సాక్షి, అనంతపురం: సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలతపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆమె ఒక వ్యభిచారి అని.. తనను బీజేపీలో ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారో తెలియడం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జేసీ వ్యాఖ్యలపై మాధవీలత స్పందిస్తూ.. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు.
సినిమాల్లో నటించే వారంతా వ్యభిచారులు అనుకోవడం జేసీ మూర్ఖత్వం. తండ్రి జేసీ అనుచిత వ్యాఖ్యలను తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఎందుకు ఖండించరు. జేసీ ప్రభాకర్ రెడ్డి వయస్సుకు గౌరవం ఇస్తా.. అసభ్య భాషకు కాదు. నేను ఎవరికీ భయపడను. నన్ను కిడ్నాప్ చేసి.. హత్య చేస్తారా?. రాజ్యాంగ బద్ధంగా.. మహిళల రక్షణ కోసం మాట్లాడితే తప్పా?. జేసీ ప్రభాకర్ రెడ్డి కుసంస్కారి.. ఒళ్లంతా విష నాలుకలు కలిగిన వ్యక్తి’’ అంటూ మాధవీలత వ్యాఖ్యానించారు.
కాగా, జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాస్ సీరియస్ అయ్యారు. సినీనటి మాధవీలతపై జేసీ వ్యాఖ్యలు జుగుప్సాకరం. ప్రభాకర్ రెడ్డి ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు. బీజేపీ నేతలను హిజ్రాలతో పోల్చటం జేసీ ప్రభాకర్ రెడ్డి అవివేకానికి నిదర్శనం. అధికారంలో ఉన్నప్పుడే జేసీ ప్రభాకర్ రెడ్డి వీరంగం చేస్తారు. అధికారం లేకపోతే పలాయనం.. జేసీ విధానం. ఇప్పటికైనా ప్రభాకర్ రెడ్డిని టీడీపీ కంట్రోల్ చేయాలి. ఆయన ఇలాంటి వైఖరితో టీడీపీ ప్రభుత్వానికే చేటు అంటూ ఘాటు విమర్శలు చేశారు.
ఇదీ చదవండి: పాపం శంకర్.. గేమ్ ఛేంజర్ ఆయనతోనే తీయాల్సింది!
ఇక, అంతకుముందు ప్రభాకర్ రెడ్డి.. బీజేపీ నేతలపై సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీ నేతలు హిజ్రాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా తాడిపత్రిలో మహిళల కోసం ప్రత్యేక ఈవెంట్ నిర్వహిస్తే మీకేంటి సమస్యా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్.. నాపై లేనిపోని ఆరోపణలు చేశాయని మండిపడ్డారు. జేసీ ఈవెంట్‌పై విమర్శలు చేసిన బీజేపీ నేత యామిని శర్మ, సినీనటి మాధవీలతలపై జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment