జర్నలిజంలో హరికృష్ణ పీహెచ్‌డీ
ఏఎన్‌యూ: యూనివర్సిటీ జర్నలిజం విభాగంలో పరిశోధన గ్రంథాన్ని సమర్పించినందుకుగాను హరికృష్ణ అనే స్కాలర్‌కు యూనివర్సిటీ పీహెచ్‌డీని ప్రదానం చేసిందని రీసెర్చ్ సెల్ కో–ఆర్డినేటర్ ఆచార్య కె.రత్న షీలామణి గురువారం తెలిపారు. జర్నలిజం విభాగం కో–ఆర్డినేటర్, అధ్యాపకురాలు డాక్టర్ అనిత పర్యవేక్షణలో ‘న్యూస్ ఫొటోగ్రాఫర్స్ అండ్ ది న్యూస్ పేపర్స్ : యాన్ ఎక్స్‌ప్లోరేటరీ స్టడీ ఆఫ్ ప్రొఫెషనల్ యాస్పెట్స్’ అనే అంశంపై హరికృష్ణ పరిశోధన గ్రంథాన్ని సమర్పించారు. ఏఎన్‌యూ జర్నలిజం విభాగం ఆధ్వర్యంలో తొలి పీహెచ్‌డీ పట్టా అందుకున్న హరికృష్ణను గురువారం వీసీ ఆచార్య రాజేంద్రప్రసాద్ అభినందించారు. కార్యక్రమంలో ఓఎస్‌డీ ఆచార్య ఏవీ దత్తాత్రేయరావు, జర్నలిజం విభాగ కో–ఆర్డినేటర్, పరిశోధన పర్యవేక్షకురాలు డాక్టర్ అనిత తదితరులు పాల్గొన్నారు.