సూర్యాపేటరూరల్ : జర్నలిస్టులకు హెల్త్‌కార్డుల జారీ ప్రక్రియ వారం రోజు ల్లో ప్రారంభం కానుందని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలి పారు. ఆదివారం హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తూ సూర్యాపేట మండలం రాయినిగూడెం సమీపంలోని సెవెన్‌ఆర్ హోటల్ వద్ద ఆగారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్‌లో రూ.10 కోట్లు కేటాయించిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జర్నలిస్టులతో పాటు వారి తల్లిదండ్రులకు సైతం ప్రయోజనం చేకూరేలా హెల్త్‌కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. అలాగే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డులు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు. ఈ సందర్బంగా టీయూజేఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి వజ్జే వీరయ్య ఆధ్వర్యంలో అల్లం నారాయణను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు సయ్యద్ ఇస్మాయిల్, మల్లిఖార్జున్, చారి, చెంచల లక్ష్మణ్, పాష, సయ్యద్ మోహినుద్దీన్, భూపతి నారాయణ, ఎడ్వర్డ్, పెరిక సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
వారం రోజుల్లో జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు
Published Mon, Nov 10 2014 5:46 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 PM
Advertisement
Advertisement