మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం ఈస్ట్‌జోన్ డీసీపీ డాక్టర్ రవీందర్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
హైదరాబాద్: మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం ఈస్ట్‌జోన్ డీసీపీ డాక్టర్ రవీందర్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సలీంనగర్ డివిజన్‌లోని ఆఫ్జల్‌నగర్, తీగలగూడ హట్స్, బంజరాబస్తీలలో 200 మంది పోలీసులు ప్రతి ఇంటినీ జల్లెడ పట్టారు. డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. సోదాలలో ధృవపత్రాలు సరిగాలేని 40 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకోగా..10 మంది అనుమానితులు, సూడాన్, ఉగాంఢా, సోమలియన్‌కు చెందిన 8 మంది విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు.
(మలక్‌పేట)