Actress Madhavi Latha Comments on Drug Usage in Tollywood | డ్ర‌గ్స్ లేనిదే టాలీవుడ్‌లో పార్టీలు జ‌ర‌గ‌వు, మాధ‌వీల‌త‌ - Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌లో డ్ర‌గ్స్ వాడ‌కం: మాధ‌వీల‌త‌

Published Mon, Aug 31 2020 12:56 PM | Last Updated on Mon, Aug 31 2020 5:55 PM

Madhavi Latha Sensational Comments On Drug Culture In Tollywood - Sakshi

బాలీవుడ్‌లో 99 శాతం మంది డ్ర‌గ్స్ వాడుతున్నారంటూ సంచ‌ల‌న న‌టి కంగ‌నా ర‌నౌత్ ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈ వ్యాఖ్య‌ల‌ను న‌టి, బీజేపీ నాయ‌కురాలు మాధ‌వీల‌త స‌మ‌ర్థించారు. అంతేకాదు టాలీవుడ్‌లోనూ డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం న‌డుస్తోందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అస‌లు డ్ర‌గ్స్ లేనిదే కొన్నిసార్లు టాలీవుడ్‌లో పార్టీలు కూడా జ‌ర‌గ‌వ‌ని చెప్పారు. ఈ మేర‌కు ఫేస్‌బుక్‌లో ఆదివారం పోస్టు పెట్టారు. "సుశాంత్ కేసులో నార్కొటిక్స్‌ కంట్రోల్ బ్యూరో అడుగు పెట్టడం మంచిదే. బాలీవుడ్‌లో డ్రగ్స్ వాడకం బాగా ఉంది అన్నది నిజం. కానీ ఇదిగో అదిగో అని ఫైనల్‌గా తుస్సుమనిపిస్తారేమో అని నాకు అనుమానం. ఎందుకంటే అక్క‌డ అంతా బడా బాబులే కదా. అందులోను సినిమా రంగం ఇప్పటికే చెడ్డ పేరు అంటగట్టుకుంది. కానీ డ్రగ్స్ నేరం. ఒక పేదవాడికి అన్నం పెడతారో, లేదో కానీ మాద‌క ద్ర‌వ్యాల కోసం వేల‌కు వేలు పెడతారు. సరే, అది వాళ్ళ ఇష్టం. (చ‌ద‌వండి: ఆ గేమ్‌లోకి వెళ్లను)

భార‌త్‌లో అనుమ‌తి ఉన్నవి తినండి, తాగండి. దేశానికి ఆదాయం పెంచుకుంటే పెంచుకోండి. కానీ ఇతర దేశాల మాద‌క ద్ర‌వ్యాలు ఎందుకు? ఆ మత్తులో జరిగే అరాచకాలు ఎవరూ బయట పెట్టరు. తెలంగాణ‌ ఎన్సీబీ సార్లు.. మన టాలీవుడ్ మీద కూడా ఒక కన్నేయండి. డ్ర‌గ్స్ మన ఇండస్ట్రీలో బాగా వాడుకలో ఉంది. ఇక్కడ అది లేకుండా కొన్ని పార్టీలు జరగవు. 2009లో వచ్చారు, కానీ పొలిటికల్ అండతో వెనక్కి వెళ్లిపోయారు. పాపం.. డీల్ చేసిన ఆఫీసర్ నోరు నొక్కేసి వేరే శాఖ‌కు బ‌దిలీ చేశారు. చట్టానికి చేతులు చాలా పెద్దవి. అందుకే అవి చాచితే విరగొడతారు. మ‌త్తులో చాలా దారుణాలు జరుగుతున్నాయి. సినిమా వాళ్లు, ప‌బ్స్‌, విద్యార్థులు వాటిని బాగా వాడుతూ మాద‌క ద్ర‌వ్యాల వారికి భారీగా ఆదాయాన్ని పెంచుతున్నారు. కాస్త చూసి అదుపులో పెట్టండి." (చ‌ద‌వండి: సెలబ్రిటీల పెళ్లిపై మాధ‌వీల‌త విసుర్లు)

"అమ్మో నాకు భయంగా ఉంది. ఈ పోస్ట్ పెట్టాను అని నన్ను ఎవరైనా బెదిరిస్తారేమో? ఎవరు డ్రగ్స్ జోలికి పోరు. ఆ అధికారులు కూడా చూసీ చూడనట్లే ఉంటారు. నిజంగా పట్టుకుంటే వాళ్ళకి భయం. ఒకవేళ పట్టుకున్నా ప్రభుత్వాలు ఎలాగూ వదిలేయి అని  ఆఫీస‌ర్ల‌ను భ‌యపెడతాయి కదా. సరేలే.. నాకేమన్నా అయితే చట్టం చేతకానితనం అని నేనే కేసు పెట్టాల్సి వ‌స్తుంది ఏమో.." అని టాలీవుడ్‌లో డ్ర‌గ్స్ మాఫియాపై వ్యంగ్యంగా రాసుకొచ్చారు. (చ‌ద‌వండి: ‘రక్త పరీక్షలు నిర్వహిస్తే వారంతా జైలుకే’)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement