రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.
మలక్‌పేటలో తప్పిన పెనుముప్పు
Published Thu, May 25 2017 1:56 PM | Last Updated on Tue, Sep 5 2017 11:59 AM
హైదరాబాద్: రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నగరంలోని మలక్‌పేట్ మెట్రో స్టేషన్ సమీపంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాలు..తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా.. నగరంలోని మలక్‌పేట్ వద్దకు రాగనే సాంకేతిక లోపం తలెత్తడంతో రోడ్డుపై నిలిచిపోయింది.
దీంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్ బస్సును రోడ్డు పక్కకు జరిపి ప్రయాణికులను కిందకు దించాడు. అదే సమయంలో దిల్‌సుఖ్‌నగర్ నుంచి చాదర్‌ఘాట్ వైపు వెళ్తున్న వెళ్తున్న లారీ అదుపుతప్పి ఆగి ఉన్న బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్‌కు తీవ్ర గాయాలు కావడంతో అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. లారీ ఢీకొట్టిన సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement