
‘ప్రైవేట్’లో ఫీజులు నియంత్రించరా?
శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణను ప్రభుత్వం ఎందుకు పట్టించు కోవడంలేదని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఫీజుల నియంత్రణ కమిటీ నివేదిక, సిఫార్సులు, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణ రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ నేతలతో సీఎం సమావేశ మవడం మంచి పరిణామమని పేర్కొన్నారు.