జంబ్లింగ్‌ను నిరసిస్తూ నేటినుంచిబంద్
విజయవాడ : జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల వివాదం రోజురోజుకీ ముదురుతోంది. ప్రభుత్వం జంబ్లింగ్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేయటంతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో పరీక్షలు జరుగుతాయో లేదోనని ఇంటర్ విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించి దానికి అనుగుణంగా ఏర్పాట్లు కూడా పూర్తి చేయటంతో ప్రైవేటు కళాశాలలు దీనిని తీవ్రంగా వ్యతిరేస్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ కళాశాలలు నిరవధిక బంద్ నిర్వహించాలని నిర్ణయించాయి. దీంతో విద్యార్థుల భవితవ్యం గందరగోళంలో పడింది.
ఇంటర్ ప్రాక్టికల్స్‌లో మొదటిసారిగా... జిల్లాలో 110 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, 54 ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలలు ఉన్నాయి. వాటిలో ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మూడు లక్షల మంది ఉన్నారు. ఈ ఏడాది ఇంటర్ రెండో సంవత్సరం ఎంపీసీ విద్యార్థులు 47,226 మంది, బైపీసీ విద్యార్థులు 13,663 మంది ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకానున్నారు.ప్రభుత్వం ఇంటర్ ప్రాక్టికల్స్‌లో మొదటిసారిగా జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది, సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలించకుండా, నిపుణుల బృందం అభిప్రాయం లేకుండా ఈ నిర్ణయం తీసుకుందని, ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని ఇంటర్ బోర్డును ఆదేశించిందని విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో ఆర్‌ఐవో నేతృత్వంలోని కమిటీ 82 కళాశాలలను పరీక్షా కేంద్రాలుగా ప్రకటించింది. ఈ నెల నాలుగు నుంచి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఓఎంఆర్ షీట్లు, పరీక్ష నిర్వహణకు అవసరమైన ార్పొరేట్ కళాశాలల కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలో ఉన్న ఇంటర్ విద్యార్థుల్లో 60 శాతం మంది రెండు ప్రధాన కార్పొరేట్ కళాశాలల్లో చదువుతున్నారు. ఈ క్రమంలో జంబ్లింగ్ పేరుతో ఒక కళాశాల విద్యార్థులను వేరు కళాశాలకు ప్రాక్టికల్స్‌కు పంపేలా జంబ్లింగ్ ఏర్పాటు చేశారు. ప్రతి కళాశాలల్లో ఉండే ల్యాబ్‌లో తేడాలు ఉంటాయి. ఒక కళాశాల వినియోగించే పరికరాలు వేరే కళాశాల వినియోగించదు. నిబంధనల ప్రకారం ప్రాక్టికల్స్ ఎక్కడ చేశారో పరీక్ష కూడా అక్కడే నిర్వహిస్తేనే విద్యార్థులకు మేలు జరుగుతుంది.అలా కాకుండా ప్రాక్టికల్స్ ఒకచోట, పరీక్ష మరోచోట పెడితే విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. మరోవైపు రెండు ప్రధాన కార్పొరేట్ విద్యార్థులకు మాత్రం లబ్థి చేకూరేలా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 82 పరీక్షా కేంద్రాల్లో 16 సెంటర్లు రెండు కార్పొరేట్ సంస్థలవే. దీంతో ఆయా కార్పొరేట్ సంస్థల విద్యార్థులకు ఆ 16 పరీక్షా కేంద్రాల్లో హాల్‌టికెట్లు వచ్చేలా వ్యవహరించినట్లు సమాచారం. దీంతో మిగిలిన జూనియర్ కళాశాలల విద్యార్థులు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంది.
నేడు విద్యార్థి సంఘాల నిరసన ప్రదర్శనప్రభుత్వం తీరును నిరసిస్తూ సోమవారం నుంచి నిరవధిక బంద్ నిర్వహిస్తున్నామని జూనియర్ కళాశాలల అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. కొన్ని విద్యార్థి సంఘాలు కూడా దీనికి మద్దతు ప్రకటిస్తాయని వివరించారు. సోమవారం విద్యార్థి సంఘాలు నిరసన ర్యాలీ నిర్వహిస్తాయని తెలిపారు. ఇంటర్ ఆర్‌ఐవో రాజారావు ‘సాక్షి’తో మాట్లాడుతూ ప్రాక్టికల్స్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఓఎంఆర్ షీట్లు కూడా పంపిణీ చేశామని చెప్పారు.