సాక్షి, వనపర్తి/ఆదిలాబాద్: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.
వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం తెల్లరాళ్లపల్లి తండాలో రెండు ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదం సందర్భంగా ఓ బస్సు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇక, ప్రమాదం జరిగిన సమయంలో రెండు బస్సుల్లో కలిపి వంద మందికిపైగా ప్రయాణీకులు ఉన్నట్టు సమాచారం.
మరోవైపు.. ఆదిలాబాద్ జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఆదిలాబాద్-భీంపూర్ మండలంలో కరంజీ (టి) నుంచి ఆదిలాబాద్ వైపు వస్తున్న బస్సు ఆర్లీ(టి) గ్రామంలోకి రాగానే అదుపుతప్పింది.ఈ అనంతరం బస్సు రోడ్డు పక్కనే ఉన్న బక్కి అనిల్ అనే రైతు కొట్టంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం సందర్భంగా కొట్టంలో కట్టేసి ఉన్న ఎద్దును ఢీ కొట్టింది. దీంతో, ఎద్దు మృతిచెందినట్టు తెలుస్తోంది. ఇక, ఈ ప్రమాదం సమయంలో బస్సులో 20 మంది ప్రయాణీకులు ఉన్నారు.
అదుపుతప్పి పశువుల కొట్టంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
ఆదిలాబాద్ - భీంపూర్ మండలంలో కరంజీ (టి) నుంచి ఆదిలాబాద్ వైపు వస్తున్న బస్సు ఆర్లీ(టి) గ్రామంలోకి రాగానే అదుపుతప్పి బస్సు రోడ్డు పక్కనే ఉన్న బక్కి ఆనిల్ అనే రైతు కొట్టంలోకి దూసుకెళ్లి.. కట్టేసి ఉన్న ఎద్దును ఢీ కొట్టింది.
ఆ… pic.twitter.com/AvqlYGKQnF— Telugu Scribe (@TeluguScribe) July 25, 2024
వీడియో క్రెడిట్: Telugu Scribe
Comments
Please login to add a commentAdd a comment