senior IAS officers
-
22నుంచి గ్రూప్-1 ఇంటర్వ్యూలు
సాక్షి, అమరావతి, ఆంధ్రప్రదేశ్లో గ్రూప్-1 ఇంటర్వ్యూలు ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 20వ తేదీ వరకు జరుగుతాయి. ఈ ఇంటర్వ్యూల నిర్వహణ కోసం 18మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం నియమించింది. కాగా, మొత్తం 152 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఈ ఇంటర్వ్యూలు జరగనున్నాయి. -
తెలంగాణలో భారీగా సీనియర్ ఐఏఎస్ల బదిలీ
-
తెలంగాణలో భారీగా సీనియర్ ఐఏఎస్ల బదిలీ
హైదరాబాద్ : తెలంగాణలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ .... దాదాపు ముఖ్యమైన శాఖల కార్యదర్శులందరినీ బదిలీ చేశారు. సీసీఎల్ఏగా రేమండ్ పీటర్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శిగా ఎస్పీ సింగ్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా సురేష్ చందాలను బదిలీ చేశారు. ఇంకా ఎవరెవరూ ఏ స్థానంలోకి బదిలీ అయ్యారంటే... సురేష్ చందా స్థానంలో రాజేశ్వర్ తివారీ పశుసంవర్ధకశాఖ ముఖ్యకార్యదర్శిగా సురేష్ చందా సాధారణ పరిపాలన శాఖ(పొలిటికల్) సెక్రటరీగా అదర్ సిన్హా హెచ్ఎండీఏ కమిషనర్గా చిరంజీవులు సాధారణ పరిపాలనశాఖకు శాలినీ మిశ్రాబదిలీ అటవీశాఖ ముఖ్యకార్యదర్శిగా వికాస్ రాజ్ జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ బదిలీ జీహెచ్ఎంసీ కొత్త కమిషనర్ గా బీ జనార్దన్ రెడ్డి గిరిజన సంక్షేమశాఖకు సోమేశ్ కుమార్ బదిలీ -
ఐఏఎస్లు, మంత్రుల హంగామా
శ్రీకాకుళం పాతబస్టాండ్: తుపాను సహాయ పనుల పర్యవేక్షణ పేరుతో ప్రభుత్వం జిల్లాకు పంపిన సీనియర్ ఐఏఎస్ అధికారుల వల్ల అనవసర హడావుడితోపాటు పనులకు అంతరాయం కలుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సహాయ, పునరావాస పనుల పర్యవేక్షణకు ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాకు 11 మంది ఐఏఎస్, ఇతర సీనియర్ అధికారులు వచ్చారు. దీంతో జిల్లాకు చెందిన పలువురు అధికారులు, సిబ్బంది వీరికి సహాయ పడటం, ప్రొటోకాల్ విధుల పేరుతో వీరి వెంట పర్యటిస్తున్నారు. ఒక్కో ఐఏఎస్ ఆధికారి వద్ద లైజనింగ్ అధికారిగా ఒక జిల్లా స్థాయి ఆధికారి వ్యవహరిస్తుండగా మరో ఇద్దరు కింది స్థాయి సిబ్బంది వారి సేవల్లోనే ఉంటున్నారు. ఇలా 11 మంది అధికారుల వెంట 33 మంది వరకు వివిధ శాఖల సిబ్బంది ఉండాల్సి వస్తోంది. దీనికితోడు ఈ అధికారులు బస చేసిన హోటళ్లు, వసతిగృహాల వద్ద మరికొంతమంది రెవెన్యూ ఆధికారులు ప్రొటోకాల్ విధులు నిర్వహిస్తున్నారు, వీరంతా ఈ సమయంలో తుపాను సహాయ, పునరావస పనుల్లో నిమగ్నం కావల్సినవారే.. తమతమ కార్యాలయాల్లో కీలక బాధ్యతలు నిర్విహ స్తున్నవారే,, అటువంటి వారిని సీనియర్ అధికారుల వెంట పంపడంతో ఆయా మండలాల్లో తుపాను పనులపై ఆ ప్రభావం కచ్చితంగా పడుతుంది. కాగా అధికార యంత్రాంగమంతా క్షేత్రస్థాయిలో పని చేయాల్సిన ఈ కీలక సమయంలో ఉన్నతాధికారుల తనిఖీలు, తరచూ జరిగే సెట్ కాన్ఫరెన్సులు, సమీక్ష సమావేశాల వల్ల దిగువస్థాయి యంత్రాంగంపై ఒత్తిడి పెరుగుతోంది. ఇది చాలదన్నట్లు ఉప ముఖ్యమంత్రి సహా ముగ్గురు మంత్రులు, ప్రభుత్వ విప్ పర్యటనలు, సమీక్షలు జరుపుతుండటంతో వీటితోనే సమయం సరిపోతోందని సిబ్బంది వాపోతున్నారు. -
సీనియర్ ఐఏఎస్ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) కమిషనర్ కృష్ణబాబు సహా పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ సోమేశ్ కుమార్ను జీహెచ్ఎంసీ కొత్త కమిషనర్గా నియమించింది. కృష్ణబాబుకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి ఎఆర్.సుకుమార్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అదర్సిన్హా, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ ప్రియదర్శినిలు కూడా బదిలీ అయ్యారు. అయితే వారికీ ఎక్కడా పోస్టింగ్లు ఇవ్వలేదు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న రేమండ్ పీటర్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమితులయ్యారు. అధికారులు బదిలీ వివరాలు.. -
రాష్ట్రానికి సీనియర్ ఐఏఎస్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి సీనియర్ ఐఏఎస్ల కొరత పట్టుకుంది. ఇందుకు ప్రధాన కారణం పలువురు సీనియర్ ఐఏఎస్లు కేంద్ర సర్వీసులకు తర లిపోవడమే. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర సర్వీసులకు వెళ్లిపోవడమే ఉత్తమమని వారు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇలా దరఖాస్తు చేసుకున్న వారిలో కొంత మందికి ఇప్పటికే కేంద్ర సర్వీసులో పోస్టింగ్లు రావడంతో వెళ్లిపోయారు. దీంతో రాష్ట్రంలోని కీలక శాఖలకు సీనియర్ ఐఏఎస్లు లేక ఇన్చార్జీల పాలన కొనసాగుతోంది. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న పుష్ప సుబ్రహ్మణ్యం అయితే ఇంకా కేంద్ర సర్వీసులో పోస్టింగ్ రాకుండానే మూడు వారాల పాటు సెలవు పెట్టి ఢిల్లీ వెళ్లిపోయారు. మూడు వారాల్లోగా కేంద్ర సర్వీసులో పుష్ప సుబ్రహ్మణ్యంకు పోస్టింగ్ రానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ఆర్థిక శాఖ (బడ్జెట్) ముఖ్యకార్యదర్శి పోస్టు ఖాళీ అయింది. అలాగే ఆర్థిక శాఖ మరో ముఖ్యకార్యదర్శి పి.వి. రమేశ్ కూడా నెల రోజుల పాటు శిక్షణ కోసం వెళ్లిపోయారు. దీంతో ఆ పోస్టు ఖాళీగా ఉంది. ఈ నెలాఖరుతో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి భాస్కర్ కూడా పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆర్థిక శాఖలోనే మూడు కీలకమైన పోస్టులు ఖాళీగా ఉండనున్నాయి. సీనియర్ ఐఏఎస్లు లేకపోవడంతో పలు కీలక శాఖలకు ఇన్చార్జిలను నియమిస్తున్నారు. ఇటీవలే గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేసిన రెడ్డి సుబ్రహ్మణ్యం కేంద్ర సర్వీసుకు వెళ్లడంతో ఆ పోస్టులో నాగిరెడ్డికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. సాగునీటి శాఖ ముఖ్యకార్యదర్శి, పెట్టుబడులు మౌళిక సదుపాయాల శాఖ ముఖ్యకార్యదర్శి, దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి పదవులు ఇన్చార్జిల పాలనలో కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో రాజీవ్ రంజన్ మిశ్రాతో పాటు వసుధా మిశ్రా కూడా కేంద్ర సర్వీసుకు వెళ్లిపోయారు. మరి కొంత మంది కూడా కేంద్ర సర్వీసుకు వెళ్లిపోవడానికి దరఖాస్తు చేసుకోవడంతో పాటు కేంద్రంలో పోస్టింగ్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు.