సాక్షి, హైదరాబాద్ : ఇటీవలే భారతీయ జనతా పార్టీలో చేరిన సినీనటి మాధవీలత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ఎన్నో సార్లు మాట మార్చారని మండిపడ్డారు. హోదా కంటే ఎక్కువగా, ప్రత్యేక ప్యాకేజీ పేరుతో కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు భారీగా నిధులు ఇచ్చిందని వెల్లడించారు. కేంద్రం ఇచ్చిన నిధులకు ఎవరైనా లెక్కలు చెప్పాల్సిందేనని అన్నారు. పోలవరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని విమర్శించారు. లారీ ఇసుక ఎత్తేసినందుకు 5లక్షల రూపాయల బిల్లుపెట్టారంటూ మండిపడ్డారు.
తన పదో తరగతి నుంచే పవన్ అంటే ఇష్టమని చెప్పిన మాధవీలత, బీజేపీ సిద్ధాంతాలు నచ్చి ఆపార్టీలో చేరినట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో ఎక్కడైనా పార్టీ తరపున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో పనిచేయాలని ఉందని తన కోరికను బయటపెట్టారు. అంతేకాదు పోటీ గురించి మాట్లాడుతూ పార్టీ అవకాశం ఇస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పోటీ చేయమన్నా చేస్తానంటూ, తన మనసులోని మాటను చెప్పారు. తనకు ఎలాంటి ప్రాంతీయ భేదాభిప్రాయాలు లేవని, తమ కుటుంబంలో చాలామంది ఆర్మీలో పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment