అక్కినేని ఇంట పెళ్లిసందడి.. ఆ విషయంలో సెంటిమెంట్‌! | Naga Chaitanya and Sobhita Dhulipala wedding venue Details Here | Sakshi

Naga Chaitanya-Sobhita: చైతూ- శోభిత పెళ్లి వేడుక.. ఆ విషయంలో సెంటిమెంట్‌!

Published Tue, Nov 12 2024 5:10 PM | Last Updated on Tue, Nov 12 2024 6:05 PM

Naga Chaitanya and Sobhita Dhulipala wedding venue Details Here

అక్కినేని హీరో అక్కినేని నాగార్జున ఇంట్లో త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ ఏడాది ఆగస్టులో వీరిద్దరు నిశ్చితార్థం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను నాగార్జున సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్వహించిన ఏఎన్నార్‌ శతజయంతి వేడుకల్లో కాబోయే అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ్ల సందడి చేసింది.

వచ్చేనెల డిసెంబర్ 4న వీరి పెళ్లి గ్రాండ్‌గా జరగనుంది. అయితే పెళ్లి వేదిక విషయంలో మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. తాజా సమాచారం ప్రకారం నాగచైతన్య- శోభిత పెళ్లి వేడుక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే జరగనుందట. ఎందుకంటే అక్కినేని కుటుంబానికి సెంటిమెంట్‌ కావడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అంతేకాకుండా తెలుగువారి సినీదిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం కూడా అక్కడే ఉంది. అందువల్లే పెళ్లి వేడుక అక్కడే నిర్వహిస్తే తాతయ్య ఆశీర్వాదాలు కూడా ఉంటాయని అక్కినేని కుటుంబసభ్యులు భావిస్తున్నారట. కాగా.. ఏఎ‍న్నార్ శతజయంతి వేడుకలు కూడా అక్కడే నిర్వహించారు.

పెళ్లి వేడుక కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే ప్రత్యేకంగా వేదికను తయారు చేస్తున్నట్లు టాక్. తెలుగువారి సంప్రదాయం ఉట్టిపడేలా వీరి వివాహా వేదికను అలంకరించనున్నారు. ఈ వేడుకలో టాలీవుడ్ సినీతారలు, రాజకీయ ప్రముఖులు, అత్యంత సన్నిహితులు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. దీంతో డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ విహహం అత్యంత వైభవంగా జరగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement