union leaders
-
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ఉద్యమ బాట!
సాక్షి, అమరావతి/గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రేషనలైజేషన్ పేరుతో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని కుదించాలని నిర్ణయించిన కూటమి సర్కారుకు వ్యతిరేకంగా ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. 20కి పైగా ఉద్యోగ సంఘాల నాయకులు ఏకతాటిపైకి వచ్చారు. మూడు రోజుల క్రితం సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. 1.34 లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిన అంశంపై ఒక కమిటీ వేసి.. సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా రేషనలైజేషన్ నిర్ణయం తీసుకోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వం మారినప్పుడల్లా జాబ్ చార్ట్ మార్చేస్తారా?ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేసి గ్రామ స్వరాజ్యానికి సిసలైన అర్థం చెబుతూ ఐదేళ్ల క్రితం వైఎస్ జగన్ ప్రభుత్వం దేశంలో తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు ద్వారా విప్లవాత్మక వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ వ్యవస్థను బలహీనపరిచే దిశగా చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న రేషనలైజేషన్ నిర్ణయంతో ఉద్యోగుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. మల్టీపర్పస్, టెక్నికల్, ఆస్పిరేషనల్ అంటూ కేటగిరీలుగా వర్గీకరించడం వల్ల.. తమ విధులు పూర్తిగా మారే అవకాశం ఉందంటూ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మారగానే జాబ్ చార్ట్ మారుతుంటే తమలో అభద్రతా భావం పెరుగుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2019 అక్టోబర్ నాటికి ఉద్యోగాల్లో చేరిన వారికి అప్పటి ప్రభుత్వం స్పష్టమైన జాబ్ చార్ట్ ప్రకటించడంతో పాటు పదోన్నతుల ప్రక్రియను కూడా నిర్ధారించింది. అలాగే కొంత మంది పదోన్నతులు కూడా పొందారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం రేషనలైజేషన్ పేరుతో మార్పులు చేయడం వల్ల.. జాబ్‌చార్ట్ పూర్తిగా మారిపోయి.. పదోన్నతుల ప్రక్రియకు భంగం కలిగే అవకాశం ఉందని ఉద్యోగులు వాపోతున్నారు. ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలనే లక్ష్యం తప్ప.. రేషనలైజేషన్ ప్రక్రియలో ఎక్కడా తమ సంక్షేమం గురించిన ఆలోచన కనిపించలేదని వారు మండిపడుతున్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చించాలి..ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత మాత్రమే రేషనలైజేషన్ ప్రక్రియపై తదుపరి నిర్ణయాలు తీసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎండీ జానీ పాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు కోరారు. ఉత్తర్వులను రద్దు చేయాల్సిందే..గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల రేషనలైజేషన్‌కు సంబంధించి.. సిబ్బంది అభిప్రాయాలు సేకరించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ఉత్తర్వులివ్వడం దారుణమని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. వెంటనే ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌కు ఆయన లేఖ రాశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఉద్యోగులంతా భయాందోళనకు, అభద్రతకు గురవుతున్నారని తెలిపారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులనుద్దేశించి ఓ ప్రకటన విడుదల చేశారు. ‘రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వు సచివాలయాల ఉద్యోగులను గందరగోళంలోకి నెట్టింది. రేషనలైజేషన్‌ను మేము వ్యతిరేకించడం లేదు. ప్రభుత్వం చేపట్టే మార్పులు ఉద్యోగుల సమస్యలను పెంచే విధంగా కాకుండా.. వాటిని పరిష్కరించే విధంగా ఉండాలి. ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన రాకపోతే సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమాలకు సిద్ధమవ్వాలి’ అని వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. -
‘నువ్వు అటెండర్‌గా పనికిరావు.. స్వీపర్‌గా పనిచేసుకో’
కుప్పం: ‘నువ్వు అటెండర్‌గా పనికిరావు..స్వీపర్‌గా, తోటమాలిగా పనిచేసుకో’ అంటూ రిజిస్టార్ వేధిస్తున్నారని బాధితురాలు మీడియాతో ఆదివారం వాపోయింది. బాధితురాలి కథనం మేరకు, 2007లో ద్రవిడ వర్శిటీలో భాగ్యలక్ష్మి అటెండర్‌గా చేరారు. అప్పటి నుంచి వివిధ విభాగాల్లో అటెండర్‌గా పనిచేస్తున్నట్టు వెల్లడించారు. గతంలో వర్సిటీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు సక్రమంగా ఇవ్వలేదని ఉద్యోగులు ధర్నాలు చేపట్టారు. అప్పట్లో భాగ్యలక్ష్మి అనారోగ్యం కారణంగా ఆ ధర్నాలకు హాజరు కాలేదు. దీంతో ఆమెపై యూనియన్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. అంతేకాకుండా ధర్నాకు రాలేదని తమిళ విభాగంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులతో భాగ్యలక్ష్మిపై దాడి చేయించి గాయపరిచారు. దీనిపై అప్పట్లో గుడుపల్లె పోలీస్ స్టేషన్లో భాగ్యలక్ష్మి ఇచ్చినా ఫిర్యాదు మేరకు ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును వాపసు తీసుకోవాలని వర్సిటీ అధికారులు వేధిస్తున్నారని, చెప్పినట్లు వినకపోతే అటెండర్ నుంచి స్వీపర్‌గా మార్చుతామని బెదిరిస్తున్నట్లు ఆమె వాపోయారు. దీంతో పాటు తన భర్త గుండె నొప్పితో బాధపడుతున్నారని, ఈ విషయం వర్సిటీ అధికారులకు తెలిసినా మరింత ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు.ఈ మేరకు వర్సిటీ మహిళా విభాగానికి ఫిర్యాదు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. 25న పేదింటి యువతి వివాహం -
ఉద్యోగ సంఘాల ఉద్యమ బాట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరి 9 నెలలు గడుస్తున్నా ఏ ఒక్క హామీ అమలు కాకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పోరాట ప్రణాళికను రచిస్తున్నారు. ఇప్పటివరకు వేర్వేరుగా ప్రభుత్వానికి తమ డిమాండ్లను ముందుంచిన ఉద్యోగ సంఘాల నేతలు ఒకే వేదికపైకి వచ్చారు. సోమవారం నాంపల్లిలోని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం కేంద్ర కార్యాలయంలో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి కార్యాచరణ సమితి(జేఏ సీ) ఏర్పాటుకు సంఘాల నేతలు ఏకగ్రీవంగా మద్దతు పలికారు. జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ)గా ఏర్పాటైన ఈ కమిటీకి చైర్మన్‌గా టీఎన్జీఓ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ వ్యవహరిస్తారు. జేఏసీ సెక్రటరీ జనరల్‌గా ఏలూరి శ్రీనివాసరావు కొనసాగుతారు. ఈ కమిటీలో తెలంగాణ ఎంప్లాయిస్, గెజిటెడ్ ఆఫీసర్స్, టీచర్స్, వర్కర్స్, పెన్షనర్స్ సంఘాలు ప్రాతినిధ్యం వహించనున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి హర్షవర్దన్‌రెడ్డి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న పీఆర్టీయూ టీజీ సైతం ఇదే జేఏసీలో భాగస్వామ్యమైంది. ప్రస్తుతం 15 మందితో స్టీరింగ్ కమిటీని వేసినప్పటికీ వారం, పది రోజుల్లో అన్ని సంఘాలను సంప్రదించి వారి ఆమోదంతో పూర్తిస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ముందుగా ప్రభుత్వానికి సమాచారం అందించాలనీ, అప్పటికీ సమస్యల పరిష్కారానికి చొరవ చూపకుంటే 15 రోజుల్లో తమ కార్యాచరణను ప్రకటించాలని సోమవారం నాటి సమావేశంలో వివిధ సంఘాల నేతలు కమిటీ ముందు స్పష్టం చేయగా... ఆమేరకు తీర్మానించాయి. తర్వాత జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడుతూ కార్యాచరణకు సంబంధించి వివరాలు వెల్లడించారు. హక్కుల కోసం కొట్లాడతాం:మారం జగదీశ్వర్ ‘రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలైంది. ప్రస్తుతం ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు అందించడం ఎంతో సంతోషకరం. ఆర్థిక స్థితిని ఆగం చేసి అప్పులపాలు చేసిన గత ప్రభుత్వ తీరును పరిగణించి కొంత సమయం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి పలు సందర్భాల్లో సూచించారు. ప్రస్తుతం వేచి చూసే పరిస్థితి దాటింది. సీఎం నుంచి ఇప్పటివరకు ఎలాంటి పిలుపు రాలేదు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం.. రాష్ట్రానికి వచ్చిన తర్వాత జేఏసీ తరపున కలిసి పరిస్థితిని వివ రిస్తాం. ఆయన నుంచి వచ్చే స్పందన బట్టి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం. నాలుగు డీఏ బకాయిలు, సీపీఎస్ రద్దు, పీఆర్సీ ఖరారు, హెల్త్ కార్డుల జారీ ప్రక్రియ, జీవో 317 సమస్యల పరిష్కారం ప్రధాన సమస్యలుగా గుర్తించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తాం. గచి్చ»ౌలి, భాగ్యనగర్ సొసైటీ స్థలాలనూ ఉద్యోగులకు అప్పగించాలి.’ జేఏసీ నిర్ణయంతోనే పోరాడుతాం: ఏలూరి శ్రీనివాసరావు ప్రభుత్వ శాఖల్లో దాదాపు 53 సంఘాల ప్రతినిధులతో చర్చించి జేఏసీ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశాం. ఉద్యోగుల సమస్యలను జేఏసీ ద్వారానే ప్రభుత్వానికి వివరిస్తాం. సమస్యలు వందల్లో ఉన్నప్పటికీ 36 అంశాలను ప్రాధాన్యత క్రమంలో కూర్పు చేసి ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇందులో ఆర్థిక పరమైన భారం లేనివి కూడా ఉన్నాయి. ఇలాంటి సమస్యలను వేగవంతంగా పరిష్కరించే అవకాశం ఉంది. వీటన్నింటినీ సీఎం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత వచ్చే స్పందన ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం. 010 పద్దు కింద లేని ఉద్యోగులకు, మోడల్ స్కూల్, కేజీబీవీలు తదితర సంస్థల్లో పనిచేస్తున్న వారికి వేతనాలు ఆలస్యంగా అందుతున్నాయి. ముందుగా ఈ–కుబేర్ అనేది రద్దు చేయాలి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలి. తీర్మానించిన వాటిలో ప్రధానాంశాలు.. » సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి » మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు » పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలి » ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వి సు నిబంధనల అమలు » ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపు » జీవో 317 సమస్యల సత్వర పరిష్కారం »కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్దీకరణ -
నారాయణ... నారాయణ!
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఆయనో మండల విద్యాధికారి. కీలకమైన కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్నారు. పదవీ విరమణ సమయం ఆసన్నమైంది. అదే సాకు చూపెట్టి భారీ వసూళ్లకు తెరలేపారు. అందుకు ఉపాధ్యాయ యూనియన్ నేతలు నడుంబిగించారు. రిటైర్మెంట్ ఫంక్షన్ భారీగా నిర్వహించాలంటూ తెరపైకి వచ్చారు. టీచర్లను వ్యక్తిగతంగా కలుస్తూ రూ.2 వేలు తక్కువ లేకుండా ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. చందా పుస్తకాలు చేతబట్టుకొని మరీ అయ్యవార్ల వద్దకు వెళ్తున్నారు. ఇదేంటీ ఎంత ఇవ్వాలో కూడా మీరే నిర్ణయిస్తారా? అని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దూషణలకు దిగుతున్నారు. సుధీర్ఘకాలం పనిచేసి రిటైర్డ్ అవుతున్న అధికారిని సన్మానించుకోవడం సముచితమే. పదవీ విరమణ సందర్భంలో అప్పటివరకు అందించిన సేవలకు గుర్తుగా ఆ ఉద్యోగులు వ్యక్తిగతంగా గౌరవించుకోవడం అనవాయితీ. కాగా తద్భిన్నమైన పరిస్థితులను ఉపాధ్యాయ సంఘాల నేతలు తెరపైకి తెచ్చారు. ఎంఈఓగా రిటైర్డ్ అవుతున్న ఓ అధికారికి సన్మానం పేరిట వసూళ్లకు తెరలేపారు. దాదాపు 440 మంది ఉపాధ్యాయులుడగా అందరీతో చందా రాబట్టాలనే దిశగా గుంపుగా వెళ్తూ విడివిడిగా అయ్యవార్లను కలుస్తున్నారు. యూనియన్ నేతల్ని చూసి తలాడించేవారు కొందరైతే, అంతే ఇవ్వాలని డిమాండ్ చేయడం ఏమిటనీ మరి కొందరు నిలదీస్తున్నారు. అలాంటి వారితో గొడవలకు దిగడం యూనియన్ నేతల వంతైంది. మరోవైపు ప్రవేటు పాఠశాల యాజమాన్యాలను సైతం వదిలిపెట్టడం లేదు. జిల్లా విద్యాధికారి, పాఠశాల విద్యా రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఈవ్యవహారంపై దృష్టి సారించి చందాలు పేరిట టీచర్లను బెదిరిస్తున్న యూనియన్ నేతల్ని కట్టడి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. -
అరే పప్పు నిన్ను చెప్పుతో కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయ్
-
అన్నం పెట్టే చేతులే అస్త్రాలు కావాలి
సాక్షి, హైదరాబాద్: ‘‘ఓటు అనే ఆయుధాన్ని ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా మార్చి తెలంగాణను సాధించగలిగాం. కేవలం ఉద్యమాలు, ఆందోళనల పేరుతో చట్టసభలకు దూరంగా జరిగే పోరాటాలు సఫలమైన చరిత్ర స్వాతంత్య్ర భారతంలో కనిపించదు. రాజకీయాలు చేయడమంటే నామోషీ అని భావించడం తప్పు. దేశానికి అన్నం పెట్టే రైతులు చట్టసభల్లోకి ఎందుకు వెళ్లకూడదు? తెలంగాణ ఉద్యమం తరహాలో.. రైతుల ఉద్యమానికి పార్లమెంటరీ పంథాను సమన్వయం చేసి, జమిలి పోరాటాలు సాగించాలి. అప్పుడే దేశ వ్యవసాయ, రైతాంగ సమస్యలకు పరిష్కారం సాధ్యం..’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. రైతుల ఆత్మగౌరవం కోసం అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ జాతీయ స్థాయి రైతు సంఘాల నేతలతో ఆదివారం రెండో రోజున కూడా ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. దేశ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించారు. నాడు తెలంగాణ వ్యతిరేకులతో ‘జై తెలంగాణ’అనిపించినట్టే.. నేడు రైతు వ్యతిరేకులతో ‘జై కిసాన్’అని పలికించేలా చేద్దామన్నారు. పట్టుబడితే సాధించలేనిదేమీ లేదు జట్టు కట్టి పట్టుపడితే సాధించలేనిదేమీ లేదని తాను ప్రారంభించిన తెలంగాణ ఉద్యమం రుజువు చేసిందని.. తనకంటే ముందు జరిగిన పోరాటాల్లో నిర్దిష్ట కార్యాచరణ కొరవడటంతో లక్ష్యం నెరవేరలేదని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇందుకు కారణాలను అన్వేషించానని.. ఆఖరి పోరాటం ఆగం కాకూడదనే దృఢ సంకల్పంతో అటు రాజకీయ పంథాను, ఇటు ఉద్యమ పంథాను సమన్వయం చేసుకుంటూ జమిలి పోరాటంతో గమ్యాన్ని ముద్దాడామని తెలిపారు. ఇప్పుడు రైతు నేతలు రాజకీయాలనే పవిత్ర యజ్ఞంలో భాగస్వాములై, దేశ రైతాంగ సమస్యల పరిష్కారానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ‘‘ఎక్కడ ఆందోళన అవసరమో అక్కడ ఆందోళన చేద్దాం, ఎక్కడ రాజకీయాలు అవసరమవుతాయో అక్కడ రాజకీయాలు చేద్దాం. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. మన శక్తిని మనం గుర్తించడంలో వెనుకబడి ఉన్నాం. రాజకీయాల్లో ఉండటం అపవిత్రం అనుకోవడం సరికాదు. జమిలిగా పోరాడుదాం. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను, అంశాలను మీ ప్రాంతాల్లోని సంఘాల నేతలు, రైతులతో చర్చించండి. వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకోండి. మళ్లీ సమావేశమై జాతీయ స్థాయిలో ఐక్య సంఘటనను నిర్మిద్దాం. దేశవ్యాప్తంగా గ్రామగ్రామానికి చేరుకునేలా రైతుల ఐక్యత చాటుదాం. దేశం నలుమూలల నుంచి రైతుల డిమాండ్లను విందాం. శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు, మేధావులు, జర్నలిస్టులను పిలిచి లోతైన చర్చలు, విశ్లేషణలు చేద్దాం. ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేసుకుందాం. రాష్ట్ర, జిల్లా, తాలూకా, గ్రామ స్థాయిలో ఫెడరల్ స్ఫూర్తితో సంఘాల నిర్మాణం చేద్దాం. రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిద్దాం. తెలంగాణ సాధన కోసం సాగిన భావజాల వ్యాప్తిలాగా.. రైతుల సమస్యల పరిష్కార భావజాలాన్ని దేశంలోని అన్ని గ్రామాల్లో వ్యాప్తి చేద్దాం..’’అని కేసీఆర్ సూచించారు. చదవండి: అక్కడ టీఆర్ఎస్ దూకుడు.. బీజేపీ ప్లాన్ ఏంటి? ‘అవ్వల్ దర్జా కిసాన్’లను తయారు చేద్దాం.. ఢిల్లీ, హైదరాబాద్ సహా ఉత్తర, దక్షిణ భారత దేశాలను అనుసంధానం చేసేందుకు రైతు కార్యాలయాలను ఏర్పాటు చేసుకుందామని రైతు సంఘాల నేతలకు కేసీఆర్ సూచించారు. సామాన్య రైతు కూడా దేశ ప్రధానితో దీటుగా చర్చించే విధంగా వారిని తీర్చిదిద్దుదామన్నారు. రైతాంగం కోసం ఏకరీతి ఎజెండాతో ఒకేసారి పోరాటాన్ని ప్రారంభిద్దామని చెప్పారు. దేశ రైతును ఆత్మ గౌరవంతో తలెత్తుకొని తిరిగే ‘అవ్వల్ దర్జా కిసాన్’గా తయారు చేద్దామని పిలుపునిచ్చారు. కేసీఆర్ నాయకత్వం వహించాలి కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక, అసంబద్ధ విధానాలను తిప్పికొట్టి వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందామని రైతు సంఘాల నేతలు తీర్మానించారు. ఆ దిశగా దేశ రైతాంగాన్ని గ్రామస్థాయి నుంచి ఐక్యం చేసేందుకు నాయకత్వం వహించాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. స్వాతంత్య్రం తర్వాత మారిన పరిస్థితుల్లో అవలంబించాల్సిన ఉద్యమ కార్యాచరణకు బ్లూప్రింట్ సిద్ధం చేయాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయం రాష్ట్ర పరిధిలోని అంశమే అయినా.. కీలక నిర్ణయాధికారం కేంద్రం చేతుల్లోనే ఉందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రాజకీయాల్లో దేశ రైతాంగం భాగస్వామ్యం కావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఆచార్య వినోభా భావే స్ఫూర్తితో దేశంలో స్వాతంత్య్ర గ్రామాలను నిర్మిద్దామన్నారు. ‘‘ఇకపై సీఎం కేసీఆర్ అనుసరించిన మార్గంలోనే కలిసి నడుద్దాం. ఓటు అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి దేశ రైతాంగ సమస్యలకు పరిష్కారాలను సాధించుకుందాం’’అని పంజాబ్, యూపీ, కేరళ, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల రైతు నేతలు పిలుపునిచ్చారు. ఒకే దేశం–ఒకే రైతు సంఘం నినాదంతో.. వాస్తవిక భారత నిర్మాణం కేసీఆర్ వంటి నాయకుల చేతుల మీదుగానే ప్రారంభం కావాలని.. ఒకే దేశం– ఒక్కటే రైతు సంఘం నినాదంతో అన్ని రాష్ట్రాల రైతులు ముందుకు సాగితే సమస్యలు పరిష్కారం అవుతాయని సౌత్ ఇండియన్ ఫార్మర్స్ యూనియన్ నేతలు స్పష్టం చేశారు. దళితబంధును దేశవ్యాప్తంగా అమలు చేయాలని యూపీకి చెందిన దళిత రైతు రాఘవేంద్ర కుమార్ పేర్కొన్నారు. కార్పొరేట్లకు వ్యవసాయ రంగాన్ని అప్పజెప్పేందుకు కుట్ర జరుగుతోందని.. దేశ రైతులు ఒక్క ఎకరం కూడా కోల్పోకుండా కాపాడుకుంటామని రైతు నేతలు తీర్మానించారు. -
ఉద్యోగుల మనోభావాలను సీఎం జగన్ గౌరవించారు
-
ఉద్యోగులకు మంచి చేయాలనే తపనతోనే ఉన్నాం: సీఎం జగన్
-
సీఎం వైఎస్ జగన్‌తో ఉద్యోగ సంఘాల భేటీ
-
సీఎం జగన్ తో సమావేశం కానున్న ఉద్యోగ సంఘాలు అధికారులు
-
చేయగలిగినంత చేస్తాం: సీఎం జగన్
''రాష్ట్ర ప్రభుత్వంపై మోయలేని భారాన్ని మోపకుండా కాస్త సానుకూల దృక్పథంతో ఉండాలి. ఇదే సమయంలో మీరు చెప్పినవన్నీ పరిగణలోకి తీసుకుంటాను. వాళ్లు (ఆర్థిక శాఖ) చెప్పిన దానికి, మీరు (ఉద్యోగ సంఘాలు) చెప్పిన దానికి వ్యత్యాసం ఉంది. అందుకే మీతో మాట్లాడుతున్నాను. నేను మీ అందరి కుటుంబ సభ్యుడిని. మీ అంచనాలు కూడా కాస్త తగ్గాలి. వీళ్లు కూడా కాస్త పెరగాల్సిన అవసరం ఉంది. మీకు మనసా, వాచా మంచి చేయాలనే తపనతో ఉన్నాను. ఇది నా హామీ.'' - సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఉద్యోగులకు ఎంత మంచి చేయగలిగితే అంత మంచి చేస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను స్వయంగా నోట్ చేసుకున్నానని తెలిపారు. అన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేయడానికి అడుగులు ముందుకేస్తామని, మెరుగ్గా చేయగలిగే దిశగా ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. దయచేసి అందరూ ప్రాక్టికల్‌గా ఆలోచించాలని ఉద్యోగ సంఘాలను కోరారు. పీఆర్సీపై చర్చించేందుకు గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని రకాలుగా మేలు చేసే ప్రయత్నాలు చేస్తామని, రెండు మూడు రోజుల్లో దీనిపై ప్రకటన చేస్తామని స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఉద్యోగులకు మంచి చేస్తూ ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వేతనాల పెరుగుదల, ఆదాయం తగ్గుతున్న తీరును ఆయన ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. నా చేతికి ఎముక ఉండదంటారు.. ► ఉద్యోగ సంఘాల నేతలు చాలా విషయాలు చెప్పారు. కొన్ని అంశాలను మీ ముందు ఉంచుతున్నాను. నా చేతికి ఎముక ఉండదని అందరూ అంటుంటారు. ఉదారంగా ఉండే విషయంలో, మానవతా దృక్పథంతో ఉండే విషయంలో, నాకన్నా బాగా స్పందించే వాళ్లు, నా కన్నా ఎక్కువగా స్పందించేవాళ్లు తక్కువగా ఉంటారు. ►ఎవరికైనా మంచే చేయాలని తాపత్రయ పడతాను. వీలైనంత ఎక్కువ మందికి మంచి చేయాలని ఆరాటపడతాను. ఆ మంచిలో ఏ ఒక్కరూ కూడా భాగస్వామ్యులు కాకుండా మిగిలి పోకూడదనేది నానైజం. వాస్తవాలను పరిగణలోకి తీసుకోవాలి ► కొన్ని వాస్తవాలను, కొన్ని అంశాలను బేరీజు వేసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకున్నా.. దాని ప్రభావం తర్వాత సంవత్సరాలన్నింటిపైనా ఉంటుంది. మనం అధికారంలోకి వచ్చాక అనుకోని పరిస్థితులు వచ్చాయి. ►ఒకవైపు పీఆర్సీ గురించి మాట్లాడుతున్నాం.. మరో వైపు ఒమిక్రాన్ విస్తరిస్తోంది. దాని ప్రభావం ఎలా ఉంటుందో కూడా తెలియదు? దాని ప్రభావం దేశ ఆదాయాల మీద, రాష్ట్ర ఆదాయాల మీద ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితులు? అలాంటి పరిస్థితుల మధ్య పీఆర్సీపై మాట్లాడుతున్నాం. ► కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ రోజు దేశ వ్యాప్తంగా 98 వేల కేసులు నమోదయ్యాయి. రేపటికి 2 లక్షలు అంటున్నారు. అనేక రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ కూడా వచ్చేసింది. ఆర్థిక పరిస్థితుల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో చెప్పలేని పరిస్థితి. తన క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ ఆదాయం తగ్గుతోంది ►నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్లో ఐజీఎస్టీ, ఎస్జీఎస్టీ.. రెండు ఆదాయాలు తగ్గిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల మధ్య మనం నిర్ణయం తీసుకోవడానికి కూర్చున్నాం. ఎలాంటి నిర్ణయం తీసుకున్నాసరే... ఆ నిర్ణయంతో మనం కలిసి ముందుకు సాగాలి. మనం చేయదగ్గ పరిస్థితి ఉందా? అన్న ఆలోచన చేయాలి. ►ఒక్కసారి స్టేట్ ఓన్ రెవెన్యూస్ (ఎస్‌ఓఆర్స్) గమనిస్తే.. 2018–19లో ఎస్ఓఆర్ రూ.62,503 కోట్లు అయితే 2019–20లో అది రూ.60,934 కోట్లకు, 2020–21లో రూ.60,688 కోట్లకు తగ్గింది. ►మామూలుగా ప్రతి ఏటా 15 శాతం పెరగాలి. ఈ లెక్కన 2018–19లో ఉన్న రూ.62 వేల కోట్లు 2019–20లో రూ.72 వేల కోట్లు కావాలి. 2020–21లో రూ.72 వేల కోట్లు రూ.84 వేల కోట్లు కావాలి. మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. జీతాలు, పెన్షన్ల వ్యయం పెరుగుతోంది ► 2018–19లో ఉద్యోగులకు జీతాలు, పెన్షన్ల రూపేణా చేసిన వ్యయం రూ.52,513 కోట్లు కాగా, 2020–21 నాటికి అది రూ.67,340 కోట్లకు చేరుకుంది. ఉద్యోగులకు అనుకూలంగా మనం తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ పెరుగుదల వచ్చింది. ►మనం అధికారంలోకి రాగానే ఆదాయం ఎలా ఉన్నా. ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చాం. దాదాపు రూ.18 వేల కోట్ల వరకు చెల్లించాం. 2019 జూలై 1 నుంచి ఈ రోజు వరకు ఐఆర్ ప్రభావం ఇది. అంగన్వాడీ, ఆశావర్కర్లు సహా వివిధ కేటగిరీలకు చెందిన ఉద్యోగులకు ప్రభుత్వం వేతనాలు పెంచింది. ►కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ తదితర విభాగాలకు చెందిన 3,01,021 ఉద్యోగులకు జీతాలు పెంచింది. తద్వారా ఏడాదికి వీరికి జీతాల రూపంలో ప్రభుత్వం చేస్తున్న ఖర్చు రూ.1,198 కోట్ల నుంచి రూ.3,187 కోట్లకు పెరిగింది. ►ఈ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైం స్కేలు సహా ఇతర ప్రయోజనాలను అందించింది. ప్రభుత్వ డిపార్ట్మెంట్లు, యూనివర్సిటీలు, సొసైటీలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు తదితర ఉద్యోగులకు వర్తింప చేసింది. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు, సహజ మరణానికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా వీరికి కూడా అమలు చేస్తోంది. తద్వారా ప్రభుత్వంపై ఏటా రూ.360 కోట్ల మేర భారం పడుతోంది. ఏపీఎస్ఆర్టీసీ విలీనంతో అదనపు భారం ►ఏపీఎస్ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేశాం. దీని వల్ల 2020 జనవరి నుంచి ఆ సంస్థ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. జనవరి 2020 నుంచి అక్టోబర్ 2021 వరకూ రూ.5,380 కోట్ల భారం ప్రభుత్వంపై పడింది. ► పరిపాలనా సంస్కరణల్లో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకు వచ్చాం. 1.28 లక్షల శాశ్వత ఉద్యోగాలు కల్పించాం. ఏడాదికి రూ.2,300 కోట్ల భారం పడింది. ఆరోగ్య రంగంలో భారీగా నియామకాలు ►ఆరోగ్య రంగంలో డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ తదితర సిబ్బందిని గతంలో ఎప్పుడూలేని విధంగా భారీగా నియమించాం. ఆస్పత్రుల్లో డాక్టర్లు లేరనే మాట రాకూడదని నియామకాలు చేపడుతున్నాం. మొత్తంగా 39 వేల మందిని ఈ ఫిబ్రవరి నాటికి నియమిస్తాం. ► రిపోర్టు సబ్మిట్ చేసే నాటికి చూస్తే, 14 వేల మందిని నియమించారు. దీనివల్ల అదనంగా ఇప్పటికే ఏడాదికి రూ.820 కోట్ల భారం ప్రభుత్వ ఖజానాపై పడింది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మేలు ►అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ప్రయోజనాల కోసం అప్కాస్‌ను ప్రారంభించాం. మధ్యవర్తులు లేకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే జీతాలను జమ చేస్తున్నాం. లక్ష మందికి ఆప్కాస్‌లో ఉద్యోగాలు కల్పించాం. ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటి సదుపాయాలు కల్పించాం. ► అప్కాస్ రూపంలో ఏడాదికి ప్రభుత్వంపై రూ.2,040 కోట్ల భారం పడుతోంది. ఎంపీడీఓలకు ప్రమోషనల్ ఛానల్ అంశాన్ని పరిష్కరించాం. గ్రేడ్–1 వీఆర్వోలకు ప్రమోషన్ ఛానల్‌ను ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 3,795 వీఆర్వో, వీఆర్ఏ పోçస్టుల భర్తీకి ఆదేశాలు ఇచ్చింది కూడా మన ప్రభుత్వమే. ►మహిళా ఉద్యోగులకు ఏటా అదనంగా ఐదు రోజులు ప్రత్యేక సెలవులు మంజూరు చేశాం. రీలొకేట్ అయిన ఉద్యోగులకు 30 శాతం హెచ్ఆర్ఏ చెల్లిస్తున్నాం. ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభుత్వంగా అడుగులు ► మొట్టమొదటి రోజు నుంచి ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభుత్వంగా మనం అడుగులు వేసినందు వల్ల, స్టేట్ ఓన్ రెవెన్యూస్‌లో ఆదాయాలు ఒకవైపు తగ్గుతున్నా.. మొత్తం శాలరీలు, పెన్షన్ల్ ఖర్చు రూ.52,513 కోట్లు నుంచి రూ.67 వేల కోట్లకు పెరిగింది. 2020–21 ఆర్థిక సంవత్సరం పరిస్థితి ఇది. ఈ ఏడాది ఖర్చులు ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఇది వాస్తవం. తెలంగాణలో పరిస్థితి చూడండి.. ►పొరుగు రాష్ట్రం తెలంగాణలో వస్తున్న ఆదాయాలు మనకు వస్తున్నాయా? వారి తలసరి ఆదాయం ఎంత? వీటన్నింటినీ ఒకసారి పరిశీలించాలని కోరుతున్నా. తెలంగాణలో సగటు తలసరి ఆదాయం రూ.2,37,632 కాగా, ఏపీలో అది కేవలం రూ.1,70,215 మాత్రమే. ►లంగాణాలో జీతాల మీద వాళ్లు ఖర్చు చేసింది రూ.17 వేల కోట్లు. పెన్షన్ల కోసం రూ.5603 కోట్లు. మొత్తం కలిపి వాళ్లు ఖర్చు చేసింది (కాగ్ రిపోర్టు ప్రకారం) రూ.22,608 కోట్లు. ఇది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు.. అంటే తొలి ఏడు నెలల కాలానికి అయిన ఖర్చు. ►అదే మన రాష్ట్రంలో 2021–22లో తొలి 7 నెలల కాలంలో జీతాలకు రూ.24,681.47 కోట్లు చెల్లించాం. పెన్షన్ల కోసం రూ, 11,324 కోట్లు చెల్లించాం. దాదాపు 36 వేల కోట్లు చెల్లించాం. ► ఇదే సమయంలో గుజరాత్లో వేతనాలు, పెన్షన్ల కోసం ఇచ్చింది కేవలం రూ.16,053 కోట్లు. బీహార్‌లో వేతనాలు, పింఛన్ల కోసం రూ.25,567.5 కోట్లు చెల్లించారు. ►రాష్ట్ర విభజనతో మనం హైదరాబాద్‌ను కోల్పోయాం. అందువల్ల మనకు ఆదాయాలు తగ్గుతున్నాయి. తెలంగాణకు ఆదాయాలు పెరుగుతున్నాయనేది వాస్తవం. 14.29 శాతం ఫిట్మెంట్ ఇస్తే ఏటా రూ.7,137 కోట్లు భారం ► మీతో సమావేశానికి ముందు పలు దఫాలుగా అధికారులతో మాట్లాడాను. ఈ రోజు మనం ఐఆర్‌తో పాటు ఏ జీతాలు ఇస్తున్నామో.. అవి ఇస్తూ.. కమిటీ చెప్పినట్టుగా 14.29 శాతం ఫిట్మెంట్ ఇస్తే ఏడాదికి ప్రభుత్వంపై పడేభారం రూ.7,137 కోట్లు. ఇది వాస్తవం. ► ఫిట్మెంట్ ఇచ్చే సమయానికి డీఏలు కూడా క్లియర్ కావాలి. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను స్వయంగా నోట్ చేసుకున్నాను. అన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేయడానికి అడుగులు ముందుకేస్తాం. మెరుగ్గా చేయగలిగే దిశగా ప్రయత్నం చేస్తాం. ► ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇదీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి..ఉద్యోగ సంఘాలకు వివరించిన అధికారులు ► రాష్ట్ర విభజన కారణంగా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు వచ్చాయి. జనాభా 58.32 శాతం వస్తే, రెవిన్యూ 46 శాతం మాత్రమే వచ్చింది. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో అతితక్కువగా తలసరి ఆదాయం రూ.1,70,215 మాత్రమే ఉంది. ► షెడ్యూలు 9లో పేర్కొన్న సంస్థల కారణంగా రూ.1.06 లక్షల కోట్ల ఆస్తులను వదిలి వచ్చాం. షెడ్యూలు 10లో ఉన్న సంస్థలను వదులు కోవడం ద్వారా రూ.39,191 కోట్ల విలువైన ఆస్తులను కోల్పోయాం. రాజధాని హైదరాబాద్‌ను కోల్పోయాం. ►విన్యూ లోటు రూపంలో కేంద్రం నుంచి రూ.18,969 కోట్ల బకాయి ఉంది. కోవిడ్ కారణంగా మరింత ఆదాయాన్ని కోల్పోయాం. కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా గణనీయంగా తగ్గింది. ►చీఫ్ సెక్రటరీ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం 14.29 శాతం ఫిట్‌మెంట్‌కు ఏడాదికి ప్రభుత్వంపై పడేభారం రూ.7,137 కోట్లు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ వ్యయం ఏపీలోనే అధికం. తెలంగాణాలో, ఛత్తీస్‌గఢ్‌లో, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మధ్యప్రదేశ్, హరియాణ రాష్ట్రాల కంటే అధికం. చదవండి: CM YS Jagan: చేరికలకు తగ్గట్టు వసతులు చదవండి: హైదరాబాద్–ఏపీకి 1,500 ప్రత్యేక బస్సులు -
విశాఖ ఉక్కును విక్రయించవద్దు
సాక్షి, న్యూఢిల్లీ/గాజువాక: విశాఖ ఉక్కు పరిశ్రమను విక్రయించాలన్న ఆలోచనను విరమించుకోవాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉక్కుకార్మిక సంఘాల ప్రతినిధులతో కలిసి ఆయన శుక్రవారం కేంద్రమంత్రితో సమావేశమయ్యారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించవద్దని వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఏళ్లతరబడి పోరాటం, 32 మంది ఆత్మబలిదానం తర్వాత 1966లో విశాఖ ఉక్కు ఏర్పాటై ఆంధ్రుల చిరకాల కల నెరవేరిందని చెప్పారు. పరిశ్రమ ఆంధ్రుల మనోభావాలతో ముడిపడి ఉందని, ప్రభుత్వరంగ సంస్థల్లో నవరత్నగా నిలిచిన విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్‌కే ఆభరణం వంటిదని పేర్కొన్నారు. 35 వేలమంది ఉద్యోగులు, కార్మికులతోపాటు లక్షకుపైగా కుటుంబాలు పరిశ్రమపై ఆధారపడి జీవనోపాధిని కొనసాగిస్తున్నాయన్నారు. స్టీల్‌ప్లాంట్ కారణంగానే విశాఖపట్నం నగరం మహానగరంగా విస్తరించి రాష్ట్రంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన నగరంగా భాసిల్లుతోందని చెప్పారు. కరోనా మహమ్మారి సమయంలోనూ విశాఖ ఉక్కు పరిశ్రమ నుంచి దేశంలోని అనేక ప్రాంతాలకు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను రైళ్ల ద్వారా తరలించి లక్షలాదిమంది ప్రాణాలను నిలబెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తి అయ్యే స్టీల్ నాణ్యతలో ప్రపంచస్థాయి సంస్థలకు పోటీ ఇస్తుందని, అలాంటి సంస్థ కేవలం సొంతంగా గనులు లేకపోయినందునే నష్టాలను చవిచూడాల్సి వస్తోందని చెప్పారు. కేవలం ఇనుప ఖనిజాన్ని మార్కెట్ రేటుకు కొనుగోలు చేయడం కోసమే విశాఖ ఉక్కు ఏటా రూ.300 కోట్లు అదనంగా భరించాల్సి వస్తోందన్నారు. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించి, అప్పులను ఈక్విటీ కింద మారిస్తే అతి తక్కువ కాలంలోనే తిరిగి లాభాలబాట పడుతుందని, తద్వారా కేంద్ర ప్రభుత్వానికి భారీగా డివిడెండ్లు చెల్లిస్తుందని ఆయన పేర్కొన్నారు. కేంద్రమంత్రిని కలిసినవారిలో వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్‌రెడ్డి, పోరాట కమిటీ నేతలు సీపీఎం నాయకుడు సీహెచ్.నర్సింగరావు, స్టీల్‌ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులు మంత్రి రాజశేఖర్, డి.ఆదినారాయణ, వరసాల శ్రీనివాసరావు, జి.గణపతిరెడ్డి, బోగాది సన్యాసిరావు, ఎం.అంబేద్కర్, పి.దేవేందర్‌రెడ్డి తదితరులున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వరంగ సంస్థగా కొనసాగించేలా చొరవ తీసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిలను బీజేపీ నాయకులు కోరారు. బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్‌ల సారథ్యంలో గాజువాక నాయకులు వారిని కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. -
జనసేన నేతలకు చేదు అనుభవం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనసేన నేతలు, కార్మిక సంఘాల నేతల మధ్య వాగ్వాదం జరిగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పవన్ వైఖరి తెలపాలని కార్మికుల డిమాండ్ చేశారు. దీక్షా శిబిరానికి పవన్ కల్యాణ్ రావాలంటూ కార్మికుల డిమాండ్ చేయగా, పవన్‌ను గాజువాకలో ఓడించారు.. ఆయనెందుకొస్తారంటూ జనసేన నేతలు ఎదురుదాడికి దిగారు. జనసేన, కార్మిక సంఘాల నేతల మధ్య వాగ్వాదంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనసేన నాయకులు వెళ్లిపోవాలంటూ కార్మికుల నినాదాలు చేశారు. -
ఆర్టీసీలో కాల్నాగు
కాల్‌నాగులు ఆర్టీసీ కార్మికులనూ వదలలేదు. తోటి కార్మికుడే యముడయ్యాడు.కార్మికులను పీల్చిపిప్పిచేస్తున్నాడు. అతడి బారిన పడిన వారిని అన్ని రకాలుగా వేధించాడు. చివరికి యూనియన్ నేతలు కల్పించుకుని విజిలెన్స్‌కు ఫిర్యాదు చేయడంతో కాల్మణి ఘటన వెలుగులోకి వచ్చింది. సాక్షి,అమరావతి బ్యూరో: ఆర్టీసీలో ఓ ఉద్యోగి వడ్డీ వ్యాపారి అవతారమెత్తాడు.. తోటి ఉద్యోగుల అవసరాలను గుర్తించి అధిక వడ్డీలకు అప్పులిచ్చాడు. అసలు మించి వడ్డీలే అధికంగా వసూలు చేశాడు. అప్పులు ఇచ్చే సమయంలో ఉద్యోగి భార్య పేరుతో ఖాళీ చెక్కులు, ప్రామిసరి నోటు రాయించుకునే వాడు.. సకాలంలో అప్పు చెల్లించకపోతే మహిళలపై కోర్టులో కేసు వేసి వారిని మానసికంగా వేధింపులు గురిచేశాడు. అతడి ఆగడాలు శ్రుతిమించడంతో యూనియన్ నేతలు విజిలెన్స్‌కు ఫిర్యాదు చేశారు. కానీ అతడి రాజకీయ పలుకబడితో చర్యలు తీసుకోవడంలో మాత్రం అధికారులు వెనుకంజ వేస్తున్నారు. ఐదేళ్లుగా వ్యాపారం.. విజయవాడ పీఎన్బీఎస్ బస్టాండ్‌లో పనిచేసే ఓ ఉద్యోగి ఐదేళ్లుగా వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో అదే బస్టాండ్‌లో పనిచేసే ఉమామహేశ్వరరావుకు రెండేళ్ల కిందట రూ.2 లక్షల రూ.4 వంతున వడ్డీతో అప్పు ఇచ్చాడు. ప్రతినెలా వడ్డీ తీసుకునే వాడు.. రెండేళ్లకే వడ్డీ రూపంలో అసలు తీసుకొన్నాడు. కొన్ని ఆర్థిక కారణాల వల్ల వడ్డీ చెల్లింపులో ఆలస్యం కావడంతో అసలుతో పాటు వడ్డీ చెల్లించాలనీ వేధించడం మొదలుపెట్టాడు. కొంత సమయం ఇస్తే పూర్తిగా చెల్లిస్తానని ఉమామహేశ్వరరావు వేడుకున్నా అతని మనస్సు కరగలేదు. వెంటనే ఉమామహేశ్వరరావు భార్య పేరుతో తీసుకున్న ఖాళీ చెక్కులు ప్రామిసరి నోటును కోర్టులో దాఖలు చేశాడు. బాధితుడి భార్య కూడా ఓ చిరుద్యోగి కా>వడంతో వారు కోర్టు వరకు వెళ్లొద్దని కొంత టైం ఇస్తే అసలు వడ్డీ చెల్లిస్తామని వేడుకున్నా ఫలితం లేదు. దీంతో వారు మానసికంగా కుంగిపోయి ఆర్టీసీలో యూనియన్ నేతల దృష్టికి తీసుకెళ్లారు. యూనియన్ నేతలు విజిలెన్స్‌కు ఫిర్యాదు చేయగా వారు విచారణ జరిపి కాల్‌మనీ తరహాలో వేధించడం వాస్తవమేనని అతడిపై చర్యలు తీసుకోవాలని నివేదిక ఇచ్చారు. అధికార పార్టీ నేత ఒత్తిడితో.. ఆర్టీసీలో కాల్‌మనీ వ్యవహారం వెలుగులోకి రావడం కలకలం రేపింది. గతంలో విజయవాడలో కాల్‌మనీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అదే తరహాలో ఉద్యోగులు కూడా వడ్డీల పేరుతో వేధింపులకు గురిచేయడంపై తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో వడ్డీ వ్యాపారి అవతారమెత్తిన ఉద్యోగిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు వెనకంజ వేస్తున్నారు. విజిలెస్స్ అధికారులు నివేదిక ఇచ్చినా నామమాత్రపు చర్యలతో సరిపెట్టడం వెనుక రాజకీయ ఒత్తిడిలే కారణమని పలువురు యూనియన్ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో ఓ సెక్యూరిటీ గార్డు బినామీల పేరుతో కాంట్రాక్టు పనులు చేస్తున్నాడని విచారించి డిస్మిస్ చేసిన అధికారులు ఈ ఉద్యోగి విషయంలో వెనుకంజ వేయడంపై అధికార పార్టీ నేతల ఒత్తిడే కారణమని వారు ఆరోపిస్తున్నారు. చర్యలు తీసుకున్నాం ఆర్టీసీ కార్మికులను వడ్డీల పేరుతో వేధిస్తున్న కార్మికుడిపై విచారణ చేపట్టాం. ఇప్పటికే చర్యలు ప్రారంభించాం. ఇంక్రిమెంట్ కట్ చేశాం.– రామారావు, ఆర్ఎం -
సమ్మెను జయప్రదం చేద్దాం
కడప కల్చరల్: సెప్టెంబరు 2న నిర్వహించనున్న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేద్దామని యూనియన్ నాయకులు అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. ఆలిండియా ఇన్సూ్యరెన్స్ ఎంప్లాయిస్ ఇచ్చిన పిలుపులో భాగంగా బుధవారం ఐసీఈయూ కడప డివిజన్ ఆధ్వర్యంలో స్థానిక ఎల్ఐసీ డివిజనల్ కార్యాలయ ఆవరణంలో ఉద్యోగులు భోజన విరామ సమయంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా నాయకులు అజయ్‌కుమార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ఉద్యోగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 11 కేంద్ర కార్మిక సంఘాలు సెప్టెంబరు 2న దేశ వ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయని, ఉద్యోగులందరం కలిసి సమ్మెను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఎఫ్‌డీఐ పెంపును ఉపసంహరించాలని, ధరల పెరుగుదల అరికట్టాలని, అర్హులందరికీ ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలని,నాలుగు ప్రభుత్వ జనరల్ ఇన్సూ్యరెన్స్ కంపెనీలను కలపాలని, ఎల్ఐసీలో మూడు, నాల్గవ తరగతి ఉద్యోగుల నియామకాలను చేపట్టాలన్నది ముఖ్యమైన డిమాండ్లుగా సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉన్న కార్మిక చట్టాలను సవరణ పేరుతో నిర్వీర్యం చేస్తుండడంతో కార్మికులు బాగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లాభాల్లోని ప్రభుత్వ రంగ కంపెనీల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఉపసంహరిస్తూ వాటిని ప్రైవేటు పరం చేయాలనుకోవడం దారుణమన్నారు. దేశంలో ముఖ్యమైన రంగాలైన ఇన్సూ్యరెన్స్, రైల్వే, విమాన, రక్షణ రంగాలలో ఎఫ్‌డీఐ పెట్టుబడుల శాతాన్ని పెంచుతూ ప్రభుత్వం బహుళ జాతి సంస్థలు, సామ్రాజ్యవాద దేశాల అడుగులకు మడుగులొత్తుతూ దేశభద్రత, సార్వభౌమాధికారం లాంటి విషయాలలో రాజీ పడడం క్షేమకరమన్నారు. ఈ ప్రదర్శనలో యూనియన్ డివిజన్ నాయకులు కిరణ్‌కుమార్, మద్దిలేటి, శ్రీవాణి, డీఓ యూనిట్ నాయకులు కేసీఎస్ రాజు, అవధానం శ్రీనివాస్, శ్రీకృష్ణ, శ్రీనివాసకుమార్, పక్కీరయ్య,జేవీ రమణ అయ్యవారురెడ్డి, టి.నరసయ్య, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు. -
మినిస్టీరియల్ ఉద్యోగుల బదిలీల్లో లుకలుకలు!
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ మినిస్టీరియల్ ఉద్యోగుల బదిలీల్లో లుకలుకలు చోటుచేసుకుంటున్నాయి. దండిగా కాసులు వచ్చే పోస్టుల్ని వదులుకునేందుకు ఉద్యోగులు ససేమిరా అంటున్నారు. ఇందుకోసం పొలిటికల్ గాడ్ఫాదర్లను ఆశ్రయిస్తున్నారు. ఆర్ఐ (రెవెన్యూ ఇన్స్పెక్టర్) పోస్టుల బది‘లీల’కు సంబంధించి కొందరు యూనియన్ నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై ఇటీవలే ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంటీన్ వద్ద పంచాయితీ పెట్టి మరీ ఉద్యోగులు ఆక్రోశం వ్యక్తం చేసినట్లు సమాచారం. కార్పొరేషన్లో మూడేళ్లు పూర్తి చేసుకున్న 65 మంది మినిస్టీరియల్ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధమైంది. ఈ మేరకు పరిపాలనా విభాగం అధికారులు (సి-సెక్షన్) ఫైలు సిద్ధం చేశారు. ప్రతి మూడేళ్లకూ ఓసారి మినిస్టీరియల్ ఉద్యోగుల్ని అంతర్గత బదిలీలు చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రజారోగ్య, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, యూసీడీ తదితర విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న జూనియర్, సీనియర్, రికార్డు అసిస్టెంట్లు, సూపరింటెండెంట్ స్థాయిలో బదిలీ చేసేందుకు చురుగ్గా సన్నాహాలు జరుగుతున్నాయి. మినహాయింపుపై గుర్రు మూడు సర్కిళ్ల పరిధిలో 13 ఆర్ఐ పోస్టులు ఉన్నాయి. ఇందులో తొమ్మిది మందికి మూడేళ్లు నిండాయి. రెవెన్యూ విభాగంలో ఆర్ఐ పోస్ట్‌కు మంచి క్రేజ్ ఉంది. దీంతో ఈ పోస్టుల్ని బదిలీల నుంచి మినహాయించే ప్రయత్నాలకు తెరలేచినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గడిచిన మూడు, నాలుగేళ్లుగా ఆర్ఐలుగా విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఉద్యోగులు కొద్ది నెలల క్రితం సర్కిళ్లు మారారు. దీంతో తమకు బదిలీలు వర్తించవనే కొత్త వాదనకు తెరతీయడం వివాదాస్పదంగా మారింది. గతంలో ఆర్ఐలుగా విధులు నిర్వహించిన ముగ్గురికి ఇటీవలే నాటకీయ పరిణామాల నేపథ్యంలో మళ్లీ ఆర్ఐ పోస్టులే దక్కాయి. సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ నుంచి ఆర్ఐ పోస్టుల్ని భర్తీ చేస్తున్నారు. గతంలో ప్రవీణ్ ప్రకాష్ కమిషనర్‌గా ఉన్న సమయంలో సమర్థత ఉంటే జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ నుంచి ఆర్ఐలుగా ఎంపిక చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ దఫా బదిలీల నుంచి ఆర్ఐలను మినహాయిస్తే మరో మూడే ళ్ల వరకు వారే ఆ పోస్టుల్లో కొనసాగే అవకాశముంటుంది. దీనిపై ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. ఆర్ఐ పోస్టుల్ని దక్కించుకోవాలనుకొనే ఆశావహులు అన్ని విభాగాల్లో బదిలీలు జరగాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇటీవలే మినిస్టీరియల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు బదిలీల అంశాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా అదనపు కమిషనర్‌కు ఆ బాధ్యతల్ని అప్పగించారు. యూనియన్‌కు బదిలీల సెగ బదిలీల అంశం యూనియన్లోనూ విభేదాలకు తావిస్తోందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కొందరికి లబ్ధి చేకూర్చేలా యూనియన్ నాయకులు వ్యవహరిస్తున్నారంటూ ఉద్యోగులు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. పారదర్శకంగా బదిలీలు జరగకుంటే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. వచ్చే ఆగస్టులో కృష్ణా పుష్కరాలు జరగనున్న దృష్ట్యా కొన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను బదిలీల నుంచి మినహాయించాల్సిందిగా ఆయా విభాగాధిపతులు కమిషనర్‌ను కోరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందుకు కమిషనర్ అంగీకరించే పక్షంలో మొత్తం బదిలీలను తాత్కాలికంగా వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. పుష్కరాలు అయ్యాక బదిలీలు చేస్తే ఏ ఇబ్బందీ ఉండదన్న వాదన వినిపిస్తున్నారు. -
ఐటీసీ పీఎస్‌పీడీలో ప్రమాదం
కార్మికుడి మృతి.. మరో ఐదుగురికి అస్వస్థత బూర్గంపాడు: ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ పీఎస్‌పీడీలో శనివారం రాత్రి చోటుచేసుకున్న ప్రమాదంలో ఒక పర్మనెంట్ కార్మికుడు మృతి చెందగా, మరో కాంట్రాక్ట్ కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది. ఇదే ఘటనలో మరో ఐదుగురు కార్మికులు కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఐటీసీ పీఎస్‌పీడీలోని ఎస్ఆర్పీ (సోడా రికవరీ ప్లాంట్)లో సాంకేతిక లోపాలను సరిచేస్తున్న క్రమంలో కొద్ది పరిమాణంలో ఎన్సీజీ (నాన్ కన్జెన్షబుల్ గ్యాస్) లీకవటంతో అక్కడ పనిచేస్తున్న పర్మనెంట్ కార్మికుడు పీఎల్ఎన్ ప్రసాద్, అతడి పక్కనే ఉన్న కాంట్రాక్ట్ కార్మికుడు వీరభద్రం ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని రక్షించేందుకు అక్కడికి వెళ్లిన మరో ఐదుగురు కార్మికులు కూడా అస్వస్థతకు గురయ్యారు. వీరికి ఐటీసీలోని డిస్పెన్సరీలో ప్రథమ చికిత్సలు నిర్వహించి.. వెంటనే భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పీఎల్ఎన్ ప్రసాద్ (28) మృతి చెందాడు. కాకినాడకు చెందిన ప్రసాద్‌కు 11 నెలల క్రితమే వివాహం జరిగినట్లు తోటి కార్మికులు తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికుడు వీరభద్రం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి వైద్య సేవలందిస్తున్నారు. అస్వస్థతకు గురైన మరో ఐదుగురు కార్మికులకు కూడా భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే ఈ ఐదుగురి ఆరోగ్యం పట్ల ఆందోళన అవసరం లేదని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న కార్మిక సంఘాల నాయకులు ఆస్పత్రి వద్దకు వెళ్లి పరిస్థితిని వాకబు చేశారు. -
ఎస్సై అనుచిత ప్రవర్తన - పరిస్థితి ఉద్రిక్తం
ప్రయాణికుల కోసం బస్సు ఆపి.. పక్కన టీ తాగుతున్న కండక్టర్‌పై దురుసుగా ప్రవర్తించిన ఎస్సైపై ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం ప్రాంతంలో కృష్ణా జిల్లా బంటుమిల్లిలో చోటుచేసుకుంది. బంటుమిల్లి నుంచి మచిలీపట్నం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సు బంటుమిల్లి ప్రధాన సెంటర్లో రోడ్డు పక్కన ఆపి ఉంది. బస్సు కండక్టర్ పక్కనే ఉన్న హోట్‌లో టీ తాగుతున్నాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన స్థానిక ఎస్సై పి.వాసు బస్సు ఆగి ఉండటాన్ని గమనించి కండక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల విద్యార్థులు వచ్చే టైం అయిందని, ఐదు నిమిషాలు ఆగితే వెళ్లిపోతామని కండక్టర్ నచ్చజెప్పారు. ఇదేమీ పట్టించుకోని ఎస్సై.. కండక్టర్ చొక్కా పట్టుకుని అసభ్యంగా దూషిస్తూ ఆయన చేతిలో ఉన్న టికెట్ల యంత్రాన్ని (టిమ్స్) లాక్కుని వెళ్లాడు. పరిస్థితి గమనించిన ప్రయాణీకులు ఎస్సై తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలిసిన ఆర్టీసీ యూనియన్ నేతలు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
బాబుతో భేటీ కానున్న సచివాలయ ఉద్యోగ నేతలు
హైదరాబాద్ : పీఆర్సీ జీవో జారీ చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుందని ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సచివాలయ ఉద్యోగ సంఘాల నేతలు భేటీ కానున్నారు. పీఆర్సీపై తక్షణమే జీవో జారీ చేయాలని సంఘాల నేతలు చంద్రబాబుకు విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే ఈ ఏడాది విద్యా సంవత్సరం మధ్యలో రాజధానికి ఉద్యోగుల తరలింపుపై వారు ఈ సందర్భంగా చంద్రబాబు ఎదుట అభ్యంతరం వ్యక్తం చేయనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం అయితే తరలింపునకు సిద్ధమని ఉద్యోగులు చంద్రబాబుకు స్పష్టం చేయనున్నారు. అయితే ఉద్యోగుల గృహనిర్మాణాలపై సదరు నేతలో చంద్రబాబు చర్చించే అవకాశం ఉందని సమాచారం. -
వర్క్ టు రూల్!
- నేటినుంచి రెవెన్యూ ఉద్యోగుల ఉద్యమబాట - 13 వరకు కొనసాగిస్తామని యూనియన్ నేతల స్పష్టీకరణ మహబూబ్‌నగర్ టౌన్: ఇన్నాళ్లూ ప్రభుత్వానికి బాసటగా నిలిచిన ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనకు పోరుకు సిద్ధమవుతున్నారు. ఉద్యమపార్టీ అధికారంలోకి వచ్చిందని సంబరపడిన ఉద్యోగులు నిరసనలకు దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. ఏడాదిగా తమకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకపోగా కనీస సదుపాయాలు కల్పించడం లేదని ఆరోపిస్తూ రెవెన్యూశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు వీఆర్వో నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు సోమవారం నుంచి ‘వర్క్ టు రూల్’ను పాటించనున్నారు. రెవెన్యూశాఖలోని అన్ని యూనియన్లు తమ పూర్తిమద్దతు ప్రకటించడంతో సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈనెల 13వ తేదీ వరకు నిరసనలు కొనసాగించిన అనంతరం సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఆ తరువాత కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని యూనియన్ నేతలు ప్రకటిస్తున్నారు. ప్రధాన డిమాండ్లు ఇవే.. - డిపార్ట్మెంటల్ పదోన్నతులు కల్పించాలి. గతేడాది ఆగస్టులో నిర్వహించని కారణంగా దాదాపు పదిమంది అధికారులు పదోన్నతులు రాకుండానే పదవీవిరమణ పొందారు. - రెవెన్యూశాఖలో ఖాళీపోస్టులను భర్తీచేసి అధికారులు సిబ్బందిపై పనిభారం తగ్గించాలి. - వీఆర్ఏలకు కనీస వేతనం రూ.6నుంచి రూ.13వేలకు పెంచాలి. 10వ పీఆర్సీలో ప్రభుత్వం సూచించిన ప్రకారం ఇవ్వాలి. 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలి. -పెద్ద మండలాల్లో రూరల్, అర్బన్ రెండు తహశీల్దార్ కార్యాలయాలను ఏర్పాటుచేయాలి. - వాహనాల బడ్జెట్ రూ.17వేల నుంచి రూ.24వేలు పెంచుతూ వచ్చిన జీఓను అమలుచేయాలి. ప్రొటోకాల్‌కు అదనపుబడ్జెట్ ఇవ్వాలి. - ప్రతి మండలానికి ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, ఒక స్వీపర్, ఒక రికార్డ్ అసిస్టెంట్, ఒక వాచ్మెన్ పోస్టులను మంజూరుచేయాలి. స్పందించేంత వరకు కొనసాగిస్తాం - రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వహిస్తున్న తీరు సరైందికాదు. వాటిని పరి ష్కరించుకునేందుకు చేపడుతున్న వర్క్‌టు రూల్‌పై ప్రభుత్వం వెంటనే స్పందించాలి. లేదంటే స్పందించేంత వరకు కొనసాగిస్తాం. - బక్క శ్రీనివాసులు, రెవెన్యూ అసోసియేషన్ కార్యదర్శి రెవెన్యూశాఖ పట్ల నిర్లక్ష్యం తగదు రెవెన్యూశాఖలో పనిచేస్తోన్న ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదు. అన్ని సర్వేలను రెవెన్యూ శాఖపై వేసే ప్రభుత్వం సమస్యలపై కూడా శ్రద్ధచూపాలి. -అమరేందర్, తహశీల్దార్ల సంఘం జిల్లా అధ్యక్షుడు -
'ఆదేశాలు అందేవరకు సమ్మె'
-
హైకోర్టు ఆదేశాలు అందేవరకు సమ్మె
హైకోర్టు ఆదేశాలు తమకు ఇంకా అందలేదని, ఆ కాపీ అందే వరకు సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె చట్టవిరుద్ధమని హైకోర్టు తేల్చిచెప్పింది. కార్మికులు వెంటనే విధుల్లోకి చేరాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఈనెల 12వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే కార్మిక సంఘాల నాయకులు స్పందించారు. -
ఆర్టీసీలో కార్మిక సంఘాల గుర్తింపు రద్దు
హైదరాబాద్ : యూనియన్ నేతలపై ఆర్టీసీ యాజమాన్యం శుక్రవారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆర్టీసీలో కార్మిక సంఘాల గుర్తింపు రద్దు చేసింది. అలాగే వేతనాల నుంచి కార్మిక సంఘాల సభ్యత్వ రుసుం వసూలకు స్వస్తి చెప్పింది. అంతేకాకుండా యూనియన్ కార్యకలాపాలలో తిరిగే నేతలకు ఆన్‌డ్యూటీతో పాటు ఇతర సౌకర్యాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా ఆర్టీసీ కార్మిక గుర్తింపు సంఘాల పదవీ కాలం జనవరి 3వ తేదీని ముగిసిన విషయం తెలిసిందే. -
వారం రోజుల్లో జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు
సూర్యాపేటరూరల్ : జర్నలిస్టులకు హెల్త్‌కార్డుల జారీ ప్రక్రియ వారం రోజు ల్లో ప్రారంభం కానుందని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలి పారు. ఆదివారం హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తూ సూర్యాపేట మండలం రాయినిగూడెం సమీపంలోని సెవెన్ఆర్ హోటల్ వద్ద ఆగారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్లో రూ.10 కోట్లు కేటాయించిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జర్నలిస్టులతో పాటు వారి తల్లిదండ్రులకు సైతం ప్రయోజనం చేకూరేలా హెల్త్‌కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. అలాగే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డులు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు. ఈ సందర్బంగా టీయూజేఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి వజ్జే వీరయ్య ఆధ్వర్యంలో అల్లం నారాయణను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు సయ్యద్ ఇస్మాయిల్, మల్లిఖార్జున్, చారి, చెంచల లక్ష్మణ్, పాష, సయ్యద్ మోహినుద్దీన్, భూపతి నారాయణ, ఎడ్వర్డ్, పెరిక సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కనకయ్య తదితరులు పాల్గొన్నారు. -
కన్నీటి నివాళి
తంగిరాల కుటుంబాన్ని ఆదుకుంటామని చంద్రబాబు హామీ కడసారి చూపుకోసం తరలివచ్చిన అభిమానులు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నందిగామ శాసనసభ్యుడు తంగిరాల ప్రభాకరరావు ఆకస్మిక మరణం జిల్లా వాసులను విస్మయానికి గురిచేసింది. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. తంగిరాల కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీలు, సంఘాల నేతలు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు తరలివచ్చిన నియోజకవర్గ ప్రజలు కన్నీటి నివాళి అర్పించారు. నందిగామ : దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. నందిగామ శాసన సభ్యుడు తంగిరాల ప్రభాకరరావు ఆదివారం అర్థరాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని సోమవారం సీఎం చంద్రబాబు సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మృతి వివరాలను మాజీ మంత్రి నెట్టెం రఘురామ్, మంత్రి దేవినేని ఉమాలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు రాకతో కేవీఆర్ కళాశాల ప్రాంగణం భారీ జనంతో నిండిపోయింది. నందిగామలోని మథిర రోడ్డులో తంగిరాల అంత్యక్రియలు జరిగాయి. కడసారి చూపు కోసం జనం... తంగిరాల మృతి వార్త తెలియగానే ఆదివారం అర్థరాత్రి నుంచి ప్రజలు భారీ ఎత్తున నియోజకవర్గ నలమూలల నుంచి తరలివచ్చారు. జిల్లాలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు మృతదేహాన్ని సందర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, టీడీపీ పార్టీకి చెందిన పలువురు మహిళలు ఆయన మృతదేహంపై పడి బోరున విలపించారు. నివాళులర్పించిన ప్రముఖులు..... బీసీ వెల్ఫేరు అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, ఎంపీలు కేశినేని నాని, మాగంటి బాబు, కొనకొళ్ల నారాయణ, చైర్ పర్సన్ అభ్యర్థిని గద్దె అనురాధ, ఎమ్మెల్యేలు బోండ ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్రావు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి వర్ల రామయ్య,తంగిరాల ప్రభాకరరావు భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. స్నేహశీలి తంగిరాల : వైఎస్సార్సీపీ నేత మొండితోక నిబద్ధత కలిగిన నాయకుడు, స్నేహశీలి తంగిరాల ప్రభాకరరావు అని, ఆయన హఠాన్మరణం ఎంతో బాధకలిగించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు పేర్కొన్నారు. ఆయన మృతదేహాన్ని సోమవారం ఉదయం సందర్శించి పూలమాలలు వేసి నివాళుర్పించారు. ఆయనతో పాటు నియోజవకర్గ నాయకుడు కోవెలమూడి వెంకటనారాయణ, జాతీయ ఉక్కు వినియోగదారుల సలహా మండలి సభ్యుడు శ్రీ బొగ్గవరపు శ్రీ శైల వాసు, జిల్లా వాణిజ్య విభాగ కన్వీనర్ చల్లా బ్రహ్మాం, నాలుగు మండలాల కన్వీనర్లు నెలకుదిటి శివనాగేశ్వరరావు, బండి జానకీరామయ్య, కోటేరు ముత్తారెడ్డి, కోట బుచ్చయ్యచౌదరి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మంగునూరి కొండారెడ్డి, మున్సిపల్ కౌన్సలర్ మహ్మద్ మస్తాన్, ఎంఎస్.రాజశేఖర్, మాజీ ఏఎంసీ చైర్మన్ ముక్కపాటి నరసింహారావు, జిల్లేపల్లి రంగారావు, కుక్కల సత్యనారాయణ, మండల నాయకుడు వైఎస్ఎన్.ప్రసాద్ సందర్శించి నివాళులర్పించారు. మండలి సంతాపం అవనిగడ్డ : నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు ఆకస్మిక మరణం పట్ల అవనిగడ్డ శాసనసభ్యుడు మండలి బుద్ధప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
పారిశుధ్య కార్మికుల సమ్మె విరమణ
సాక్షి, సిటీబ్యూరో: ఐదు రోజులుగా కొనసాగుతున్న జీహెచ్ఎంసీ కార్మికుల సమ్మె నుంచి నగర ప్రజలకు ఉపశమనం లభించింది. బుధవారం సాయంత్రం మునిసిపల్ మంత్రి ఆయా కార్మిక సంఘాలతో జరిపిన చర్చలతో నేతలు తాత్కాలికంగా సమ్మె ఉపసంహరణకు అంగీకరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు.. పొంచివున్న అంటువ్యాధులు.. తదితర కారణాల దృష్ట్యా ఒక మెట్టు దిగినట్లు యూనియన్ల నేతలు వెల్లడించారు. బుధవారం అర్ధరాత్రి నుంచే కార్మికులు పారిశుధ్య కార్యక్రమాల్లో నిమగ్నమవుతారని పేర్కొన్నారు. సచివాలయంలో మంత్రి మహీధర్‌రెడ్డి జీహెచ్ఎంసీ మేయర్ మాజిద్‌హుస్సేన్, కమిషనర్ సోమేశ్‌కుమార్, మునిసిపల్ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో కార్మిక సం ఘాల నేతలతో చర్చలు జరిపారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కార్మిక సంఘాలు కోరినంత మేర వేతనాలు పెంచలేకపోతున్నామని మంత్రి చె ప్పారు. ప్రస్తుతానికి జీహెచ్ఎంసీ ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాల్ని నెలకు రూ. 6700 నుంచి రూ. 8500లకు పెంచేం దుకు అంగీకరించారు. త ద్వారా సంవత్సరానికి రూ. 53.64 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. ప్రస్తుతం జీహెచ్ ఎంసీ కార్మికులకు 27 శాతం ఐఆర్ ఇచ్చారు. జీహెచ్ఎంసీ ముట్టడి.. అంతకుముందు మధ్యాహ్నం వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. సంఘాల నేతలు మాట్లాడుతూ.. కార్మికుల వేతనాలు పెంచకపోవడమే కాక, ఎస్మా ప్రయోగిస్తామని బెదిరించ డం దారుణమని దుయ్యబట్టారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, సీపీఐ శాసనసభా పక్ష నాయకుడు గుండా మల్లేశ్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ నాయకుడు జె.చలపతిరావు, సీఐటీయూ నాయకుడు పాలడుగు భాస్కర్, బీఎం ఎస్ నాయకుడు శంకర్,ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, తదితర సంఘాలకు చెందిన నాయకులు ప్రసంగించారు. అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్లకు తరలించారు. -
చంద్రబాబు నాయుడుకు చిర్రెత్తుకొచ్చిన వేళ !
-
బక్షి సిఫారసులు అమలు చేయొద్దు
కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : సహకార సంఘాల ఉనికి లేకుండా చేసే నాబార్డు చైర్మన్ బక్షి సిఫారసులు అమలు చేయొద్దని పీఏసీఎస్ చైర్మన్లు సహకార సంఘాల రిజిస్ట్రార్, కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. గురువారం కరీంనగర్‌కు వచ్చిన కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియాను కేడీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్రావు ఆధ్వర్యంలో పీఏసీఎస్ చైర్మన్లు కలిసి వినతి పత్రం అందించారు. రైతుల వాటా ధనాన్ని, ఇచ్చిన రుణాలను జిల్లా సహకార బ్యాంకు కు బదిలీ చేసి, బిజినెస్ కరస్పాండెంట్లుగా ఉండాలనే బక్షి సిఫారసులు సహకార వ్యవస్థకే శాపంలా మారాయన్నారు. ఇలాగైతే సం ఘాలకు ఎన్నికలు నిర్వహించడం ఎందుకని ప్రశ్నించారు. సిఫారసులు అమలు చేయొద్ద ని కోరగా కమిషనర్ సానుకూలంగా స్పం దించారు. వైఎస్సార్సీపీ నాయకుడు, కోనరావుపేట సింగిల్‌విండో చైర్మన్ మోతె గంగారెడ్డి, చైర్మన్లు నరేందర్‌రెడ్డి, సత్యనారాయ ణ, లక్ష్మీనారాయణ, దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిఫారసులు అమలు చేయొ ద్దంటూ కో ఆపరేటివ్ సొసైటీస్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కూడా కమిషనర్‌కు వినతిపత్రం అందించారు.