గోదావరిఖని : తెలంగాణ రాష్ట్రంలో అక్రిడిటేషన్ కార్డులతో సంబంధం లేకుండా గ్రామీణ, పట్టణ ప్రాంత జర్నలిస్టులందరికీ హెల్త్‌కార్డులు ఇచ్చేందుకు కషి చేస్తున్నామని ప్రెస్ అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ తెలిపారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన తెలంగాణ ఉత్తేజ సభకు ఆయన హాజరై మాట్లాడారు.
ప్రస్తుతం హెల్త్‌కార్డులకు సంబంధించిన ఫైల్ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద ఉందని, పది రోజుల్లోగా ఈ ఫైల్ క్లియరయ్యే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జూలై 15వ తేదీ వరకు అక్రిడిటేషన్ కార్డు ఉన్న జర్నలిస్ట్‌లందరికి బస్‌పాస్ రెన్యూవల్ చేయనున్నారని ఆయన చెప్పారు.
పాత్రికేయులందరికీ హెల్త్ కార్డులు: అల్లం నారాయణ
Published Thu, Jul 2 2015 11:09 PM | Last Updated on Sun, Sep 3 2017 4:45 AM
Advertisement
Advertisement