
జీహెచ్‌ఎంసీపై హైకోర్టు కన్నెర్ర
హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(జీహెచ్‌ఎంసీ) కార్పొరేటర్లకు ల్యాప్‌టాప్‌లు, జర్నలిస్టులకు ఐపాడ్ల పంపిణీ వ్యవహారంపై హైకోర్టు కన్నెర్ర చేసింది. జీహెచ్‌ఎంసీ నిర్ణయాన్ని తప్పుబట్టింది. చెత్త ఊడవడానికే డబ్బులు లేవు, కార్పొరేటర్లకు ఎలా ల్యాప్‌టాప్‌లు ఇస్తారంటూ ఘాటుగా ప్రశ్నించింది. మీకు నిధులు ఎక్కడ నుంచి వస్తున్నాయంటూ నిలదీసింది.
ఏ చట్టప్రకారం ఐపాడ్లు కొనుగోలు చేసేందుకు అనుమతిచ్చారని అడిగింది. దీన్ని మేయర్ ప్రతిపాదించారని, కమిషనర్ పెట్టలేదని కోర్టుకు జీహెచ్ఎంసీ విన్నవించింది. వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని జీహెచ్‌ఎంసీని హైకోర్టు ఆదేశించింది. విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.