పెద్దమ్మాయ్ ఈ మధ్యనే వచ్చెళ్లింది. చీరొక్కటి కట్టలేదన్న ఆ ఒక్క డిజప్పాయింట్‌మెంటే కానీ.. అన్నీ ఆడపిల్లలు వేసుకునే పూల డిజైన్‌ల గౌన్‌లతో ఇంట్లో అమ్మాయిలా కలిసిపోయింది. హైదరాబాద్‌లో ఉన్న ఆ రెండు రోజులూ ఇవాంకా.. పేరుకే ట్రంప్ కూతురు.. తీరుకు ఇండియా ఆడకూతురు. ఇదిగో.. ఆమెలాగే ఎవ్రీ ఇయర్ ఆమె తీసుకునే న్యూ ఇయర్ రిజల్యూషన్స్‌కూడా చాలా సింపుల్ సింపుల్‌గా ఉంటాయి! 2018కి ఇవాంకా చేసుకున్న గట్టి తీర్మానం ఏంటో తెలుసా? ఇంకొంచెం ఎక్కువ నిద్రపోవాలని! అవును. ‘న్యూ ఇయర్ రిజల్యూషన్.. స్లీప్ మోర్’ అని డిసెంబర్ 27 రాత్రి 8 గంటల 2 నిమిషాలకు ట్వీట్ చేశారు ఇవాంకా. ఆ ట్వీట్‌కు ఒక లింకును కూడా తగిలించారు.
అక్కడ క్లిక్ కొట్టి లోపలికి వెళితే.. ‘చాలినంత నిద్ర లేకపోతే ఏం జరుగుతుందో..’ జెఫ్ స్టెబిల్ అనే బ్రెయిన్ సైంటిస్ట్ రాసిన ఆర్టికల్ చెబుతుంది. ఇవాంకా తీర్మానాలన్నీ ఇలానే ఉంటాయి. ఈట్ హెల్దీయర్, స్మైల్ మోర్, థింక్ స్మార్ట్..! ఇవన్నీ సింపులే. పాటించడమే కష్టం. ముఖ్యంగా ఆడవాళ్లకు కష్టం. వాళ్లు చేసి పెట్టాల్సిందే కానీ, వాళ్లకు చేసిపెట్టేవాళ్లెవరు? పైగా చుట్టూ ఇంత స్ట్రెస్! నిద్ర ఎలా పడుతుంది? స్మైల్ ఎలా వస్తుంది? ఎలాగంటే.. థింక్ స్మార్ట్. స్ట్రెస్‌ను తగ్గించుకుంటే తిండి మీద ధ్యాస కలుగుతుంది. చక్కగా తిన్నాక ఆటోమేటిక్‌గా నిద్రా ముంచుకొస్తుంది. లేచాక, అద్దంలో మీకు మీరు ఒక్క స్మైల్ ఇచ్చుకోడానికి టైమూ దొరుకుతుంది.
నిద్దురపో.. చెల్లెలా
Published Thu, Dec 28 2017 11:56 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment