పీహెచ్‌డీల అక్రమాలపై విచారణకు పిలుపు
హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిన వర్సిటీ రిజిస్ట్రార్
సాక్షి, అమరావతి: ద్రవిడియన్ వర్సిటీలో నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన ఆఫ్ క్యాంపస్ పీహెచ్‌డీలపై యూజీసీ విచారణ చేపట్టింది. ఈ మేరకు వర్సిటీకి నోటీసులు జారీ చేసింది. ప్రత్యేక ప్రొఫార్మా సూచించిన యూజీసీ, దాని ప్రకారం పీహెచ్‌డీల వివరాలు అందించాలని వర్సిటీని ఆదేశించింది. దీంతో వర్సిటీ రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్ గురువారం ఉదయం హుటాహుటిన ఢిల్లీ బయల్దేరి వెళ్లారు.
ఈ క్రమంలోనే యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా మంజూరు చేసిన పీహెచ్‌డీలను రద్దు చేయాలని కోరుతూ ఏపీ పేరెంట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు మలిరెడ్డి కోటారెడ్డి యూజీసీ చైర్మన్‌కు లేఖ రాశారు. 2010లో టూ మెన్ కమిటీ నిబంధనలకు విరుద్ధంగా 95శాతం పీహెచ్‌డీలు మంజూరు చేసినట్టు నిర్ధారించిందన్నారు. 2023 –24, 2024–25 విద్యా సంవత్సరంలో పీహెచ్‌డీల మంజూరు ప్రక్రియలో విశ్వవిద్యాలయం యూజీసీ నిబంధనలు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీర్మానాలు, కోర్టు ఉత్తర్వులు, జస్టిస్ శేషశయనరెడ్డి కమిటీ సమర్పించిన విచారణ నివేదిక అంశాలను ఉల్లంఘించడంపై సమగ్ర దర్యాప్తు చేయాలని విన్నవించారు.
లైబ్రేరియన్ నియామకంపై ఏసీబీ దర్యాప్తు
వర్సిటీలోని లైబ్రేరియన్ అసిస్టెంట్ నరేష్ నియామకంపై ఏసీబీ విచారణ చేపట్టింది. వర్సిటీ నోటిఫికేషన్ ఇచ్చి ఇంటర్వ్యూ సమయానికి కూడా సదరు వ్యక్తికి విద్యార్హత సరి్టఫికెట్లు లేకుండానే ఉద్యోగంలో చేరినట్టు గతంలో కోర్టులో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ వాస్తవాలు గుర్తించేందుకు నరే‹Ùను విచారించినట్టు సమాచారం. అయితే కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఏసీబీ అధికారులను పిలిపించి ఎటువంటి తప్పు జరగలేదని నివేదిక ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినట్టు సమాచారం. అయితే కోర్టుకు సమరి్పంచే నివేదిక కావడంతో అధికారులు తాము ఏమీ చేయలేమని తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment