
ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, ట్రకు ఢీకొన్న ప్రమాద ఘటనలో ఆరుగురు మృతిచెందగా.. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స
అందిస్తున్నారు.
వివరాల ప్రకారం.. మహారాష్ట్రంలోని జల్నా జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాడిగోద్రి – జల్నా మార్గంలోని షాహపూర్ ఏరియా వద్ద మహారాష్ట్ర రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌కు చెందిన ఆర్టీసీ బస్సు.. ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా.. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించి ఘటనాస్థలిలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
#जालना वडीगोद्री मार्गावर शहापूर गावाजवळ आज सकाळी बस आणि आयशर ट्रकच्या भीषण अपघातात बसच्या वाहकासह ६ जण ठार झाले असून १० जण जखमी झाले आहेत. #Jalna #Accident pic.twitter.com/HJkbmoapzX
— AIR News Mumbai, आकाशवाणी मुंबई (@airnews_mumbai) September 20, 2024
అయితే, ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు.. బస్సు అద్దాలను పగులగొట్టి, చాలా మందిని బయటకు లాగి ప్రాణాలతో రక్షించారు. అనంతరం గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే బస్సు జెవారి నుంచి జల్నా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఇక, ట్రక్కులో ఆరెంజ్ పండ్లను తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
ఇది కూడా చదవండి: నా హత్యకు కుట్ర: పన్నూ