సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బుధవారం 27 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు చనిపోయారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సం ఖ్య 1661కి చేరగా.. మరణాలు 40కి చేరాయి. హైదరాబాద్ మోతీనగర్‌కు చెందిన 61 ఏళ్ల వ్య క్తి, చాంద్రాయణగుట్టకు చెందిన 81 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 15 మంది ఉండగా.. వలసదారులు 12 మంది ఉన్నారు. (సేఫ్ సర్వీస్!)
వలసదారులంతా జగి త్యాల, జనగాం జిల్లాలకు చెందినవారని ప్ర జారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. మొత్తం కేసుల్లో 89 మంది వలసదారులు ఉన్నారు. ఇక బుధవారం ఇద్దరు డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని ఇంటికి వెళ్లినవారి సంఖ్య 1013కి చేరుకుంది. ఆసుపత్రిలో 608 మంది చికిత్స పొందుతున్నారు.
ఒకే ఇంట్లో 8 మందికి పాజిటివ్
అబిడ్స్: గోషామహల్ జీహెచ్‌ఎంసీ 14వ జోన్ పరిధిలో బుధవారం ఒకే ఇంట్లో 8 మందికి కరోనా నిర్ధారణ అయింది. స్థానిక నట్రాజ్‌నగర్‌లో ఉంటున్న ఓ వ్యాపారికి (34) ఐదురోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా.. వ్యాపారి తండ్రి(55), తల్లి(48), భార్య(30), కుమారుడు(4), తమ్ముడు(28) తమ్ముడి భార్య(22), ఇద్దరు చెల్లెళ్లకు (22), (23) కరోనా సోకినట్టు తేలింది.
Comments
Please login to add a commentAdd a comment