గుడుపల్లె : ప్రశాంతంగా ఉన్న గ్రామంలో చిచ్చు పెట్టొద్దు. గ్రామంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయొద్దు అని మహిళలు నినదించారు. దుకాణం ఏర్పాటు చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తూ కుప్పం నుంచి ద్రవిడ వర్సిటీకి వెళ్లే రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. ఈ కార్యక్రమం మండలంలోని కనమనపల్లెలో గురువారం జరిగింది. గ్రామంలోని ద్రవిడ వర్సిటీకి వెళ్లే రోడ్డుపై ఎక్సైజ్ అధికారులు బుధవారం మద్యం దుకాణం ఏర్పాటు చేశారు. మందుబాబులు వీరంగం చేయడంతో గురువారం ఆగ్రహంతో మహిళలు రోడ్డు మీదకు వచ్చారు.
గ్రామం నుంచి మద్యం దుకాణం తరలించాలని పట్టుబట్టి, రోడ్డుపై బైఠాయిం చారు. ద్రవిడ వర్సిటీతో పాటు చుట్టుపక్కల గ్రావూలకు బస్సులు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. వుద్యం దుకాణం తొల గించే వరకు ఆందోళన చేస్తావుని హెచ్చరించారు. ఈ మార్గంలో విద్యార్థులు, ప్రజలు రాకపోకలు సాగించాలంటే మందుబాబులతో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. అంతేకాకుండా మద్యం వల్ల కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నాయని తెలి పారు.
ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి మద్యం దుకాణం తరలించాలని డిమాండ్ చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న తహశీల్దార్ వుునినారాయుణ, ఎక్సైజ్ ఎస్‌ఐ సాగర్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని వుహిళలతో మాట్లాడారు. వారి మాటలను మహిళలు ఏమాత్రమూ ఖాతరు చేయలేదు. చేసేది లేక వుద్యం దుకాణం వద్దని వినతిపత్రం సమర్పిస్తే, అధికారులకు నివేదిస్తామని అధికారులు సమాధానపరిచారు. నివేదిక వచ్చిన వెంటనే కనవునపల్లెలో వుద్యం దుకాణం తొలగిస్తావుని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వారంలోపు తొలగించకుంటే ఆందోళన చేస్తావుని వుహిళలు హెచ్చరించారు.
మద్యం దుకాణం వద్దంటూ రాస్తారోకో
Published Fri, Aug 22 2014 4:05 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM
Advertisement