Madhavi Latha About Samantha Divorce: టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్‌గా గుర్తింపు పొందిన నాగ చైతన్య, సమంతలు విడిపోవడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏడేళ్లుగా ప్రేమించుకొని, నాలుగేళ్ల క్రితం(2017) పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న చై-సామ్ విడాకులు తీసుకోవడంతో.. అక్కినేని అభిమానులతో పాటు సమంత ఫ్యాన్స్ కూడా షాక్‌కు గురయ్యారు. వాళ్లు ఎందుకు విడిపోయారు? విడాకులకు కారణం ఎవరు? అంటూ మీడియా, సోషల్ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి. ఇక సినీ ప్రముఖులు కూడా చై-సామ్ విడాకులపై స్పందిస్తున్నారు. అలాంటి వారిలో సినీనటి మాధవీలత కూడా ఒకరు. తన పుట్టిన రోజు సందర్భంగా తాజాగా ఫేస్ బుక్ లైవ్‌లోకి వచ్చిన మాధవీలత.. . చై-సామ్ విడాకులపై షాకింగ్ కామెంట్స్ చేసింది.
సమంత చాలా మంచి అమ్మాయి అని, కానీ వందలో 99 శాతం మంది సమంత కారణంగానే విడాకులు తీసుకున్నారని.. ఆమెను తప్పుగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. పెళ్లైన తర్వాత కూడా గ్లామర్ దుస్తులు ధరిస్తుంది.. అందుకే చైతన్య విడాకులు ఇచ్చాడని కొంతమంది కామెంట్ చేయడం కరెక్ట్ కాదన్నది మాధవిలత. తెరపై ధరించే దుస్తులకి, భార్య భర్తల సంసారానికి సంబంధం ఉండదని ఆమె అన్నారు.
సమంత ప్రత్యూష ఫౌండేషన్ సహా ఎన్నో ఎన్జీవోలతో కలిసి చిన్న పిల్లలకు ఎన్నో ఆపరేషన్లు చేసి ప్రాణాలు కాపాడిందని చెప్పుకొచ్చారు. సమంత డబ్బు మనిషి కాదని సినిమాలు చేశాక వాటి ద్వారా వచ్చిన డబ్బు కూడా ఏం చేయాలో ఆమెకు తెలియదని మాధవీ లతా అన్నారు. గతంలో ఒక హీరో సమంతను ట్రాప్ చేసి ఆమె దగ్గర ఉన్న డబ్బు కోసం ఆమెను వాడుకున్నాడని, ఆ విషయం తెలిసి సమంత దూరం జరిగిందని ఆమె చెప్పుకొచ్చింది. ఇక పెళ్లయిన తర్వాత సమంతలో చాలా పరివర్తన వచ్చిందన్నారు. ధరించే దుస్తులను బట్టి అమ్మాయిల క్యారెక్టర్‌ను డిసైడ్ చెయ్యొద్దని మాధవీలత విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment