
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో లైవ్ డ్యాష్ బోర్డ్‌లను ఏర్పాటు చేయాలని దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. తెలంగాణలో కరోనా వైరస్ కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని అస్పత్రుల్లో లైవ్ డ్యాష్ బోర్డ్ ఏర్పాటు చేయాలని హైకోర్టులో న్యాయవాది శివగణేష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిని హైకోర్టు విచారించగా.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎన్ని బెడ్స్, వెంటిలేటర్స్ ఉన్నాయో డిస్ప్లే బోర్డ్ ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు. దీని వలన ప్రజలు ఆస్పత్రుల వద్ద పడిగాపులు గాయకుండా ఉంటారని తెలిపారు. పిటీషనర్ వాదనలు విన్న హైకోర్టు.. తెలంగాణ చీఫ్ సెక్రటరీ మెడికల్ & హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫ్యామిలీ వెల్ఫైర్‌కు కౌంటర్ ధాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జులై 14కు వాయిదా వేసింది. (కరోనా: పరిస్థితులు చేజారిపోయాయా..! )
హైకోర్టులో 10 మందికి పాజిటివ్
Comments
Please login to add a commentAdd a comment