పెళ్లి ఎప్పుడు.. మాధవీలత స్ట్రాంగ్‌ కౌంటర్‌! | Maadhavi Latha Interesting Post On Her Marriage | Sakshi
Sakshi News home page

Maadhavi Latha: పెళ్లికి వయసు కంటే అవి చాలా ముఖ్యం, నేను రెడీగా లేను

Published Thu, Jun 1 2023 9:33 AM | Last Updated on Thu, Jun 1 2023 9:38 AM

Maadhavi Latha Interesting Post On Her Marriage - Sakshi

ఒక అమ్మాయికి 20-25 ఏళ్లు రాగానే.. అందరూ అడిగే ప్రశ్న పెళ్లి ఎప్పుడు?  ఒకప్పుడు ఇలాంటి ప్రశ్న ఎదురవ్వకముందే పెళ్లి చేసుకునేవారు.  కానీ ఈ జనరేషన్‌ అమ్మాయిలు వయసు రాగానే పెళ్లి చేసుకోవడం లేదు. ముందు కెరీర్‌పై దృష్టి పెడుతున్నారు. మంచి ఉద్యోగం లేదా బిజినెస్‌.. ఇలా ఏదో ఒక రకంగా తమ కాళ్లపై తాము నిలబడగలం అనే నమ్మకం వచ్చాకనే పెళ్లికి ఓకే చెబుతున్నారు. అయినా కూడా ఇప్పటికి అమ్మాయిల విషయంలో పెళ్లి ప్రస్తావన కామన్‌ పాయింట్‌ అయిపోయింది. పదే పదే పెళ్లి గురించి అడుగుతూ ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఇలాంటి ఇబ్బందే హీరోయిన్‌ మాధవీ లత పడుతున్నారట. 

‘న‌చ్చావులే’ చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగమ్మాయి.. తొలి సినిమాతోనే భారీ విజయం అందుకుంది. ఆ తర్వాత స్నేహితుడా, అర‌వింద్ 2 వంటి చిత్రాల్లో న‌టించి మెప్పించింది. సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాలకు దూరంగా ఉంటుంది. అయితే సోషల్‌ మీడియా ద్వారా మాత్రం ఎప్పుడూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది.

తాజాగా ఈ భామ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తరచు పెళ్లి గురించి అడుగుతూ ఇబ్బంది పెడుతున్నారో తెలియదు కానీ.. మాధవీ మాత్రం సోషల్‌ మీడియా ద్వారా సమాజంపై ఫుల్‌ ఫైర్‌ అవుతోంది.  ‘ఓ అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే వ‌య‌సు ఒక‌టే స‌రిపోదు. ఆమె శారీర‌కంగా, మాన‌సికంగా సిద్ధంగా ఉండాలి. పెళ్లి చేసుకోవ‌టం అనేది ఆమె నిర్ణ‌యం. ప్రస్తుతం నేను శారీకంగానూ, మానసికంగానూ పెళ్లికి రెడీగా లేను. నా భవిష్యత్తుపై కూడా నమ్మకంగా లేను. ఇది నా నిర్ణయం. నా జీవితం’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement