హైదరాబాద్:నగరంలోని పాత బస్తీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నారు. డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో 350 మంది పోలీసులతో చాంద్రాయణగుట్ట, బార్కస్ ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుంచి కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు.
ఈ తనిఖీల్లో 60 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 25 మంది రౌడీషీటర్లు, లేట్‌నైట్ రోమియోలు, పాత నేరస్థులున్నారు. యూసుఫ్‌ఖాన్(27) అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని నుంచి 300 గుడుంబా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, చాంద్రాయణగుట్ట సెయింట్ ఆన్స్ స్కూల్ ప్రాంతంలో అక్రమంగా గ్యాస్‌ను రీఫిల్లింగ్ చేస్తున్న హబీబ్ జాఫర్(29)ను అరెస్ట్ చేసి అతని నుంచి 11 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేని 95 ద్విచక్ర వాహనాలు, ఒక జేసీబీ, నాలుగు కార్లు, ఐదు మూడు చక్రాల వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన ఈ సెర్చ్ కొనసాగుతుంది. మొత్తం 350 మంది పోలీసులు 20 టీమ్‌లుగా ఏర్పడి ఇంటింటికి తిరుగుతూ సోదాలు నిర్వహిస్తున్నారు. అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
పాతబస్తీలో కార్డెన్ సెర్చ్
Published Wed, Mar 9 2016 8:28 AM | Last Updated on Sun, Sep 3 2017 7:21 PM
Advertisement
Advertisement