సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీ లత ఏపీ రాజకీయాలపై తాజాగా స్పందించారు. ఒకప్పుడు సినిమాల్లో రాణించిన ఆమె ముక్కుసూటిగా సినిమా ఇండస్ట్రీపై తన అభిప్రాయాన్ని పంచుకోవడంతో పెద్దగా అవకాశాలు దక్కలేదు అని చెప్పవచ్చు. అయినా కూడా ఆమె వెనక్కు తగ్గలేదు.. తన పంతాను కొనసాగించింది. ఆపై పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీలో కీలకంగా వ్యవహరించారు.
ఏపీలో ఎన్నికల సెగ ప్రారంభమైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలను నమ్ముకుని తాను సింగిల్‌గానే బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించి గెలుపు రేసులో ముందున్నారు. ఇదే విషయాన్ని అనేక జాతీయ సర్వేలు కూడా వెళ్లడించాయి. మరోవైపు చంద్రబాబు మాత్రం బీజేపీ, జనసేనను నమ్ముకుని ఎన్నికల బరిలోకి దిగారు. ఇలాంటి సమయంలో ఏపీ రాజకీయాల గురించి మాధవీ లత ఇలా స్పందించారు. 'ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఎన్నికల్లో సీఎం జగన్‌ను ఓడించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతున్నడం వల్ల ఈజీగా గెలిచేద్దాం.. జగన్‌ని ఓడించేద్దాం అంటే అది అంత ఈజీ కాదు.
ఎందుకంటే సీఎం జగన్‌కు చాలా రాజకీయ ప్రణాళికలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రజలకు ఎక్కువ సంక్షేమ పథకాలు ఇచ్చి ఎంతో మేలు చేశారు. దీంతో ఏపీ ఎన్నికల్లో మళ్లీ ఆయనే గెలిచే అవకాశలు చాలా ఎక్కువగా ఉన్నాయి. డబ్బులు భారీగా ఖర్చు పెట్టిన కూడా జగన్‌ను రాజకీయంగా దెబ్బ కొట్టడం కష్టం. సీఎం జగన్‌ను దెబ్బ కొట్టాలి అంటే చాలా జాగ్రత్తగా మూడు పార్టీలు కష్టపడాలి. మూడు పార్టీలు కలిశాము కదా.. ఇంకేముందిలే అంటే కుదరదు. మూడు పార్టీలకు ఉన్న బలం అంతా కలుపుకుని గ్రౌండ్ లెవల్ నుంచి నిరంతరం కష్టపడి పనిచేసినా కూటమి గెలిచే అవకాశాలు చాలా తక్కువ.. జగన్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
ప్రజలు ఆయన్ను నమ్ముతున్నారు. కూటమిలోని మూడు పార్టీలు కష్టపడి పనిచేసినా గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాకపోతే సీట్లు రావా? అంటే ఖచ్చితంగా టీడీపీ,బీజేపీ, జనసేనలకు సీట్లు వస్తాయి. కానీ గెలుపు వస్తుందా? రాదా?? అధికారం వస్తుందా రాదా?? అనేది చాలా ముఖ్యం. ఉన్న బలం అంతా కూడబలుక్కొని ఎంతో కష్టపడితే తప్పితే సీఎం జగన్‌ని ఎవరూ ఓడించలేరు. అది అంత ఈజీ కాదు. అని 2024 ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేత, సినీ నటి మాధవీలత తన అభిప్రాయాన్ని సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు.
మాధవి లత తెలుగులో నచ్చావులే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. 2008లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత స్నేహితుడా, అరవింద్-2 లాంటి చిత్రాల్లో అలరించిచారు. సినిమాలకు విరామం ఇచ్చిన ఆమె 2018లో బీజేపీలో చేరారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి పరాజయం చెందారు.
Comments
Please login to add a commentAdd a comment