Malak pet
-
బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ పార్లమెంట్ స్థానం బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదైంది. పోలింగ్ బూత్‌లో ముస్లిం మహిళల హిజాబ్ తొలగించి.. అనుచితంగా వ్యవహరించారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి.#WATCH | Telangana: BJP candidate from Hyderabad Lok Sabha constituency, Madhavi Latha visits a polling booth in the constituency. Voting for the fourth phase of #LokSabhaElections2024 is underway. pic.twitter.com/BlsQXRn80C— ANI (@ANI) May 13, 2024 దీంతో జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఆదేశాల మేరకు మలక్‌పేట్ పోలీసులు ఆమెపై నమోదు చేసినట్లు తెలిపారు. 171c, 186, 505(1)(c)ఐపిసి, అండ్ సెక్షన్ 132 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు.. తెలంగాణలో మధ్యాహ్నం 3 గంటల వరకు 52 శాతం పోలింగ్ నమోదైంది. -
మలక్ పేట్ లో బాలింతల మృతిపై ప్రాథమిక నివేదిక
-
మలక్ పెట్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో దారుణం
-
మలక్‌పేటలో తప్పిన పెనుముప్పు
హైదరాబాద్: రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నగరంలోని మలక్‌పేట్ మెట్రో స్టేషన్ సమీపంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాలు..తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా.. నగరంలోని మలక్‌పేట్ వద్దకు రాగనే సాంకేతిక లోపం తలెత్తడంతో రోడ్డుపై నిలిచిపోయింది. దీంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్ బస్సును రోడ్డు పక్కకు జరిపి ప్రయాణికులను కిందకు దించాడు. అదే సమయంలో దిల్సుఖ్నగర్ నుంచి చాదర్‌ఘాట్ వైపు వెళ్తున్న వెళ్తున్న లారీ అదుపుతప్పి ఆగి ఉన్న బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్‌కు తీవ్ర గాయాలు కావడంతో అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. లారీ ఢీకొట్టిన సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కల్తీ కొబ్బరి నూనె తయారీ కేంద్రం సీజ్
హైదరాబాద్: కల్తీ కొబ్బరి నూనె తయారీ కేంద్రం గుట్టును పోలీసులు రట్టు చేశారు. మలక్‌పేట్‌లో కల్తీ కొబ్బరి నూనె తయారీ కేంద్రంపై ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి, 750 లీటర్ల కల్తీ నూనెతో పాటు తయారీకి వాడే యంత్రాలను సీజ్ చేశారు. ఇందుకు సంబంధించి కేంద్రం నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని మలక్‌పేట పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు -
హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం
-
ఇద్దరు విద్యార్థులను ఢీకొన్న స్కూల్ బస్సు
హైదరాబాద్ : మలక్ పేటలోని మెస్కో స్కూల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులను అదే స్కూల్‌కు చెందిన బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యారులు గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన అమీన కౌసర్ అనే ఆరేళ్ల బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు స్కూల్ ఎదుట ఆందోళన చేస్తున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మలక్‌పేటలో పోలీసుల కార్డన్ సెర్చ్
హైదరాబాద్: మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం ఈస్ట్‌జోన్ డీసీపీ డాక్టర్ రవీందర్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సలీంనగర్ డివిజన్లోని ఆఫ్జల్నగర్, తీగలగూడ హట్స్, బంజరాబస్తీలలో 200 మంది పోలీసులు ప్రతి ఇంటినీ జల్లెడ పట్టారు. డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. సోదాలలో ధృవపత్రాలు సరిగాలేని 40 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకోగా..10 మంది అనుమానితులు, సూడాన్, ఉగాంఢా, సోమలియన్కు చెందిన 8 మంది విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. (మలక్‌పేట) -
బిల్డింగ్‌పై నుంచి పడి వ్యక్తి మృతి
హైదరాబాద్ : కొత్తగా నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ రెండో అంతస్తు పై నుండి ప్రమాదవశాత్తూ కిందపడటంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం హైదరాబాద్ మలక్‌పేట్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన ప్రకాశ్(40) అనే వ్యక్తి మలక్‌పేట్‌లో నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ వద్ద వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. కాగా సోమవారం ఉదయం 11గంటల సమయంలో ప్రమాదవశాత్తూ బిల్డింగ్ రెండో అంతస్తు పై నుండి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అతడిని హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతను ఆసుపత్రిలో మరణించాడు. -
హైదరాబాద్‌లో సైకో దాడి
ఎస్ఐ, కానిస్టేబుల్, హోంగార్డుతోపాటు మరో ఇద్దరికి కత్తిపోట్లు మలక్‌పేట శంకర్‌నగర్‌లో అర్ధరాత్రి అలజడి హైదరాబాద్, న్యూస్‌లైన్: మానసిక స్థితి సరిగా లేని ఓ వ్యక్తి హైదరాబాద్‌లో కత్తితో దాడులకు దిగి ఐదుగురిని తీవ్రంగా గాయపరిచాడు. సైకో దాడిలో గాయపడ్డ ఎస్ఐ, కానిస్టేబుల్, హోంగార్డుతోపాటు మరో ఇద్దరు స్థానికులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. సీఐ రాజావెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మలక్‌పేట శంకర్‌నగర్‌కు చెందిన ఇసామియా ఖురే షీ(55) కబేళాలో పశువులను వధించే కార్మికుడు. కొన్నేళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతూ వైద్యం చేయించుకుంటున్నాడు. మంగళవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి వెకిలి చేష్టలతో విసిగించటంతో కోపోద్రిక్తుడైన ఇసామియా కత్తి తీసుకుని బజారులోకి వచ్చి దూషణలకు దిగాడు. అదే సమయంలో శంకర్‌నగర్‌లో ఓ చిన్నారి జన్మదిన వేడుకలకు హాజరై వస్తున్న ఇంటర్ విద్యార్థి భాను(17) అతడిని వారించేందుకు ప్రయత్నించగా కత్తితో దాడి చేసి గాయపరిచాడు. గాయాలతో రోడ్డుపై పడిపోయిన భానును కాపాడేందుకు ప్రయత్నించిన శివ(23)పై కూడా ఇసామియా కత్తితో విరుచుకుపడి కడుపు, చేతిపై గాయపర్చాడు. శివ సోదరుడు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో అక్కడకు చేరుకున్న ఎస్ఐ మహేశ్, కానిస్టేబుల్ పీరయ్య, హోంగార్డు మంగ్తానాయక్లు క్షతగాత్రులను మలక్‌పేటలోని యశోద ఆసుపత్రికి తరలించాడు. అనంతరం ఇసామియా ఇంటికి వెళ్లి అతడికి నచ్చచెప్పేందుకు ప్రయత్నించిన ఎస్ఐ మహేష్‌పై పశువులను వధించే కత్తితో దాడికి పాల్పడ్డాడు. దాడి నుంచి తప్పించుకునే క్రమంలో ఎస్ఐ ఎడమ చేతిని అడ్డుపెట్టగా.. చేయి సగభాగం తెగిపోవడంతో పాటు వేళ్లకు తీవ్రగాయాలయ్యాయి. పట్టుకునేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్, హోంగార్డులను కూడా సైకో ఇసామియాను గాయపరిచాడు. కాలనీవాసులు ఇసామియాను వెనుక నుంచి పట్టుకుని బంధించారు. అనంతరం పోలీస్ అధికారులు అక్కడకు చేరుకుని సైకోను అదుపులోకి తీసుకుని కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అతడిపై హత్యాయత్నం నేరం, ఆయుధ చట్టం కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని చాదర్‌ఘాట్ సీఐ తెలిపారు. మానసికంగా ఉన్మాదిగా మారిన తన భర్త కొన్నేళ్లుగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, అతడిని జైల్లోనే ఉంచాలని ఇసామియా భార్య పోలీ సులను వేడుకుంది. గాయపడ్డ పోలీసులను యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. వదంతులను నమ్మవద్దు: ఏసీపీ సోమేశ్వరరావు సైకో ఇసామియా చేసిన దాడిని మత ఘర్షణలుగా చిత్రీకరించవద్దని, ఇలాంటి పుకార్లు నమ్మవద్దని సుల్తాన్ బజార్ ఏసీపీ సోమేశ్వరరావు స్థానికులకు సూచించారు. పుకార్లు వ్యాపింపచేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండి తమకు సమాచారం అందించాలని కోరారు. కాలనీల్లో రెండువారాల పాటు పోలీస్ పికెట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.