశ్నపత్రాలు మీరే తయారు చేసుకోవాలని ఇటీవలే డీసీఈబీ అన్ని పాఠశాలలకు సర్క్యులర్ జారీ చేసింది. ప్రైవేటు పాఠశాలలకు మాత్రం తాము సరఫరా చేస్తున్నట్లు అందులో పేర్కొంది. ప్రైవేటు స్కూళ్లు చెల్లించే ఫీజులకు ప్రశ్నాపత్రాల తయారీ తప్పనిసరి కావటంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సర్కార్ స్కూళ్లలో చదివే విద్యార్థులను గాలికొదిలేసినట్లు విమర్శలు పెల్లుబికుతున్నాయి. టెన్త్ క్లాస్‌కు సంబంధించి విద్యాశాఖ నుంచి స్పష్ట త లేక ఉపాధ్యాయులు అయోమయానికి గురవుతున్నారు. -
విద్యాశాఖలో వసూళ్లపర్వం
పైసా విదిలిస్తేనే పనులు - రికార్డు షీట్ బుక్కు అసలు రూ.125, కొసరు రూ.400 - టీసీ బుక్కు అసలు రూ.125, కొసరు రూ.500పైనే కరీంనగర్ ఎడ్యుకేషన్ : పాఠశాలల్లో అందించే టీసీ.. రికార్డు షీట్స్ బుక్కుల విలువ ఎంతో తెలుసా..? అధికారికంగా రూ.200 ఉంటే.. అనధికారికంగా మరో రూ.వెయ్యి చెల్లించాల్సిందే.. ఇక్కడ కొసరే అధికం. ప్రింట్ చేసిన రికార్డ్ షీట్ బుక్స్, టీసీ బుక్స్ ద్వారా డీసీఈబీ ఖజానాకు రూ.3.50 లక్షలు వస్తుండగా.. కొసరు రూపంలో అధికారులకు ముట్టేది ఏకంగా రూ.17 లక్షలు. నమ్మశక్యంగా లేకున్నా.. నమ్మాల్సిన నిజం. పాఠశాలలకు టీసీ, రికార్డ్ షీట్స్ బుక్కులను డీఈవో కార్యాలయం నుంచి తీసుకెళ్లేందుకు ఆయా పాఠశాలలు రూ. 200 డీసీఈబీలో చెల్లించాలి. కొసరుగా అనధికారికంగా రూ.వెయ్యి చెల్లిస్తేనే వాటిని పాఠశాలలకు అప్పగిస్తున్నారు డీఈవో కార్యాలయ అధికారులు. విద్యార్థులను చేర్చుకోవాలంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టీసీ), ప్రాథమిక స్థాయి విద్యార్థులకు రికార్డుషీట్ తప్పనిసరి. వీటిని విద్యార్థులకు ఇవ్వాలంటే విద్యార్థి గతంలో చదివిన పాఠశాల ప్రభుత్వ అనుమతి పొంది ఉండడంతోపాటు ఆ పాఠశాలకు జిల్లా విద్యాశాఖ నుంచి టీసీ, రికార్డు షీట్ బుక్ తప్పనిసరి. ఈ బుక్స్కోసం పాఠశాలల కరస్పాడెంట్లు, ప్రధానోపాధ్యాయులు డీఈవో కార్యాలయానికి రావాల్సిందే. టీసీ బుక్కు రూ.125, రికార్డు షీట్ బుక్కు రూ.75 డీసీఈబీలో చెల్లిస్తే సరిపోతుంది. కానీ.. జిల్లా విద్యాధికారి కార్యాలయంలో అధికారులు మాత్రం వాటిని ఆ రేటుకు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. తమకు ‘కొసరు’ ముట్టజెప్పితేనే షీట్లను ఇస్తామంటూ మొండికేస్తున్నారు. పాఠశాలలకు గుర్తింపు ఉన్నా.. వారు అడిగినంత ఇవ్వాల్సిందే.. లేకుంటే కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే. వారు డిమాండ్ చేసే ‘కొసరు’ ఏకంగా రూ. వెయ్యి. అసలు కన్నా.. కొసరే అధికంగా ఉండడంతో పాఠశాలల యాజమాన్యాలు లబోదిబోమంటున్నాయి. వారు అడిగినంత ఇవ్వకుంటే పాఠశాలపై పగ పెంచుకుంటారని, అందుకే ఇచ్చుకోవాల్సి వస్తోందని పాఠశాలల నిర్వాహకులు వాపోతున్నారు. టీసీ, రికార్డు షీట్ తీసుకోవడమిలా.. ప్రభుత్వ, ప్రభుత్వ అనుమతి పొందిన పాఠశాలలు టీసీ బుక్ తీసుకోవడానికి జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డులోని కార్యదర్శికి ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు క్వశ్చన్ పేపర్స్‌కు రుసుం చెల్లించి బకాయిలు లేవని ధ్రువీకరణ పత్రం పొంది ఉండాలి. అనంతరం టీసీ బుక్ కోసం మళ్లీ ప్రత్యేకంగా బ్యాంక్ ద్వారా చలానా రూపంలో రూ.125తోపాటు ఉప విద్యాధికారి ధ్రువీకరించిన పత్రాన్ని డీఈవో కార్యాలయంలో అందించాలి. దానిని సంబంధిత కార్యాలయం సెక్షన్ అధికారులు పరిశీలిం చి టీసీ బుక్ అందిస్తారు. ప్రాథమిక పాఠశాలలు రూ.75 చెల్లిస్తే సరిపోతుంది. ఈ ఏడు డీసీఈబీ మూడు వేల రికార్డు షీట్లు, వెయ్యి టీసీ బుక్‌లను ప్రింట్ చేయించింది. రికార్డు షీట్స్ బుక్స్‌కు అధికారికంగా డీసీఈబీకి వచ్చేది రూ.2.25 లక్షలు. టీసీ బుక్‌లకు రూ.1.25 లక్షలు. అధికారులకు ముట్టేది మాత్రం అక్షరాల రూ.17 లక్షలు. కొసరు మొత్తాన్ని కిందిస్థాయి ఉద్యోగులు వాటాలుగా పంచుకుంటున్నారని సమాచారం. టీసీలు అందించే విభాగాన్ని కార్యాలయంలోని ఓ ఉద్యోగికే ఏళ్ల తరబడిగా కేటాయించడంతో ఈ తంతుకు అంతులేకుండా పోతోందని గుసగుసలాడుకుంటున్నారు. వంద పేపర్లకు వేల రూపాయలా? ఒక బుక్‌లో వంద పేజీలుంటే.. దానికి జిల్లా విద్యాశాఖ అధికారులు వేలాది రూపాయలు వసూలు చేయడంపై హెచ్ఎంలు పెదవి విరుస్తున్నారు. ఇన్‌వార్డు, అవుట్‌వార్డు, స్టాంపింగ్ చేసే అటెండర్‌నుంచి విద్యాధికారి కార్యాలయంలోని అధికారి వరకు పైసలు ఇస్తేనే చేతికి బుక్స్ అనే తీరు సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటని అడిగితే బుక్ ఇవ్వకపోగా మీ పాఠశాలలో అన్నీ సరిగా ఉన్నాయా? అంటూ దబాయించే స్థాయిలో ఉన్న వీరిని పై అధికారులే సరిచేయాలని కోరుతున్నారు. సూచనలిస్తాం - ప్రసాద్‌రావు, ఏడీ, డీఈవో కార్యాలయం