cardan search
-
'కార్డన్ సెర్చ్‌తో తగ్గిన క్రైం రేట్'
చాంద్రాయణగుట్ట: పాత నగరంలో ఏడాదిన్నర కాలంగా నిర్వహిస్తున్న కార్డన్ సెర్చ్ సత్ఫలితాలనిచ్చిందని దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపారు. ఇప్పటికే నేరాలు తగ్గుముఖం పట్టాయని, పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చే వరకు కార్డన్ సెర్చ్‌లను కొనసాగిస్తామని చెప్పారు. దక్షిణ మండలం పోలీసులు ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున నిర్వహించిన కార్డన్ సెర్చ్ వివరాలను ఆయన విలేకరులకు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలివీ.. ఫలక్‌నుమాలోని వట్టేపల్లి, గుంటల్ షా బాబా దర్గా ప్రాంతాలలో సుమారు 300 మంది పోలీసులు టీం టీంలుగా ఏర్పడి సోదాలు జరిపారు. ఇందులో 17 మంది అనుమానిత రౌడీషీటర్లను అదుపులోకి తీసుకొని, వారి నుంచి రెండు తల్వార్లు, సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 50 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, ఒక స్కూల్ బస్సును స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలకు పాల్పడుతున్న కొందరు సరిహద్దు ప్రాంతంగా ఉన్న ఫలక్‌నుమా ఏరియాలో తలదాచుకుంటున్నారని డీసీపీ తెలిపారు. ఇటీవల కాటేదాన్‌లో బ్యాంక్ వద్ద కూడా కాల్పుల ఘటన నేపథ్యంలో ఇక్కడి ప్రజలు కార్డన్ సెర్చ్ నిర్వహించాలని తమను కోరారని వివరించారు. -
బంజారాహిల్స్‌లో కార్డన్‌సెర్చ్
బంజారాహిల్స్: హైదరాబాద్ బంజారాహిల్స్, హుమాయూన్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 450 మంది పోలీసులు ప్రతీ ఇంటినీ, వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 58 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
పాతబస్తీలో కార్డన్‌సెర్చ్
హైదరాబాద్: పాతబస్తీలో గురువారం ఉదయం నిర్వహించిన కార్డన్‌సెర్చ్‌లో భారీగా జరుగుతున్న అక్రమాలను గుర్తించారు. రెయిన్‌బజార్, ఫలక్‌నుమా, మొగల్పురా, చంద్రాయణ్‌గుట్ట పోలీస్స్టేషన్ల పరిధిలో సౌత్‌జోన్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో 200 మంది పోలీసులు పాల్గొన్నారు. ఇంటింటి తనిఖీల్లో భాగంగా నేర చరిత్ర ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. గాజుల తయారీ పరిశ్రమలు ఐదింటిపై దాడులు చేసి 30 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించారు. మామిడి పండ్ల గోదాములు తనిఖీ చేసి, రసాయనాలతో మామిడి పండ్లను మగ్గబెడుతున్నట్లు నిర్ధారించారు. ఇందుకు సంబంధించి వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. జంతువుల కొవ్వుతో నూనె తయారు చేస్తున్న కేంద్రంపై దాడి చేసి నిర్వాహకుడిని పట్టుకున్నారు. అలాగే, సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. -
పాతబస్తీలో కార్డెన్ సెర్చ్
హైదరాబాద్:నగరంలోని పాత బస్తీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నారు. డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో 350 మంది పోలీసులతో చాంద్రాయణగుట్ట, బార్కస్ ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుంచి కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో 60 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 25 మంది రౌడీషీటర్లు, లేట్‌నైట్ రోమియోలు, పాత నేరస్థులున్నారు. యూసుఫ్‌ఖాన్(27) అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని నుంచి 300 గుడుంబా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, చాంద్రాయణగుట్ట సెయింట్ ఆన్స్ స్కూల్ ప్రాంతంలో అక్రమంగా గ్యాస్‌ను రీఫిల్లింగ్ చేస్తున్న హబీబ్ జాఫర్(29)ను అరెస్ట్ చేసి అతని నుంచి 11 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేని 95 ద్విచక్ర వాహనాలు, ఒక జేసీబీ, నాలుగు కార్లు, ఐదు మూడు చక్రాల వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన ఈ సెర్చ్ కొనసాగుతుంది. మొత్తం 350 మంది పోలీసులు 20 టీమ్‌లుగా ఏర్పడి ఇంటింటికి తిరుగుతూ సోదాలు నిర్వహిస్తున్నారు. అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. -
నిజామాబాద్ లో కార్డన్ సెర్చ్
బాల్కొండ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం ఎస్సారెస్పీ కాలనీలో శుక్రవారం ఉదయం పోలీసులు కార్డాన్ సెర్చ్ చేపట్టారు. మొత్తం పది మంది ఎస్సైలు, ముగ్గురు సీఐలు, 100 మంది కాలిస్టేబుళ్లు ఇల్లిల్లూ గాలించారు. ఈ సందర్భంగా ఎలాంటి పత్రాలు లేని 15 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గాలింపు ఇంకా కొనసాగుతోంది. అదేవిధంగా జిల్లాలోని గాంధారిలో పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. సీఐ, ఎనిమిది మంది ఎస్ఐలు సహా 50 మంది వరకూ పోలీసులు మండల కేంద్రంలోని ఇందిరానగర్తోపాటు సోమారం తండా, పంతులునాయక్ తండా, బూరుగల్ తదితర ప్రాంతాలలో సోదాలు నిర్వహించారు. పత్రాలు లేని 12 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
కామారెడ్డిలో కార్డాన్ సెర్చ్
కామారెడ్డి: నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణంలో గురువారం ఉదయం పోలీసులు కార్డాన్‌సెర్చ్ చేపట్టారు. పట్టణ సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దాదాపు 40 మంది పోలీసులు స్థానిక ఆర్బీనగర్లో సోదా జరిపారు. సరైన పత్రాలు లేని 26 ద్విచక్ర వాహనాలతో పాటు, 7 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. తనిఖీలు కొనసాగుతున్నాయి. -
అశ్వారావు పేటలో కార్డన్‌సెర్చ్
అశ్వారావుపేట: ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో పోలీసులు సోమవారం తెల్లవారుజామున కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. సత్తుపల్లి డీఎస్పీ కవిత ఆధ్వర్యంలో సిబ్బంది తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఇంటింటిని సోదా చేశారు. ఈ సందర్భంగా పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే స్థానికలు , అద్దెకుంటున్న వారి గుర్తింపును తనిఖీ చేశారు. ఎలాంటి గుర్తింపు పత్రాలు లేని 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. -
ఖానాపూర్‌లో కార్డన్ సెర్చ్
ఖానాపూర్: అదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో శనివారం పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. మండల పరిధిలోని గొసంపల్లి గ్రామంతో పాటు పలు లంబాడి తండాలను పోలీసులు, అటవీ శాఖ, ఎక్సైజ్ అధికారులు జల్లెడ పడుతున్నారు. ఈ గ్రామాల పరిధిలో ఇప్పటికే భారీగా టేకు దుంగలు, పెద్ద ఎత్తున గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. -
అంజయ్యనగర్‌లో పోలీసులు కార్డాన్ సెర్చ్
-
మలక్‌పేటలో పోలీసుల కార్డన్ సెర్చ్
హైదరాబాద్: మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం ఈస్ట్‌జోన్ డీసీపీ డాక్టర్ రవీందర్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సలీంనగర్ డివిజన్లోని ఆఫ్జల్నగర్, తీగలగూడ హట్స్, బంజరాబస్తీలలో 200 మంది పోలీసులు ప్రతి ఇంటినీ జల్లెడ పట్టారు. డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. సోదాలలో ధృవపత్రాలు సరిగాలేని 40 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకోగా..10 మంది అనుమానితులు, సూడాన్, ఉగాంఢా, సోమలియన్కు చెందిన 8 మంది విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. (మలక్‌పేట)