Madhavi Latha Shocking Comments On Samantha Pushpa Item Song Controversy - Sakshi
Sakshi News home page

Madhavi Latha: సమంత స్పెషల్‌ సాంగ్‌పై మాధవిలత షాకింగ్‌ కామెంట్స్‌

Published Thu, Dec 16 2021 2:39 PM | Last Updated on Mon, Dec 20 2021 11:40 AM

Actress Madhavi Latha Shocking Comments On Pushpa Special Song Over Case - Sakshi

Madhavi Latha Shocking Comments On Samantha Special Song In Pushpa: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా మూవీ ‘పుష్ప’లో సమంత చేసిన ఐటెం సాంగ్‌కు ఎంతగా రెస్పాన్స్‌ వస్తుందో అంతే రేంజ్‌లో వివాదాలు అలుముకుంటున్నాయి. ఊ ఉంటావా మామ.. ఊఊ అంటావా అంటు సాగే ఈ పాట ఓ వైపు వ్యూస్‌ పరంగా దూసుకుపోతూ యూట్యూబ్‌లో రికార్డు సృష్టిస్తోంది. మరో వైపు మగవారి మనోభవాలను దెబ్బతీశారంటూ ఈ పాటపై ఏపీ పురుషుల సంఘం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

చదవండి: Allu Arjun Shoulder Surgery: ‘గతంలో నా ఎడమ భుజానికి రెండుసార్లు సర్జరీ జరిగింది’

మగవాళ్లంతా చెడ్డవారు అనే అర్థం వచ్చేలా ఈ సాంగ్‌ ఉందని, వెంటనే దీనిని తొలగించాలంటూ డిమాండ్‌ చేశారు. అంతేగాక పుష్ప టీంతో పాటు సమంతపై కూడా కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో సమంత స్పెషల్‌ సాంగ్‌పై పురుషుల సంఘం పెట్టిన కేసుపై మాధవిలత స్పందిస్తూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. ఫేస్‌బుక్‌ వేదికగా ఆమె ఓ పోస్ట్‌ షేర్‌ చేస్తూ మహిళల పరువు పోయిందంటూ అసహనం వ్యక్తం చేసింది. ‘వాయమ్మో పుష్ప మూవీ సాంగ్ మీద కేసు అంటగా. ఈ లెక్కన ఇండస్ట్రీలో 98 శాతం పాటలు అలానే ఉంటాయి. సాంగ్స్ లేని మూవీ చెయ్యాలి.

చదవండి: గతంలో చాలా తప్పులు చేశాను, కొన్ని పబ్లిక్‌గానే జరిగాయి: స్టార్‌ హీరోయిన్‌

నేను కూడా అమ్మాయిల మీద రాసే పాటలకి కేసులు పెడతా. పుష్పలో రారా సామీ సాంగ్ మీద కేసు వేస్తా. ఏంటీ ఒక అమ్మాయికి మగాడిని చూస్తే.. అతను పిలిస్తే అంత చులకనగా వెంటపడి వెళ్లిపోద్దా? అబ్బాయి నడిచినచోట భూమిని మొక్కుతుందా? ఒక మహిళ పరువు పోయింది. ఛ నాకు నచ్చలే. నేనూ కేసు పెడతా. అంతే తగ్గేదేలే’ అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో సమంత స్పెషల్‌ సాంగ్‌ను వివాదాలు చుట్టుముట్టిన నేపథ్యంలో మాధవిలత పెట్టిన ఈ పోస్ట్‌ హాట్‌టాపిక్‌గా మారింది. దీనిపై పలువురు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement