IvankaTrump
-
వైట్‌హౌస్ ఒరలో ఇమడరనీ!
ఏ విధంగానూ తక్కువ కాదు. ఎందులోనూ.. ఎక్కువ కాదు. ఇద్దరిలా కనిపించే ఒకే ఒకరు. ఒకే మాట మీద ఉండే ఇద్దరు. మరేంటి.. పడదనీ.. వైట్‌హౌస్ ఒరలో ఇమడరనీ! సమ ఉజ్జీలంటే ఎవరికి మాత్రం.. పోరు పెట్టాలని ఉండదు? పోటీ చూడాలని ఉండదు? వయసులో పన్నెండేళ్ల వ్యత్యాసం అక్కాచెల్లెళ్ల మధ్య ఉంటే వాళ్లు తల్లీకూతుళ్లలా ఉంటారు. అదే వ్యత్యాసం తల్లీకూతుళ్ల మధ్య ఉంటే వాళ్లు అక్కాచెల్లెళ్లలా అనిపిస్తారు. ట్రంప్ భార్య మెలానియా వయసు 50 ఏళ్లు. ట్రంప్ కూతురు ఇవాంక వయసు 38 ఏళ్లు. అయితే వీళ్లు మాత్రం ప్రత్యర్థుల్లా కనిపిస్తున్నారు. ‘కనిపిస్తున్నారు’ అంటే ప్రత్యర్థులుగా ఉన్నట్లు కాదు. చూసే వారికి అనిపించడం. ఇందుకు కారణం ఉంది. ట్రంప్ ప్రస్తుత సతీమణి, మూడో భార్య మెలానియా. ట్రంప్ మొదటి భార్య కూతురు ఇవాంక. వైట్‌హౌస్‌లో ట్రంప్ తర్వాత వీళ్లిద్దరే ముఖ్యులు. మెలానియా ‘ప్రథమ మహిళ’ అయితే, ఇవాంక.. ట్రంప్ ప్రధాన సలహాదారు. రెండు కత్తులు అనుకోవచ్చా! అలా అనుకుంటే కనుక ట్రంప్‌ను ఒక ‘ఒర’ అనుకోవాలి. ట్రంప్‌ను ఒర అనుకుంటే.. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు అని కూడా అనుకోవాలి. నిజానికి వీళ్లిద్దరూ ఇమడకుండానే ఉంటున్నారా, ఇమడటం లేదని ప్రపంచం అనుకుంటోందా?! అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వ్యక్తి ఎవరైనా తన కుటుంబంలోని ముఖ్యుల్ని తొలి ప్రసంగపు వేదిక మీదకు తీసుకొస్తారు. ‘నేషనల్ కన్వెన్షన్’ అంటారు ఆ వేదికను. ట్రంప్‌ది రిపబ్లికన్ పార్టీ కనుక అది ‘రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్’. నాలుగు రోజుల కన్వెన్షన్ చివరిరోజు.. గురువారం రాత్రి స్టేజి మీద ట్రంప్‌తోపాటు మెలానియా, ఇవాంక ఉన్నారు. ట్రంప్ తర్వాత వేదికపైకి మొదట మెలానియా చేరుకున్నారు. తర్వాత ఇవాంక వచ్చారు. ఇవాంక నవ్వుతూ వచ్చి, తల్లికి విష్ చేసి, నవ్వుతూ వెళ్లి తండ్రికి అటువైపున నిలుచున్నారు. తనకు విష్ చేసిన ఇవాంకకు మెలానియా కూడా నవ్వుతూ విష్ చేసి, ఆమె అటు వెళ్లగానే ఇటు సీరియస్‌గా ముఖం పెట్టేశారు. ‘సీరియస్‌గా కాదు.. అది ఏవగింపు’ అంటోంది మీడియా! మర్నాడు మీడియాలో, సోషల్ మీడియాలో అంతా.. మెలానియా లుక్ గురించే! ‘స్టింక్ ఐ’ అన్నారు. అయిష్టం అన్నారు, అన్ ఇన్వైటింగ్ అన్నారు.. ఏవో చాలా పేర్లు. మొత్తానికి ఆ అమ్మాయంటే ఆమెకు పడటం లేదని ప్రపంచం అంతటా ఫోకస్ అయింది. నిజమా అది! పడట్లేదని చెప్పడానికి చాలా థియరీలు ఉన్నాయి. పడుతుందని చెప్పడానికీ? అందుకు థియరీలు అక్కర్లేదు కదా. ఈ తాజా ‘స్టింక్ ఐ’ థియరీ పైన కూడా ఎప్పట్లా మెలానియా, ఇవాంక ఏమీ కామెంట్ చేయలేదు. అమెరికన్ శ్వేతసౌథంలో గానీ, బ్రిటన్ బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో గానీ ఏ ఇద్దరూ ఒకరి గురించి ఒకరు తప్పుగా మాట్లాడుకోరు. నేరుగా దూషించుకోరు. వ్యంగ్యాస్త్రాలను సంధించుకోరు. బ్రిటన్ రాణి, ఆమె చిన్న మనవడు హ్యారీ భార్య మేఘన్ అలాగే ఉన్నారు. ఇక్కడ అమెరికాలో మెలానియా, ఇవాంకా కూడా ఒకరికొకరు అన్నట్లుగానే ఉన్నారు. వీళ్లమీద పుస్తకాలు రాసేవాళ్లే ఒకర్నొకరు ఇలా అన్నారని, అలా అన్నారని రాసేస్తుంటారు. ‘మెలనియా అండ్ మీ’ అని సెప్టెంబర్ 1న ఒక పుస్తకం విడుదల అవుతోంది. రాసింది మెలానియా పూర్వపు స్నేహితురాలు స్టెఫానీ విన్స్టన్. ఇవాంకను, ఆమె టీమ్‌ను మెలానియా ‘స్నేక్స్’ అన్నట్లు స్టెఫానీ అందులో రాశారు. నాలుగేళ్ల క్రితం ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం లో ఉన్నప్పుడు ఇదే నేషనల్ కన్వెన్షన్‌లో మెలానియా ఇచ్చిన ప్రసంగం అచ్చు గుద్దినట్లు 2008లో మిషెల్ ఒబామా చేసిన ప్రసంగమేనని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. వాటి గురించి మెలానియా తనతో మాట్లాడుతూ.. ‘ఇవాంక, ఆమె బృందం ఇచ్చిన టెక్స్ట్నే నేను ఆరోజు చదివాను. వాళ్లే నన్ను తప్పుదారి పట్టించారు. వాళ్లు పాములు’ అని అన్నారని స్టెఫానీ ఈ పుస్తకంలో రాశారు. మెలానియాకు, ఈ రచయిత్రికి సత్సంబంధాలు చెడిపోయాక రాయడం మొదలు పెట్టిన పుస్తకం కాబట్టి స్టెఫానీ తల్లీకూతుళ్ల మధ్య చిచ్చు పెట్టారని వైట్‌హౌస్ అంటోంది. అంతేకాదు.. మెలానియా, ఇవాంక రోజూ చక్కగా మాట్లాడుకుంటారని కూడా లోపలి వాళ్లు చెబుతున్నారు. ప్రథమ మహిళగా మెలానియా వైట్‌హౌస్‌లో అడుగు పెట్టిన నాటి నుంచే ఇద్దరి మధ్యా విభేదాలున్నాయి అంటూ గత జూన్‌లో మార్కెట్లోకి వచ్చిన ‘ది ఆర్ట్ ఆఫ్ హర్ డీల్’ అనే పుస్తకంలో మేరీ జోర్డాన్ అనే వాషింగ్టన్ పోస్ట్ రిపోర్టర్ రాశారు. వైట్‌హౌస్ లో ‘ఫస్ట్ లేడీస్’స్ ఆఫీస్’ అని ఉంటుంది. అయితే మెలానియా.. ట్రంప్ మొదటి భార్య కాదు. అలాంటప్పుడు ఆ ఆఫీస్ ఆమెది ఎలా అవుతుందని ఇవాంకా అడ్డుపుల్ల వేశారట! ఫస్ట్ లేడీస్’స్ ఆఫీస్‌ని ఫస్ట్ ఫ్యామిలీ’స్ ఆఫీసుగా మార్పించాలని ఇవాంకా చాలా ప్రయత్నించారని, ఆ ప్రయత్నాన్ని మెలానియా సమర్థంగా ఎదుర్కొన్నారని మేరీ రాసుకొచ్చారు. పుస్తకం వచ్చి రెండు నెలలు దాటిపోయింది. అందులోని తల్లీకూతుళ్ల సంవాదాలపై ఇప్పటివరకు ఇద్దరూ ఏమీ వ్యాఖ్యానించలేదు. ఒకళ్ల పట్ల ఒకళ్లు గౌరవంగా, బాధ్యతగానే ఉంటూ వస్తున్నారు. ఈ సంగతిని స్వయంగా స్టెఫానీ (‘మెలానియా అండ్ మీ’ రాసిన స్టెఫానీ కాదు. మెలానియా అధికార ప్రతినిధి స్టెఫానీ ఈవిడ) 2017లో ‘వ్యానిటీ ఫెయిర్’ పత్రికు ఇచ్చిన ఇంటర్వూ్యలో చెప్పారు. ‘వాళ్లిద్దరూ ఎంతో ఆత్మీయంగా ఉంటారు’ అని ఆమె తెలిపారు. మరి ఈ ‘పడకపోవడం’ అనే ప్రచారం ఏమిటి? వాళ్లిద్దరి మధ్యా అలాంటిదేమైనా ఉంటే బాగుండునని ఆశిస్తున్న వాళ్లు, ఉండే ఉంటుందని ఊహిస్తున్నవాళ్లు చేస్తున్నదే. -
అధ్యక్ష పదవికి డొనాల్డ్ ట్రంప్ నామినేషన్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష పదవికి రెండోసారి పోటీ చేస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా నామినేషన్ స్వీకరించారు. వైట్ హౌస్ సౌత్ లాన్ నుండి రిపబ్లికన్ పార్టీ తరపున నవంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు ఆయన అధ్యక్ష పదవికి నామినేట్ అయ్యారు. హృదయపూర్వక కృతజ్ఞతతో, అనంతమైన ఆశావాదంతో, అమెరికా అధ్యక్షుడిగా ఈ నామినేషన్‌ను అంగీకరిస్తున్నానని ట్రంప్ ప్రకటించారు. అపూర్వమైన మద్దతుతో గౌరవంతో ప్రజల ముందు నిలబడ్డానంటూ ట్రంప్ పేర్కొన్నారు. గత నాలుగేళ్లలోసాధించిన అసాధారణ పురోగతిపై గర్వపడుతున్నానని తెలిపారు. అలాగే రాబోయే నాలుగేళ్లలో అమెరికా ఉజ్వలమైన భవిష్యత్తుపై అనంతమైన విశ్వాసంతో ఉన్నామని ట్రంప్ అన్నారు. అటు అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రాట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జో బిడెన్‌పై విమర్శలు కురిపించారు. బిడెన్ అమెరికాను రక్షించేవాడు కాదని, అమెరికా ప్రతిష్టను, ప్రజల ఉద్యోగాలను నాశనం చేసేవాడని ఆరోపించారు. ట్రంప్‌ను ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్ పరిచయం చేయగా, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇవాంకా తన తండ్రి కోవిడ్-19కట్టడికి తీసుకున్న చర్యలు, ఆర్థిక విధానాలపై ప్రసంశలు కురిపించారు. ‘వాషింగ్టన్ డొనాల్డ్ ట్రంప్‌ను మార్చలేదు. డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్‌ను మార్చారు.’ అని వ్యాఖ్యానించారు. -
ఫోర్బ్స్ జాబితాలో నిర్మలా సీతారామన్ హవా
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. బీజేపీ ప్రభుత్వంలో తొలి ఆర్థిక మంత్రిగా రికార్డు దక్కించుకున్న ఆమో ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఒకరిగా నిలిచారు. అంతేకాదు ఈ లిస్ట్‌లో క్వీన్ ఎలిజబెత్-2, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె,సలహాదారు ఇవాంకా ట్రంప్‌ను కూడా వెనక్కి నెట్టి ముందుకు దూసుకొచ్చారు. న్యూజిలాండ్ ప్రధాని జసిందా ఆర్డెర్న్ కంటే నిర్మలా సీతారామన్ ముందున్నారు. 'ది వరల్డ్స్ 100 మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్' జాబితాలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రపంచంలో 34 వ ర్యాంకులో నిలిచారు. క్వీన్ ఎలిజబెత్-2 15 పాయింట్లు క్షీణించి 38వ స్థానం, ఇవాంకా ట్రంప్ 18 ర్యాంకులు పడిపోయి 42 వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఇతర భారతీయ మహిళల్లో రోష్ని నాదర్ మల్హోత్రా, 54 వ స్థానంలో నిలవగా, కిరణ్ మజుందార్ షా 65 వ స్థానంలో ఉన్నారు. 61 వ స్థానంలో రిహానా, 66 వ స్థానంలో బెయోన్స్ నోలెస్, 71 వ స్థానంలో టేలర్ స్విఫ్ట్, 81 వ స్థానంలో సెరెనా విలియమ్స్, 90 వ స్థానంలో రీస్ విథర్స్ స్పూన్, స్వీడిష్బాలిక గ్రెటా థన్‌బెర్గ్ 100 వ స్థానాన్ని దక్కించుకున్నారు. కాగా జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్ వరుసగా తొమ్మిదిసారి కూడా ఈ జాబితాలో నెంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకోవడం విశేషం. యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు ప్రెసిడెంట్ క్రిస్టీన్ లగార్డ్ (2), నాన్సీ పెలోసి (3), యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ (4), జనరల్ మోటార్స్ సీఈవో మేరీ బార్రా (5) మేరీ బార్రా (5), మెలిండా గేట్స్, అబిగైల్ జాన్సన్, అనా ప్యాట్రిసియా బోటిన్, గిన్ని రోమెట్టి, మారిలిన్ హ్యూసన్ మిగిలిన టాప్ 5 స్థానాలను దక్కించుకున్నారు. -
స్త్రీలోక సంచారం
పెప్సీ కంపెనీకి పన్నెండేళ్ల పాటు సేవలు అందించి, ఆ కంపెనీ సీఈవోగా ఈ ఏడాది అక్టోబర్ 2న పదవీ విరమణ పొంది, 2019 జనవరి వరకు ఛైర్మన్‌గా కొనసాగనున్న ఇంద్రా నూయి (62)ని న్యూయార్క్‌లోని ‘ఏషియా సొసైటీ’ అనే స్వచ్ఛంద సంస్థ ‘గేమ్ ఛేంజర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుతో సత్కరించింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు కొందరు ‘‘పెప్సీ నుంచి బయటికి వచ్చేశారు కదా. ఇక ఇప్పుడు ట్రంప్ కేబినెట్లో చేరిపోతారా?’’ అని అడిగిన ఒక ప్రశ్నకు నూయీ పెద్దగా నవ్వుతూ.. ‘‘నేను కనుక రాజకీయాల్లోకి వస్తే మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా రావచ్చు’’ అని అన్నారు. ‘‘పాలిటిక్స్‌కి నేను, నాకు పాలిటిక్స్ ఒకరికొకరం పడము. నేను అన్నీ బయటికే మాట్లాడేస్తాను. ఆచితూచి మాటల్ని వదల్లేను. అసలు దౌత్యం అంటే నాకు తెలీదు. నాలాంటి మనిషి రాజకీయాల్లోకి వచ్చిందంటే.. నా వల్ల మూడో ప్రపంచ యుద్ధం రావచ్చు. కనుక నేను రాజకీయాల్లోకి రాను’’ అని స్పష్టంగా చెప్పారు. నలభై ఏళ్ల పాటు రోజుకు 18 నుంచి 20 గంటలు పని చేసి, ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా ప్రఖ్యాతి చెందిన ఇంద్రా నూయి.. ‘‘ఇప్పుడు కొద్దిగా తీరిక దొరకడంతో.. విముక్తి పొందినట్లుగా ఉంది’’ అని అన్నారు. 1955 అక్టోబర్ 28న మద్రాసులో పుట్టిన ఇంద్రా కృష్ణమూర్తి.. ‘ఆమ్సాఫ్ట్ సిస్టమ్స్’ సంస్థ ప్రెసిడెంట్ రాజ్ కె.నూయిని వివాహం చేసుకున్నాక (1981) ఇంద్రా నూయి అయ్యారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. ప్రస్తుతం ఈ కుటుంబం కనెక్టికట్‌లోని గ్రీన్విచ్లో ఉంటోంది. ఐక్యరాజ్యసమితి యు.ఎస్. రాయబారిగా ఈ ఏడాది చివర్లో తను రాజీనామా చేయబోతున్నట్లు రెండు రోజుల క్రితం అకస్మాత్తుగా ప్రకటించి, అందరినీ నివ్వెరపరచిన నిక్కీ హేలీ (46) స్థానంలోకి.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కూతురు ఇవాంక ట్రంప్ (36) ను తీసుకోవచ్చని వస్తున్న వార్తల్ని స్వయానా ట్రంపే తోసిపుచ్చారు ‘‘డైనమైట్ లాంటి నా కూతురికి అది తగిన స్థానమే అయినప్పటికీ.. ఆమెను కనుక ఐరాస రాయబారిగా నియమిస్తే నాపై బంధుప్రీతి (నెపోటిజం) నింద పడుతుంది’’ అని ఆయన అన్నారు. ‘‘బహుశా నా కూతురికన్నా సమర్థమైన వాళ్లు ఆ స్థానానికి ఎవరూ లేకపోవచ్చు. అయినప్పటికీ నేను ఆమెను ఎంపిక చెయ్యడానికి సంశయిస్తాను. ఎందుకంటే మీరంతా రేపు నన్ను నిందించవచ్చు. నాకు నిజంగా లేని బంధుప్రీతిని మీరు నాకు అంటకట్టవచ్చు’’ అని ట్రంప్ మరికొంత వివరణ ఇచ్చారు. ఇవాంక కూడా.. తనకా పోస్టు పట్ల ఏమాత్రం ఆసక్తి లేదని ట్విట్టర్లో తెలిపారు. ఒక్కోసారి ఓటమిని కన్నా గెలుపును తట్టుకోవడం కష్టం అవుతుందేమో. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఏర్స్‌లో జరుగుతున్న 50 మీటర్ల ఉమెన్స్ స్విమ్మింగ్ ఫ్రీ స్టెయిల్ పోటీల్లో రజత పతకాన్ని గెలుచుకున్న అర్జెంటీనా క్రీడాకారిణి దెల్ఫియా నరెల్లా పిగ్నాటియల్లో తన విజయాన్ని తనే తట్టుకోలేక వలవల ఏడ్చేసింది. పతకం అందుకునే సమయంలో పెద్దగా ఏడుస్తూ ఆమె తన ఎడమ అర చేతిపై స్పెయిన్ భాషలో రాసుకున్న ‘గ్రాండ్‌మదర్’ అనే పదాన్ని, గుండె బొమ్మను అందరికీ చూపించడం ప్రేక్షకుల హృదయాన్ని టచ్ చేసింది. దేశంలో పెరుగుతున్న ఆత్మహత్యల్ని నిరోధించడం కోసం బ్రిటన్ ప్రభుత్వం ‘ఆత్మహత్యల నివారణ మంత్రి’గా ఒక మహిళను నియమించింది. కొత్తగా సృష్టించిన ఈ శాఖను బ్రిటన్ ప్రధాని థెరిసా.. జాకీ డోయల్ ప్రైస్ అనే పార్లమెంటు సభ్యురాలికి కేటాయించారు. అనంతరం లండన్‌లో జరిగిన 50 దేశాల ప్రతినిధుల మానసిక ఆరోగ్య సదస్సులో డోయల్ ప్రసంగించారు. బ్రిటన్‌లో యేటా 4,500 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ సంఖ్యను గణనీయంగా తగ్గించడం కోసం తన శాఖ కృషి చేస్తుందని డోయల్ తెలిపారు. -
అమెరికా అధ్యక్ష పీఠంపై ఓప్రా కన్ను?
అమెరికా అధ్యక్ష పదవికి పోటీచేసే విషయంపై మీడియా ఎంట్రపెన్యూర్, టెలివిజన్ సలహాదారు ఓప్రా విన్ఫ్రీ ‘గట్టిగా యోచిస్తున్నారని’ ఆమె సన్నిహిత మిత్రులిద్దరు సీఎన్ఎన్కు వెల్లడించారు. ఆదివారం బీవర్లీహిల్స్లో గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆమె పాల్గొని ఉత్తేజపూరిత ప్రసంగం చేశారు. ఆ తర్వాతే విన్ఫ్రీ వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తారన్న ఊహాగానాలు ఊపుందుకున్నాయి. అధ్యక్ష పదవికి పోటీ అంశాన్ని కొన్ని నెలల క్రితం ఓప్రా ప్రస్తావించారని తమ పేరు వెల్లడించడానికి ఇష్టపడని అమె మిత్రులిద్దరు చెప్పారు. ఈ విషయంపై వ్యాఖ్యానించడానికి విన్ఫ్రీ అధికార ప్రతినిధి నిరాకరించారు. అమెరికా వినోద రంగంలో విశేష కృషి చేసినవారికిచ్చే సెసిల్ డీమిల్ అవార్డు స్వీకరిస్తూ ఓప్రా అద్భుత ప్రసంగం చేశారని అన్ని వర్గాల నుంచి ప్రశంసలందుకున్నారు. మీడియాతోపాటు హాలివుడ్లో మహిళలపై సాగుతున్న లైంగిక వేధింపులను నిరసిస్తూ సాగుతున్న ‘మీ టూ ఉద్యమం’ ఆమె ప్రసంగంలో ప్రధాన అంశంగా నిలిచింది. ఎంతో ఆశావహ దృక్పథంతో, ‘ ఈ కొత్త రోజున ఆశారేఖ కనిపిస్తోంది’ అన్న మాటలు ఆమె మరో కోర్కెకు(అధ్యక్షపదవి) అద్దంపడుతున్నాయని అనేక మంది ఉదారవాదులైన ప్రముఖులు అర్థంచేసుకున్నారు. ఓప్రా బలమైన డెమోక్రాటిక్ అభ్యర్థి కావడానికి ఆమెకున్న డబ్బు, పేరు ప్రఖ్యాతులు సరిపోతాయని కిందటేడాది కొందరు అంచనావేశారు. ఓప్రా విన్ఫ్రీ షో అనే టెలివిజన్కార్యక్రమం ద్వారా జనం వ్యక్తిగత సమస్యలు విని ఊరట ఇచ్చే మాటలతో పరిష్కారాలు సూచించడం ద్వారా ఓప్రా అమెరికాలోనేగాక ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజల మన్ననలు పొందారు. అయితే, వరుసగా ఇద్దరు టీవీ ప్రముఖులను అధ్యక్ష పీఠం ఎక్కిస్తారా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ కూడా టీవీ రియాలిటీ షో ద్వారానే అందరికీ తెలిశారు. గతంలో అధ్యక్ష పదవికి పోటీపై అడిగిన ప్రశ్నలను ఆమె దాటవేశారు. ఓప్రా పోటీచేసే అవకాశముందని ప్రసంగం ముగిశాక 31 ఏళ్లుగా ఆమె జీవితభాగస్వామి స్టెడ్మన్గ్రహమ్చెప్పారు. ‘‘ అంతా ప్రజలే నిర్ణయిస్తారు. ఆమె తప్పక ఆ పనిచేస్తారు,’’ అని ఆయన తెలిపారు. 2008 ఎన్నికల్లో బరాక్ఒబామా, 2016లో మరో డెమొక్రాట్ హిల్లరీ క్లింటన్ తరఫున ఓప్రా ప్రచారం చేశారు. స్త్రీలు, పురుషులు ఎలా ప్రవర్తిస్తారో చెబుతూనే ఉన్నా! ‘‘వాస్తవానికి స్త్రీలు, పురుషులు ఎలా ప్రవర్తిస్తారో చెప్పడానికే నేను నా వృత్తిలో టెలివిజన్, సినిమా ద్వారా శాయశక్తులా ప్రయత్నించా. మన జీవితాల్లో అవమానాలు ఎలా భరిస్తాం, ప్రేమను ఎలా అనుభవిస్తాం, కోపంతో ఎలా ఊగిపోతాం, ఎలా ఓడిపోతాం, ఎలా పారిపోతాం, ఎలా కష్టాలు భరించి వాటిని అధిగమిస్తాం ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు చెప్పడానికి నేను చేయగలిగినంత చేశా. జీవితంలో అత్యంత నికృష్ట కష్టాలు తట్టుకుని నిలబడి ఘోరమైన సమయాల్లో సైతం ఆశావహమైన రేపటి ఉదయం కోసం వేచిచూసిన వ్యక్తులను ఇంటర్వ్యూ చేసి, వారి గురించి ప్రజలకు వర్ణించాను,’’ అంటూ ఓప్రా తన ప్రసంగంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. మరోసారి ‘నేను సైతం’ అని గొంతెత్తే అవసరం రాకుండా ఇక్కడ కూర్చున్న గొప్ప మహిళలు, ఉన్నతమైన పురుషులు వీరోచిత పోరు సాగిస్తున్నారు. వారి కృషి వల్లే ఓ కొత్త ఉషోదయం మన కళ్ల ముందు ఆవిష్కృతమౌంది,’’ అని ఓప్రా తన ప్రసంగం ముగించారు. ఓప్రాను మెచ్చుకున్న ఇవాంకా ఓప్రా ఉపన్యాసం విన్న ట్రంప్ పెద్ద కూతురు ఇవాంకా, ‘ కిందటి రాత్రి గోల్డెన్ గ్లోబ్స్‌లో ఓప్రా చేసిన ఉత్తేజపూరిత ప్రసంగం ఇప్పుడే చూశా. మనమంతా - స్త్రీలు, పురుషులు చేతులు, గొంతు కలపి ‘సమయం ముంచుకొచ్చింది’ అందాం’ అని ట్వీట్‌చేశారు. అయితే, ఆమె మాటలు కపట ధోరణికి అద్దంపడుతున్నాయని, తండ్రిపై లైంగిక వేధింపుల ఆరోపణలొచ్చినప్పుడు ఇవాంకా ఏం చేశారని పలువురు ట్విటర్లోనే ప్రశ్నించారు. సూపర్ మోడల్ క్రిసీ టెయిగన్ క్లుప్తంగా, ‘ఇవ్(ఇవాంకా) పో’ అని ఈసడించుకోగా, ప్రముఖ నటుడు ఆడమ్పాలీ, ‘ నీ తండ్రిపై చేసిన 16 లైంగిక వేధింపుల అభియోగాల సంగతేంటి?’ అని ప్రశ్నించారు. బాల్యమంతా కష్టాలమయమే! పెళ్లిగాని ఆఫ్రికన్అ మెరికన్ టీనేజ్ తల్లికి పుట్టిన ఓప్రా బాల్యంలో నానా కష్టాలు అనుభవించారు. ఇప్పుడు 63 ఏళ్ల ఓప్రాకు దాదాపు మూడొందల కోట్ల డాలర్ల ఆస్తులున్నాయి. ప్రస్తుతం ఆమె ‘ఓన్’ అనే కేబుల్ చానెల్ సీఈఓగానేగాక, సీబీఎస్ న్యూస్ మేగజీన్ కార్యక్రమం ‘60 మినిట్స్’కు స్పెషల్ కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నారు. వెయిట్ వాచర్స్ వంటి అనేక కంపెనీల్లో ఆమె పెట్టుబడులున్నాయి. సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
నిద్దురపో.. చెల్లెలా
పెద్దమ్మాయ్ ఈ మధ్యనే వచ్చెళ్లింది. చీరొక్కటి కట్టలేదన్న ఆ ఒక్క డిజప్పాయింట్మెంటే కానీ.. అన్నీ ఆడపిల్లలు వేసుకునే పూల డిజైన్ల గౌన్లతో ఇంట్లో అమ్మాయిలా కలిసిపోయింది. హైదరాబాద్‌లో ఉన్న ఆ రెండు రోజులూ ఇవాంకా.. పేరుకే ట్రంప్ కూతురు.. తీరుకు ఇండియా ఆడకూతురు. ఇదిగో.. ఆమెలాగే ఎవ్రీ ఇయర్ ఆమె తీసుకునే న్యూ ఇయర్ రిజల్యూషన్స్కూడా చాలా సింపుల్ సింపుల్‌గా ఉంటాయి! 2018కి ఇవాంకా చేసుకున్న గట్టి తీర్మానం ఏంటో తెలుసా? ఇంకొంచెం ఎక్కువ నిద్రపోవాలని! అవును. ‘న్యూ ఇయర్ రిజల్యూషన్.. స్లీప్ మోర్’ అని డిసెంబర్ 27 రాత్రి 8 గంటల 2 నిమిషాలకు ట్వీట్ చేశారు ఇవాంకా. ఆ ట్వీట్‌కు ఒక లింకును కూడా తగిలించారు. అక్కడ క్లిక్ కొట్టి లోపలికి వెళితే.. ‘చాలినంత నిద్ర లేకపోతే ఏం జరుగుతుందో..’ జెఫ్ స్టెబిల్ అనే బ్రెయిన్ సైంటిస్ట్ రాసిన ఆర్టికల్ చెబుతుంది. ఇవాంకా తీర్మానాలన్నీ ఇలానే ఉంటాయి. ఈట్ హెల్దీయర్, స్మైల్ మోర్, థింక్ స్మార్ట్..! ఇవన్నీ సింపులే. పాటించడమే కష్టం. ముఖ్యంగా ఆడవాళ్లకు కష్టం. వాళ్లు చేసి పెట్టాల్సిందే కానీ, వాళ్లకు చేసిపెట్టేవాళ్లెవరు? పైగా చుట్టూ ఇంత స్ట్రెస్! నిద్ర ఎలా పడుతుంది? స్మైల్ ఎలా వస్తుంది? ఎలాగంటే.. థింక్ స్మార్ట్. స్ట్రెస్‌ను తగ్గించుకుంటే తిండి మీద ధ్యాస కలుగుతుంది. చక్కగా తిన్నాక ఆటోమేటిక్‌గా నిద్రా ముంచుకొస్తుంది. లేచాక, అద్దంలో మీకు మీరు ఒక్క స్మైల్ ఇచ్చుకోడానికి టైమూ దొరుకుతుంది. -
మనకు సిగ్గు లేదు.. వారికే ఓట్లేస్తాం !
హైదరాబాద్: ఇవాంకా రాకతో హైదరాబాద్ నగరం చాలా అందంగా ముస్తాబైన విషయం తెలిసిందే. దీనిపై నటి మాధవిలత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాంకా వస్తుందని నగరంలో రోడ్లు, పేయింటింగ్లు వేసి అందంగా మార్చేశారు. మరీ మన అధినేతలు అమెరికాకు వెళ్లినప్పుడు కొత్తగా వాళ్లేం చేయరు ? అని ఆమె ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అతిథుల కోసం కాకుండా ప్రజల కోసం పని చేయాలని సూచించింది. మన దేశంలో వీఐపీ ప్రాణాలకి తప్ప మామూలు మనుషులవి ప్రాణాలు కావేమో.. వారి వల్ల ఏలాంటి ప్రాజెక్టులు వస్తాయో తెలియదు కానీ.. వీఐపీల వల్ల ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు. అయినా మనం సిగ్గు లేకుండా అదే నాయకులకు ఓట్లేస్తామని తన ట్విట్టర్ ట్విట్ చేశారు. -
ఇవాంక కోసం మోదీ స్పెషల్ గిఫ్ట్
సాక్షి, హైదరాబాద్ : గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ 2017 కోసం నగరానికి వచ్చిన అతిథి ఇవాంక ట్రంప్ కోసం దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఓ ప్రత్యేక బహుమతిని అందించారు. ఓ చెక్క పెట్టెను ఇవాంకకు బహుకరించారు. అది సాదాసీదా పెట్టె కాదు.. సూరత్ కళ సడేలీ హస్తకళతో కూడింది. వివిధ ఆకృతులతో పెట్టెపై అల్లికలు ఉండటమే ఈ కళ ప్రత్యేకం. ఈ బహుమతి పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఇవాంక మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. మరికాసేపట్లో ఫలక్‌నూమ ప్యాలెస్‌లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే విందులో ఆమె పాల్గొనబోతున్నారు. -
ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు 2017