కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : సహకార సంఘాల ఉనికి లేకుండా చేసే నాబార్డు చైర్మన్ బక్షి సిఫారసులు అమలు చేయొద్దని పీఏసీఎస్ చైర్మన్లు సహకార సంఘాల రిజిస్ట్రార్, కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. గురువారం కరీంనగర్‌కు వచ్చిన కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియాను కేడీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు ఆధ్వర్యంలో పీఏసీఎస్ చైర్మన్లు కలిసి వినతి పత్రం అందించారు. రైతుల వాటా ధనాన్ని, ఇచ్చిన రుణాలను జిల్లా సహకార బ్యాంకు కు బదిలీ చేసి, బిజినెస్ కరస్పాండెంట్లుగా ఉండాలనే బక్షి సిఫారసులు సహకార వ్యవస్థకే శాపంలా మారాయన్నారు.
ఇలాగైతే సం ఘాలకు ఎన్నికలు నిర్వహించడం ఎందుకని ప్రశ్నించారు. సిఫారసులు అమలు చేయొద్ద ని కోరగా కమిషనర్ సానుకూలంగా స్పం దించారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు, కోనరావుపేట సింగిల్‌విండో చైర్మన్ మోతె గంగారెడ్డి, చైర్మన్లు నరేందర్‌రెడ్డి, సత్యనారాయ ణ, లక్ష్మీనారాయణ, దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిఫారసులు అమలు చేయొ ద్దంటూ కో ఆపరేటివ్ సొసైటీస్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కూడా కమిషనర్‌కు వినతిపత్రం అందించారు.
బక్షి సిఫారసులు అమలు చేయొద్దు
Published Fri, Aug 23 2013 3:28 AM | Last Updated on Tue, May 29 2018 2:42 PM
Advertisement
Advertisement