Ph.D
-
ద్రవిడియన్ వర్సిటీకి యూజీసీ నోటీసులు
సాక్షి, అమరావతి: ద్రవిడియన్ వర్సిటీలో నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన ఆఫ్ క్యాంపస్ పీహెచ్‌డీలపై యూజీసీ విచారణ చేపట్టింది. ఈ మేరకు వర్సిటీకి నోటీసులు జారీ చేసింది. ప్రత్యేక ప్రొఫార్మా సూచించిన యూజీసీ, దాని ప్రకారం పీహెచ్‌డీల వివరాలు అందించాలని వర్సిటీని ఆదేశించింది. దీంతో వర్సిటీ రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్ గురువారం ఉదయం హుటాహుటిన ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ క్రమంలోనే యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా మంజూరు చేసిన పీహెచ్‌డీలను రద్దు చేయాలని కోరుతూ ఏపీ పేరెంట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు మలిరెడ్డి కోటారెడ్డి యూజీసీ చైర్మన్‌కు లేఖ రాశారు. 2010లో టూ మెన్ కమిటీ నిబంధనలకు విరుద్ధంగా 95శాతం పీహెచ్‌డీలు మంజూరు చేసినట్టు నిర్ధారించిందన్నారు. 2023 –24, 2024–25 విద్యా సంవత్సరంలో పీహెచ్‌డీల మంజూరు ప్రక్రియలో విశ్వవిద్యాలయం యూజీసీ నిబంధనలు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీర్మానాలు, కోర్టు ఉత్తర్వులు, జస్టిస్ శేషశయనరెడ్డి కమిటీ సమర్పించిన విచారణ నివేదిక అంశాలను ఉల్లంఘించడంపై సమగ్ర దర్యాప్తు చేయాలని విన్నవించారు. లైబ్రేరియన్ నియామకంపై ఏసీబీ దర్యాప్తు వర్సిటీలోని లైబ్రేరియన్ అసిస్టెంట్ నరేష్ నియామకంపై ఏసీబీ విచారణ చేపట్టింది. వర్సిటీ నోటిఫికేషన్ ఇచ్చి ఇంటర్వ్యూ సమయానికి కూడా సదరు వ్యక్తికి విద్యార్హత సరి్టఫికెట్లు లేకుండానే ఉద్యోగంలో చేరినట్టు గతంలో కోర్టులో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ వాస్తవాలు గుర్తించేందుకు నరే‹Ùను విచారించినట్టు సమాచారం. అయితే కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఏసీబీ అధికారులను పిలిపించి ఎటువంటి తప్పు జరగలేదని నివేదిక ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినట్టు సమాచారం. అయితే కోర్టుకు సమరి్పంచే నివేదిక కావడంతో అధికారులు తాము ఏమీ చేయలేమని తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది. -
విద్యార్థులే ఊపిరిగా..
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మందమతులేం కాదు, తెలివైన, చురుకైన వారు. విద్యార్థులే కాదు టీచర్లు కూడా నిరంతరం నేర్చుకుంటూనే ఉంటారు’’ అంటోంది నేషనల్ గుడ్ టీచర్ అవార్డు గ్రహీత మాలతీ టీచర్. దేశవ్యాప్తంగా యాభైమంది ఈ అవార్డు అందుకోగా అందులో మాలతీ టీచర్ ఒకరు. తమిళనాడులోని సెంగోటై్టలో పుట్టి పెరిగిన మాలతి నల్లాసైతిరా ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభాస్యం పూర్తిచేసింది. మనస్తత్వ, రసాయన శాస్త్రాల్లో మాస్టర్స్ చేసింది. రసాయనశాస్త్రంలో పీహెచ్డీ చేస్తూ టీచర్‌గా పనిచేస్తోంది. 2008లో తిరుపూర్ పెరుమతూర్ గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్లో టీచర్‌గా చేరింది మాలతి. అక్కడ మూడేళ్లు పనిచేశాక బదిలీ అవ్వడంతో తెన్కాసి గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్లో టీచర్‌గా వెళ్లింది. ఇక్కడ ఏడాది పనిచేశాక ప్రమోషన్ రావడంతో వీరకేరళంబుదూర్ గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్లో పోస్టుగ్రాడ్యుయేట్ సైన్స్ టీచర్‌గా చేరింది. గత పదేళ్లుగా ఇదే స్కూల్లో సైన్స్ టీచర్‌గా పనిచేస్తూ విద్యార్థులకు చక్కగా అర్థమయ్యేలా పాఠాలు చెబుతూ వారి మనసులో సుస్థిరస్థానాన్ని సంపాదించుకుంది. ఆటపాటలతో... పాఠాలు విద్యార్థులు సైన్స్సబ్జెక్టుని ఇష్టపడాలని మాలతి కోరిక. అందుకే ఎంతో కష్టమైన చాప్టర్లను సైతం విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధిస్తోంది. విలువిద్య, తోలుబొమ్మలాట, పాటలు పాడడం, నృత్యం, కథలు చెప్పడం ద్వారా సైన్స్ పాఠాలను వివరిస్తోంది. కరోనా సమయంలో ఇళ్లకే పరిమితమైన విద్యార్థులకు ఆన్లైన్ తరగతుల ద్వారా బోధించింది. గ్రామాల్లో మొబైల్ ఫోన్స్ లేని అంధవిద్యార్థులకు సైతం ఆడియో పాఠాలను అందించింది. నూటపద్దెనిమిది మూలకాల పట్టికను సైతం కంఠస్థం చేయాలన్న ఆసక్తి ఉన్న వారికి చక్కగా నేర్చుకునేందుకు సాయపడుతోంది. మేధో వైకల్యాలున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వీరు కూడా మంచి ఉత్తీర్ణత సాధించేలా కృషిచేస్తోంది. ఈ విద్యార్థులకు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి వారి నైపుణ్యాలను మెరుగుపరుస్తోంది. ఇలా మాలతీ టీచర్ సాయంతో సైబుల్ ఇస్లాం అనే మేధోవైకల్య విద్యార్థి 25 సెకన్లలో 20 ద్రవాల పేర్లు టకటకా చెప్పి ‘చోళన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకున్నాడు. ఇస్లాంకు మాలతీ ఆరునెలలపాటు శిక్షణ ఇచ్చింది. మహేశ్వరి, కరణ్, శక్తి ప్రభ వంటి విద్యార్థులు సైతం సెకన్ల వ్యవధిలో నూటపద్ధెనిమిది మూలకాల పీరియాడిక్ టేబుల్‌ను అప్పచెప్పి చోళన్ వరల్డ్ రికార్డు బుక్‌లో చోటు దక్కించుకున్నారు. అరవైశాతం మేధో వైకల్యం కారణంగా సరిగా మాట్లాడలేని వారితో సైతం మూలకాల పేర్లను కంఠస్థం చేయించి, గడగడా చెప్పించడం విశేషం. అవార్డులు రికార్డులు... విద్యార్థులను రికార్డుల బుక్‌లో చోటుదక్కించుకునేలా తయారు చేయడమేగాక మాలతీ కూడా కరోనా సమయంలో ఐదువందల రోజులు ఉచితంగా ఆన్లైన్ తరగతులు చెప్పి చోళన్ వరల్డ్ రికార్డు బుక్ లో చోటు దక్కించుకుంది. మాలతి కృషిని గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం 2020–2021 సంవత్సరానికిగాను డాక్టర్ రాధాకృష్ణన్ అవార్డుతో సత్కరించింది. 2022లో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఇరవై ఆరుగంటలపాటు నిరంతరాయంగా ఆన్లైన్ తరగతులు నిర్వహించి వరల్డ్ రికార్డు సృష్టించింది. ఆరోతరగతి నుంచి పై తరగతులకు పాఠాలు బోధించే మాలతీ తనకు వచ్చిన నగదు బహుమతితో విద్యార్థులకు రోటోటిక్స్ కిట్స్ కొని ఇచ్చింది. గేమ్‌లకు బానిసలు కాకుండా... స్మార్ట్ఫోన్లు వచ్చాక విద్యార్థులంతా మొబైల్ గేమ్స్‌కు అంకితమైపోతున్నారు. వీరిని ఆడుకోనిస్తూనే పాఠాలు నేర్పించడానికి మాలతి క్విజ్గేమ్ వాయిస్ యాప్‌ను రూ΄÷ందించింది. ఈ యాప్‌ను స్టూడెంట్స్‌తోనే తయారు చేయించడం విశేషం. దీనిలో పీరియాడిక్ టేబుల్ ఉంటుంది. ఈ టేబుల్లో విద్యార్థుల పేర్లు, ఇంగ్లిష్‌లోని కష్టమైన పదాలను వెతుకుతూ నేర్చుకోవచ్చు. విద్యార్థులకు నేర్పిస్తోన్న పాఠాలను వారి తల్లిదండ్రులు చూసేలా యూట్యూబ్‌లో పోస్టుచేస్తూ వారి ఉన్నతికి కృషిచేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది మాలతి టీచర్. ‘‘బోధనే నా శ్వాస, విద్యార్థులే నా ఊపిరి. డాక్టర్లు, టీచర్లకు రిటైర్మెంట్ ఉండదు. అధికారికంగా రిటైర్ అయినప్పటికీ ఆ తరువాత కూడా స్టూడెంట్స్ కోసం పనిచేస్తాను. నేను సైకాలజీ చదవడం వల్ల విద్యార్థుల్ని, వారి వైకల్యాలను అర్థం చేసుకుని పాఠాలు చెప్పగలుగుతున్నాను. ప్రతి ఒక్క టీచర్ సైకాలజీ చదివితే మరింత చక్కగా బోధించగలుగుతారు. నేషనల్ గుడ్ టీచర్ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను నేర్చుకుంటూ, విద్యార్థులకు నేర్పించడమే నా జీవితాశయం’’ అని మాలతీ టీచర్ చెబుతోంది. -
యాకమ్మ ఒక గొప్ప వెలుగు
తాళ్లపల్లి యాకమ్మ ఇంట్లో ఎవరూ చదువుకోలేదు. కథలు అంటే తెలియదు. మహబూబాబాద్ దళితవాడలో అర్ధాకలితో పెరిగిన యాకమ్మ తల్లిదండ్రుల్ని కోరింది ఒక్కటే – చదివించమని. ఇంటర్లో పెళ్లయినా ఆ తర్వాత పిల్లలు పుట్టినా యాకమ్మ చదువు మానలేదు. తెలుగులో పిహెచ్డి చేసింది. ఎం.ఏ సంస్కృతం చేసింది. ఆ సమయంలో కథలు చదివి తన బతుకు గోస కూడా కథలుగా రాయాలనుకుంది. రెండు కథాసంపుటాలు, ఒక నవల వెలువరించింది. ‘చదువుకుంటే ఏమవుతుందో నన్ను చూసైనా నా జాతి ఆడపిల్లలు తెలుసుకోవాలని నా తపన’ అంటున్న యాకమ్మ పరిచయం. ‘దళిత ఆడపిల్లలు బాగా చదువుకోవాలి. ఉద్యోగాలు తెచ్చుకోవాలి. ఆర్థికంగా గట్టిగా నిలబడాలి. ఆ తర్వాత రాజకీయ అధికారం కోసం ప్రయత్నించి పదవులు పొంది దళితుల కోసం, పేదల కోసం పని చేయాలి’ అంటారు యాకమ్మ. ఆమె ‘కెరటం’ అనే దళిత నవల రాశారు. అందులోని మల్లమ్మ అనే దళిత మహిళ పాత్ర అలాగే ప్రస్థానం సాగిస్తుంది. కష్టపడి చదువుకుని, ఉద్యోగం పొంది, ఆ తర్వాత సవాళ్లను ఎదుర్కొని సర్పంచ్ అయ్యి, ఆ తర్వాత ఎం.ఎల్.ఏ. అవుతుంది. ‘ప్రజలు’ ఎప్పుడూ ప్రజలుగానే ఉండిపోవడం ఏ కొద్దిమంది మాత్రమే ఎం.ఎల్.ఏనో ఎం.పినో అవ్వాలనుకోవడం ఎందుకు అని యాకమ్మ ప్రశ్న. యాకమ్మది వరంగల్ జిల్లా మహబూబాబాద్. అక్కడికి దగ్గరగా ఉన్న అన్నారంలోని యాకూబ్ షా వలీ దర్గాలో మొక్కుకుంటే పుట్టిందని తల్లిదండ్రులు యాకమ్మ అని పేరు పెట్టారు. ఇంటికి పెద్ద కూతురు యాకమ్మ. ఇంకో చెల్లి. తండ్రి మాదిగ కులవృత్తిని నిరాకరించి దొర దగ్గర జీతానికి పోయేవాడు. తల్లి కూలి పని చేసేది. ఇద్దరూ కూడా తమకు పుట్టిన ఇద్దరు ఆడపిల్లలు తమలాంటి జీవితం కాకుండా మంచి జీవితం చూడాలని అనుకునేవారు. ముఖ్యంగా తల్లి అబ్బమ్మ తన కూతుళ్లను బాగా చదివించాలనుకునేది. యాకమ్మ కూడా అందుకు తగ్గట్టే చదువును ఇష్టపడేది. అక్కడ పదోతరగతి దాటితే పెళ్లి చేయడం ఆనవాయితీ. యాకమ్మ ఇంటర్‌కు రాగానే పెళ్లి చేయాలని తల్లిదండ్రులు అనుకున్నారు. యాకమ్మ తల్లిదండ్రులను, భర్తను అడిగింది ఒక్కటే– పెళ్లయ్యాక కూడా చదువు కొనసాగించేందుకు అనుమతి ఇవ్వమని. మంచినీళ్లు తాగి పెళ్లయ్యాక అత్తగారింట యాకమ్మకు చదువు వీలయ్యేది కాదు. భర్త వీరాస్వామి డ్రైవర్‌గా పని చేసేవాడు. అతని తోబుట్టువుల రాకపోకలు ఉండేవి. సంపాదన చాలక తినడానికి కూడా ఉండేది కాదు. తల్లిదండ్రులు ఇచ్చిన రెండు జతల బట్టలతోనే కాలేజీకి వెళ్లి డిగ్రీ పూర్తి చేసింది యాకమ్మ. లంచ్బెల్లో స్నేహితురాళ్లు లంచ్ చేస్తుంటే దూరంగా చెట్టు కింద కూచుని మంచినీళ్లు తాగి మళ్లీ తరగతులకు వచ్చేది. ఆకలి ఉన్నా చదువు ఆపలేదు. ఇద్దరు పిల్లలు పుట్టినా చదువు ఆపలేదు. తెలుగులో పీహెచ్డీ యాకమ్మ కాకతీయ యూనివర్సిటీలో పి.జి. ఆ తర్వాత ద్రవిడ యూనివర్సిటీ నుంచి పి.హెచ్.డి. చేసింది. తెలుగు పండిట్‌గా ఉద్యోగం రావడంతో పిల్లలకు పాఠాలు చెప్పాలంటే సంస్కృతం కూడా తెలిసి ఉండాలని సంస్కృతంలో పి.జి. చేసింది. ఆ సమయంలోనే తన గైడ్ బన్న ఐలయ్య ద్వారా సాహిత్యం తెలిసింది. కథలు చదివే కొద్దీ తన జీవితంలోనే ఎన్నో కథలు ఉన్నాయి ఎందుకు రాయకూడదు అనిపించింది. కాని ఎలా రాయాలో తెలియదు. అయినా సరే ప్రయత్నించి రాసింది. ‘కథలు రాస్తున్నాను’ అని వారికీ వీరికీ చెప్తే ‘ఈమె కూడా పెద్ద రచయితనా? ఈమెకు ఏం రాయవచ్చు’ అని హేళన చేశారు. కానీ వాళ్లే ఆ తర్వాత ఆమె రచనలను అంగీకరించారు. యాకమ్మ కుమార్తె ఎం.బి.బి.ఎస్ చేస్తోంది. కుమారుడు ఇంటర్ చదువుతున్నాడు. భర్త అనారోగ్యం వల్ల పని తగ్గించుకున్నాడు. ఇంటిని, ఉద్యోగాన్ని చూసుకుంటూనే కథను విడవకుండా సాధన చేస్తోంది యాకమ్మ. చదువుకుంటే జీవితాలు మారతాయని తనను చూసి తెలుసుకోండి అని అట్టడుగు వర్గాల ఆడపిల్లలకు ఆమె మాటల ద్వారానో కథల ద్వారానో చెప్తూనే ఉంటుంది. ‘ఆడపిల్లలు చదువుకోవాలి. సమాజాన్ని మార్చాలి. పెళ్లి పేరుతోనో డబ్బులేదనో వారిని చదువుకు దూరం చేయొద్దు’ అంటుంది యాకమ్మ. ఆమె చీకట్లను తరిమికొట్టడానికి విద్యను, సాహిత్యాన్ని ఉపయోగిస్తోంది. యాకమ్మ ఒక గొప్ప వెలుగు. రెండు సంపుటాలు యాకమ్మ 2018 నుంచి రాయడం మొదలుపెట్టింది. కథ వెంట కథ రాసింది. ‘మమతల మల్లెలు’, ‘రక్షణ’ అనే రెండు సంపుటాలు వెలువరించింది. ఆ తర్వాత దళిత నవల ‘కెరటం’ రాసింది. తన జీవితం నుంచి తాను చూసిన జీవితాల నుంచి కథలను వెతికింది. వెతలు తెలిపింది. కోవిడ్ నేపథ్యంలో వరుసపెట్టి కథలు రాసి ‘దుఃఖ నది’ అనే సంకలనం తెచ్చింది. వెక్కిరించిన వాళ్లు, వివక్ష చూపిన వారు మెల్లగా సర్దుకున్నారు. వరంగల్ జిల్లా మొత్తం ఇప్పుడు యాకమ్మ అంటే ‘కథలు రాసే యాకమ్మేనా’ అని గుర్తిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు పిలుస్తున్నారు. అవార్డులు ఇస్తున్నారు. ఇదీ యాకమ్మ ఘనత. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఎంఈసీలో ఇక నుంచి పీహెచ్డీ కోర్సులు
సాక్షి, హైదరాబాద్: మహీంద్రా యూనివర్శిటీ ఎకోల్ సెంట్రల్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ (ఎంఇసి) 2020 విద్యా సంవత్సరం నుంచి పీహెచ్డీ కోర్సులను అందుబాటులోకి తీసుకురానుంది. ఇంజనీరింగ్, అప్లైడ్ సైన్స్, హుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్‌లో పీహెచ్‌డి కోర్సులు అందించనుంది. ఇంజనీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, అప్లైడ్‌సైన్స్‌లలో పీహెచ్డీ కోర్సును అందించనున్నారు. ఎవరైతో ఆర్ట్స్ పీహెచ్డీ చేయాలనుకుంటున్నారో అలాంటి వారి కోసం హుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్‌లో పీహెచ్డీ కోర్సులు నిర్వహిస్తోంది. ఫుల్ టైం పీహెచ్డీ స్కాలర్స్‌కు ఉచిత వసతి, భోజనంతో పాటు నెలకు రూ. 25,000 స్కాలర్ షిప్‌ను అందిచనున్నారు. ప్రతి వారం 8 గంటల పాటు కచ్చితంగా తరగతులు నిర్వహిస్తారు. (ఏఐపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం) అత్యుత్తమ ఫ్యాకల్టీతో విద్యాబోధన, వివిధ రకాల టెక్నాలజీలకు సంబంధించి అన్ని సౌకర్యాలతో కూడిన 23 ల్యాబ్‌లు, సూపర్ కంప్యూటర్ ల్యాబ్‌లు, వీఎల్ఎస్ఐ ల్యాబ్, ఆటోమోటివ్ అండ్ కంబషన్ ఇంజన్స్ ల్యాబ్, సెంటర్ ఫర్ రోబోటిక్స్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ మొదలైన ల్యాబ్‌లు కలవు. వీటితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, మెటిరీయల్స్, ఆప్టిక్స్ అండ్ అప్టోఎలక్టట్రానిక్స్, అప్లైడ్ మ్యాథ్‌మ్యాటిక్స్ అండి స్టాటిస్టిక్స్, ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, డిజిటల్ మీడియా అండ్ టెక్నాలజీకి సంబంధించి వివిధ రంగాలలో పరిశోధనలకు యమ్‌ఈసీ అవకాశం కల్పిస్తోంది. అర్హతలు ఉన్నవారు జూన్ 27 వరకు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన అర్హతల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి. (https://www.mahindraecolecentrale.edu.in/programs/phd) -
జర్నలిజంలో హరికృష్ణ పీహెచ్డీ
ఏఎన్‌యూ: యూనివర్సిటీ జర్నలిజం విభాగంలో పరిశోధన గ్రంథాన్ని సమర్పించినందుకుగాను హరికృష్ణ అనే స్కాలర్‌కు యూనివర్సిటీ పీహెచ్‌డీని ప్రదానం చేసిందని రీసెర్చ్ సెల్ కో–ఆర్డినేటర్ ఆచార్య కె.రత్న షీలామణి గురువారం తెలిపారు. జర్నలిజం విభాగం కో–ఆర్డినేటర్, అధ్యాపకురాలు డాక్టర్ అనిత పర్యవేక్షణలో ‘న్యూస్ ఫొటోగ్రాఫర్స్ అండ్ ది న్యూస్ పేపర్స్ : యాన్ ఎక్స్‌ప్లోరేటరీ స్టడీ ఆఫ్ ప్రొఫెషనల్ యాస్పెట్స్’ అనే అంశంపై హరికృష్ణ పరిశోధన గ్రంథాన్ని సమర్పించారు. ఏఎన్‌యూ జర్నలిజం విభాగం ఆధ్వర్యంలో తొలి పీహెచ్డీ పట్టా అందుకున్న హరికృష్ణను గురువారం వీసీ ఆచార్య రాజేంద్రప్రసాద్ అభినందించారు. కార్యక్రమంలో ఓఎస్డీ ఆచార్య ఏవీ దత్తాత్రేయరావు, జర్నలిజం విభాగ కో–ఆర్డినేటర్, పరిశోధన పర్యవేక్షకురాలు డాక్టర్ అనిత తదితరులు పాల్గొన్నారు. -
1.90 లక్షల పోస్టులు ఖాళీ
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 1.90 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. వాటిలో అత్యంత అవసరమనుకున్న వాటిని మాత్రమే దశలవారీగా భర్తీ చేస్తామన్నారు. ఆయన శాసన మండలిలో గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. విపక్ష నేతల ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. వాటిలో మరికొన్ని... ‘బృహత్ బెంగళూరు మహానగర పాలికేకు భవనాలు, ఖాళీ స్థలాలు చేరి 5,107 ఆస్తులున్నాయి. వాటిలో కబ్జాకు గురైన వాటికి తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించాం. మిల్లర్స్ రోడ్డులోని ఖాళీ స్థలాన్ని 43 మంది కబ్జా చేసిన మాట వాస్తవమే. అందులో అన్ని పార్టీలకు చెందిన నేతలూ ఉన్నారు. వారిపై తప్పకుండా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. త్వరలో రాష్ట్ర నూతన పారిశ్రామిక పాలసీ (స్టేట్ ఇండస్ట్రీయల్ పాలసీ) విడుదల చేస్తాం. వచ్చే ఏడాది రాష్ట్రంలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ మీట్-జిమ్) నిర్వహిస్తాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతి చిన్న, చిన్న, మధ్య తరహాకు చెందిన 29,368 పరిశ్రమలు స్థాపించబడ్డాయి. హీరోహోండా, ఏషియన్‌పెయింట్స్ కంపెనీలు తమ కార్యక్రమాలను కర్ణాటకలోనే ప్రారంభించనున్నాయి. ఈ రెండు కంపెనీలు మా ప్రభుత్వ ప్రతిపాదనలు నచ్చక ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయని వస్తున్న వార్తల్లో నిజం లేదు. రాష్ట్రంలోని కారాగారాల్లో ఖైదీలు గంజాయి వినియోగిస్తున్నారన్న విషయంపై సమగ్ర తనిఖీ చేయాలని హోంశాఖ అధికారులను ఆదేశించాం.’