Madhavi Latha Shocking Comments On Bigg Boss 5 Telugu Show Over Siri & Shannu - Sakshi
Sakshi News home page

‘బిగ్‌బాస్‌’కు సిగ్గులేదు.. ఆడపిల్లపై మానసిక అత్యాచారం.. మాధవీలత షాకింగ్‌ కామెంట్స్‌

Published Thu, Dec 9 2021 1:42 PM | Last Updated on Thu, Dec 9 2021 2:07 PM

Actress Madhavi Latha Shocking Comments On Bigg Boss 5 Telugu Show - Sakshi

Madhavi Latha Shocking Comments On Bigg Boss 5 Telugu Show: వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలిచే నటి మాధవీలత తాజాగా మరోసారి బిగ్‌బాస్‌ షోపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ మధ్య సిరి హన్మంత్‌ వాష్‌రూంలో తల బాదుకోవడాన్ని తప్పుపడుతూ.. బిగ్‌బాస్‌కు రూ.100 కోట్ల జరిమానా వేయిస్తానని చెప్పిన మాధవీ.. తాజాగా మరోసారి సిరి-షణ్ముఖ్‌ల రిలేషన్‌పైనే కామెంట్‌ చేసింది. 

షణ్ముఖ్‌  పదే పదే సిరి వ్యక్తిత్వం గురించి నీచంగా కామెంట్‌ చేస్తున్న విషయం తెలిసిందే.  ప్రతిసారి ఫ్రెండ్ షిప్ హగ్గు అంటూ సిరి తల్లి మాటలను తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. కంటి చూపులతో ఆమెను కంట్రోల్‌ చేస్తున్నాడు. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో అయితే సిరిపై మరింత సీరియస్‌ అయ్యాడు షణ్ముఖ్‌. ఆమెతోపాటు.. ఆమె తల్లి మాటాలను కూడా తప్పు అంటూ వాదించాడు. ‘అవతలి వాళ్లను ఆయన ఈయన అంటావు, నన్నేమో అరేయ్‌ ఒరేయ్‌ అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడతావు. మనిద్దరం ఉన్నప్పుడు వేరు, నలుగురిలో వేరు.. అవతలివాళ్ల ముందు నేను తక్కువైనా సరే నీకోసం ఫైట్‌ చేస్తున్నా.. కానీ మీ మమ్మీకి అవేం గుర్తులేదు, హగ్‌ ఒక్కటే గుర్తుంది..' అంటూ సిరిపై కోపం ప్రదర్శించాడు. దీంతో సిరి ఏం మాట్లాడలేకపోయింది. అయితే వీటన్నింటిపై స్పందిస్తూ నటి మాధవీలత ఓ సుదీర్ఘ పోస్ట్‌ను తన ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసింది. 

ఏమయ్యా బిగ్ బాస్.. సిగ్గులేని టీమ్‌ మీది.. ఆ బిగ్ బాస్ హౌస్ లో ఎంటా అరాచకం. ఒక ఆడపిల్లను బానిసను చేసి నవ్వకూడదు.. ఏడ్వకూడదు.. వంగకూడదు.. అనే మానసిక ఆత్యాచారం చేస్తుంటే.. ఎవడో పెళ్లాన్ని ఇంకోకడు డామినేట్ చేస్తుంటే.. వీకెంట్ ఊపుకుంటూ వచ్చిన మా నాగ్ మావ ఏమో అబ్బా ఎంట్రా ఇది అంటూ వగలు పోయి.. అమ్మా వద్దు అన్న హగ్గులు ఇప్పిస్తూ.. మీ ఫుటేజ్ కోసం ఆఖరికి నాగార్జున ని కూడా దిగజార్చిన మీకు టీఆర్పీ లేక ఏడుస్తున్నారు. ఒక కన్నతల్లి మాటని విలువ లేకుండా చేసిన. కూతురిని సపోర్ట్ చేస్తూ సభ్య సమాజానికి ఏం చెప్పాలి అనుకుంటున్నారో మా నాగ్ మావా.. ఎందండీ ఈ అరాచకం ఏందీ అంటా.. అలాంటి యాదవలకు బిగ్ బాస్ లో ప్లేస్ ఒకటి. వాడికే కప్ తగలబెట్టి మీ బిగ్ బాస్ సెట్ కూడా తగలబెట్టండి.. ఇలాంటి వాడికి కీరిటం పెడితే మీ బీబీ కొంపకి పైర్ యాక్సిడెంట్ అయి తర్వాత నిమిషాం తగలబడి పోతుంది చూడండి.. అసలు సమాజానికి ఏం చూపిస్తున్నారు ? యూత్ లో హగ్స్ అండ్ కిస్ లు తప్పేం కదా.. పక్కోడి పెళ్లాన్ని హగ్ చేసుకోవచ్చు అంటున్నారు. నాతో వాదిస్తున్నారు తప్పేంటని.

స్నేహం ముసుగులో కామ కాలపాలు చూడలేకున్నాము.. మీ బీబీ టీం చివరి ఎపిసోడ్ చూసి..మీ నిర్ణయం సమాజనికి ఉపయోగకరమైన ఇంపాక్ట్ ఇవ్వకపోతే బిగ్ బాస్ షో పై డైరెక్ట్ గా సూప్రీం కోర్టులో కేసు వేస్తారు. హైకోర్టులో కూడా వేస్తాను. ఇది జోక్ కాదు.. సీరియస్.. టైంపాస్ కోసం టీవీ చూద్దామంటే అవమానాలే కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులతో కలిసి చూడాలంటే సిగ్గుగా ఉంది. చెవిపై.. మెడపై.. హార్డ్ పై ముద్దులు పెట్టుకుంటే చూడటానికి అసహ్యంగా ఉంది .. అడల్ట్ షో చూస్తున్నామా అనే ఫీలింగ్.. ఓటీటీలో పర్సనల్ గా చూసే షోలా ఉంది.. తగలబెట్టండి సర్ బీబీ 5 వరస్ట్ టీం.. వరస్ట్ షో’అని మాధవీలత ఆరోపించింది. ప్రస్తుతం ఆమె పెట్టిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement