వివాదాలు ఆమెకు కొత్త కాదు.. తను అనుకుంటున్నది ఏదైనా కుండబద్దలు కొట్టి చెప్పే స్వభావం. లాక్‌డౌన్‌లో పెళ్లిళ్లు చేసుకున్న కొందరు సెలబ్రెటీలను ఉద్దేశించి నటి మాధవీలత చేసిన ఫేస్‌బుక్ పోస్ట్ మరోసారి ఆమెను వివాదాల్లోకి లాగింది. లాక్‌డౌన్ కొనసాగుతుండగా అతికొద్ది మంది అతిధుల సమక్షంలో పెళ్లిళ్లు చేసుకున్న సినీ ప్రముఖులపై తనదైన శైలిలో స్పందిస్తూ.. మాస్కులు పెట్టుకొని మరీ పెళ్లిళ్లు చేసుకోవడం ఎందుకు? ఇప్పుడు కాకపోతే ఇంకో ఏడాది.. పిల్ల దొరకదా లేక పిల్లోడు మారిపోతాడా? అలా మారిపోయే మనుషులతో బంధాలు ఎందుకు? కొన్నాళ్లు ఆగలేని వాళ్లు సంసారాలు చేస్తారా? అంటూ తన ఫేస్‌బుక్ ఖాతాలో రాసుకొచ్చింది.
మీరు అంటున్నది నిఖిల్ పెళ్లి గురించా అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ఏమో అంటూ సమాధానాన్ని దాటవేసింది. ‘పేద, మద్య తరగతి కుటుంబాలు లాక్‌డౌన్ నిబంధనలను పాటిస్తున్నారు. కానీ సెలబ్రటీలు మాత్రం మాస్కులు వేసుకొని మరీ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. నా పోస్ట్ కేవలం సెలబ్రెటీలను ఉద్దేశించి పెట్టినదే’ అంటూ క్లారిటీ మాత్రం ఇచ్చింది. దీంతో ఈ అమ్మడు ఇటీవల పెళ్లి చేసుకున్న నిఖిల్, దిల్ రాజుల గురించే పోస్ట్ చేసిందంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. (వారికి కూడా నా ధన్యవాదాలు: నిఖిల్)
మాధవీలత పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె అభిప్రాయాలను కొంతమంది సమర్థిస్తుంటే, కొంతమంది మాత్రం విమర్శిస్తున్నారు. ‘ఎవరి అభిప్రాయాలు వారివి. మీ ఉచిత సలహాలు ఎందుకు’ అంటూ ఫైర్ అవుతున్నారు. ‘నా ఫేస్‌బుక్ పోస్ట్ నా ఇష్టం. నా భావాలను చెప్పే హక్కు నాకుంది’ అంటూ పోస్ట్ చేసింది. నిఖిల్, డాక్టర్ పల్లవీ వర్మను అతికొద్ది మంది సమక్షంలో ఈనెల 14న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. (‘ప్రేమ’ సినిమాలో రేవతిలా చచ్చిపోతా)
Comments
Please login to add a commentAdd a comment