
గ్రేటర్‌లో ‘గ్రేట్’..
సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా 78 మంది మహిళా కార్పొరేటర్లు ఉన్నారు. 33 శాతంగా ఉన్న రిజర్వేషన్లు 50 శాతానికి పెరగడంతో జీహెచ్‌ఎంసీలోని 150 కార్పొరేటర్లకు 75 స్థానాలు వారికే కేటాయించారు. జనరల్ స్థానాల నుంచి మరో ముగ్గురు గెలిచారు.
1987లో ఎంసీహెచ్ పాలకమండలిలో 100 మంది కార్పొరేటర్లకు 15 మంది మహిళలకే అవకాశం దక్కింది. 2002 ఎన్నికల్లో 36 మంది ఎన్నికయ్యారు. జీహెచ్‌ఎంసీ ఏర్పాటయ్యాక మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వడంతో 51 మంది మహిళలకు కార్పొరేటర్లయ్యే అవకాశం లభించింది. ఇప్పుడు ఈ సంఖ్య 78కి పెరిగి గ్రేటర్‌లో ఆమె ‘గ్రేట్’ అనిపించుకొంది.
ఓటర్లు : 82,65,004
⇒47% 38,55,291 మహిళలు
⇒53% 44,09,713 పురుషులు
కార్పొరేటర్లు :150
⇒ 48% పురుషులు
⇒ 52% మహిళలు
పారిశుధ్య కార్మికులు : 18,591
⇒ 19% పురుషులు
⇒ 81% మహిళలు 15,085