సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో పేదలకు నాలుగో విడత రేషన్ పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ మాధవిలత పేర్కొన్నారు. శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఈ నెల పదహారు నుంచి సరుకుల పంపిణీ చేస్తామని తెలిపారు. తెల్లరేషన్ కార్డు దారులకు ఒక్కో కుటుంబ సభ్యునికి 5కిలోల చోప్పున ఉచిత బియ్యం పంపిణీ చేస్తామన్నారు. అంత్యోదయ అన్నయోజన కార్డు దారులకు 35 కేజీల ఉచిత బియ్యం పంపిణీ, అన్నపూర్ణ కార్డు దారులకు 10కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారని చెప్పారు. (వారు బయట తిరిగితే చాలా ప్రమాదం: కలెక్టర్)
ప్రతీ కార్డుకు కిలో శనగపప్పు ఉచితంగా అందిస్తామన్నారు. లబ్ధిదారులు రేషన్ తీసుకునే సమయంలో ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. మాస్కులు ధరించి క్యూలో ఆరడుగుల దూరం పాటించాలని సూచించారు. వేలిముద్ర తప్పనిసరి కావటంతో రేషన్ షాపుల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రేషన్ కార్డు లేని పేదలకు కూడా సరుకులు పంపిణీ చేస్తామని వెల్లడించారు. సెప్టెంబర్ ఒకటి నుంచి జరగనున్న పంపిణీకి ప్రత్యేక వాహనాలు కూడా సిద్ధం అవుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment