
సాక్షి, హైదరాబాద్ : లంచం తీసుకుంటుండగా ఓ జీహెచ్‌ఎంసీ ఉద్యోగిని ఏసీబీ అధికారులు శుక్రవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇల్లు కుట్టకునేందుకు బిద్లాన్ ధర్మేందర్‌సింగ్ అనే వ్యక్తి చార్మినార్ సర్కిల్-9లో దరఖాస్తు చేశాడు. అక్కడ టౌన్‌ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సయ్యద్ అష్రఫ్ అహ్మద్ పర్మిషన్ ఇచ్చేందుకు రూ.10వేలు డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీ అధికారులకు విషయం చెప్పడంతో.. అష్రఫ్ లంచం తీసుకుంటుండగా జామా మజీద్ వద్ద వలపన్ని పట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment