హైదరాబాద్: పాతబస్తీలో గురువారం ఉదయం నిర్వహించిన కార్డన్‌సెర్చ్‌లో భారీగా జరుగుతున్న అక్రమాలను గుర్తించారు. రెయిన్‌బజార్, ఫలక్‌నుమా, మొగల్‌పురా, చంద్రాయణ్‌గుట్ట పోలీస్‌స్టేషన్ల పరిధిలో సౌత్‌జోన్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో 200 మంది పోలీసులు పాల్గొన్నారు. ఇంటింటి తనిఖీల్లో భాగంగా నేర చరిత్ర ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
గాజుల తయారీ పరిశ్రమలు ఐదింటిపై దాడులు చేసి 30 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించారు. మామిడి పండ్ల గోదాములు తనిఖీ చేసి, రసాయనాలతో మామిడి పండ్లను మగ్గబెడుతున్నట్లు నిర్ధారించారు. ఇందుకు సంబంధించి వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. జంతువుల కొవ్వుతో నూనె తయారు చేస్తున్న కేంద్రంపై దాడి చేసి నిర్వాహకుడిని పట్టుకున్నారు. అలాగే, సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు.