![Heroine Madhavi latha twits on Hyderabad roads and Painting - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2017/11/29/madhavi-latha.jpg.webp?itok=DM5znAQ5)
హైదరాబాద్: ఇవాంకా రాకతో హైదరాబాద్ నగరం చాలా అందంగా ముస్తాబైన విషయం తెలిసిందే. దీనిపై నటి మాధవిలత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాంకా వస్తుందని నగరంలో రోడ్లు, పేయింటింగ్‌లు వేసి అందంగా మార్చేశారు. మరీ మన అధినేతలు అమెరికాకు వెళ్లినప్పుడు కొత్తగా వాళ్లేం చేయరు ? అని ఆమె ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అతిథుల కోసం కాకుండా ప్రజల కోసం పని చేయాలని సూచించింది.
మన దేశంలో వీఐపీ ప్రాణాలకి తప్ప మామూలు మనుషులవి ప్రాణాలు కావేమో.. వారి వల్ల ఏలాంటి ప్రాజెక్టులు వస్తాయో తెలియదు కానీ.. వీఐపీల వల్ల ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు. అయినా మనం సిగ్గు లేకుండా అదే నాయకులకు ఓట్లేస్తామని తన ట్విట్టర్ ట్విట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment